- Home
- Entertainment
- 1500 జీతానికి హోటల్ లో పనిచేసిన వెయిటర్, ప్రస్తుతం 2500 కోట్లు సంపాదించిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
1500 జీతానికి హోటల్ లో పనిచేసిన వెయిటర్, ప్రస్తుతం 2500 కోట్లు సంపాదించిన స్టార్ హీరో ఎవరో తెలుసా?
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరి రాత ఎప్పుడు మారుతుందో చెప్పడం కష్టం. అలాంటి అదృష్టమే పట్టింది ఓ స్టార్ హీరోకు. ఒకప్పుడు హోటల్ లో వెయిటర్ గా పనిచేసిన వ్యక్తి, ఇప్పుడు వందల కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకుంటున్నాడు. ఇంతకీ ఎవరా స్టార్ హీరో.

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వెతికితే దొరకని వింతలు ఉండవు. చాలామంది స్టార్ హీరోలు, హీరోయిన్లు జీవితల్లో ఎన్నో మిరాకిల్స్ జరిగాయి. ఎక్కడో అట్టడుగు స్థాయిలో ఉన్నవారు కూడా తమ టాలెంట్ తో కష్టపడి పైకి వచ్చి మంచి స్థాయిలో ఉన్నవారు చాలామంది ఉన్నారు. అలాంటి వారిలో ఓ స్టార్ హీరో గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈహీరో ఒకప్పుడు హోటల్స్ లో వెయిటర్ గా పనిచేశాడు. ఇప్పుడు సినిమాకు 100 కోట్లకు పైగా వసూలు చేస్తున్నాడు. ఇంతకీ ఎవరా స్టార్ హీరో?
భారతీయ సినిమా రంగంలో స్టార్ హీరోలు చాలామంది ఉన్నారు. అందులో ఒకరిగా నిలిచిన బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్. దాదాపు 33 ఏళ్ల సినీ ప్రస్థానంలో ఎన్నో మైలురాళ్లను ఆయన అధిగమించారు. భారీ పారితోషికాలు, విజయవంతమైన చిత్రాలు, అత్యధిక పన్ను చెల్లింపుదారుడిగా కూడా అక్షయ్ నిలిచారు. అంతే కాదు అత్యధిక విరాళం ఇచ్చిన వ్యక్తి కూడా ఆయనే. ఒక సందర్భంలో విపత్తు వస్తే ప్రభుత్వానికి 25 కోట్లు విరాళంగా ఇచ్చాడు అక్షయ్ కుమార్.
అయితే ఈ స్థాయికి చేరుకోవడానికి అక్షయ్ కుమార్ చేసిన ప్రయాణం అంత సులువైనది కాదు. తన సినీ జీవితాన్ని ప్రారంభించే ముందే, ఆయన చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ జీవనం సాగించారు. బాల్యంలో ధారాసింగ్‌ను చూసి ప్రేరణ పొందిన అక్షయ్, కరాటే, తైక్వాండో వంటి మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ తీసుకున్నారు. శిక్షణ కోసం బ్యాంకాక్ వెళ్లిన సమయంలో, జీవనాధారంగా అక్కడి ఓ రెస్టారెంట్‌లో వెయిటర్‌గా చేరారు. అప్పుడు ఆయనకు నెల జీతం ఎంతో తెలుసా కేవలం1500 మాత్రమే.
బ్యాంకాక్ నుంచి తిరిగి ముంబైకి వచ్చిన అక్షయ్, మోడలింగ్ ద్వారా కెరీర్ ప్రారంభించారు. కొద్ది కాలంలోనే ఇండస్ట్రీలో అవకాశాలు లభించాయి. తొలి సినిమా సౌగంధ్ తరువాత, దీదార్ అనే సినిమాకు అక్షయ్ కుమార్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసా 5001 మాత్రమే. “నేను మొదటి సినిమాకు అందుకున్న పారితోషికం రూ.5001. దీదార్ సినిమాకు గానూ నాకు ఈ చెక్ ఇచ్చారు,” అని ఒక ఇంటర్వ్యూలో అక్షయ్ కుమార్ వెల్లడించారు.
ఈరోజుల్లో అక్షయ్ కుమార్ ఒక్కో సినిమాకు వందల కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్నారు. అంతే కాదు, ఆయనే బాలీవుడ్‌లో అత్యధిక పన్ను చెల్లించే నటుల్లో ముందువరుసలో ఉన్నారు. స్టార్‌డమ్ పరంగా కూడా ఆయన స్థానం అద్భుతంగా ఉంది. అంతే కాదు ఈమధ్య కాలంలో అక్షయ్ కుమార్ సినిమాలు వరుసగా ప్లాప్అవుతున్నా.. ఆయన క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం కూడా ఏడాదికి నాలుగైదు సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు.
అక్షయ్ కుమార్ సినిమాకు 100 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. ముంబయ్ లో భారీగా ఆస్తులు, లగ్జరీ బంగ్లాతో పాటు, తన గ్యారేజ్ లో అదిరిపోయే పీచర్స్ కలిగిన కార్లతో హ్యాపీ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు అక్షయ్. ఇక ఆయన ఆస్తి దాదాపు 2500 కోట్ల వరకూ ఉంటుందని అంచన.
సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్ వంటి స్టార్ హీరోలతో పోటీగా నిలబడి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో అక్షయ్ కుమార్ తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. కష్టాల నుంచి పైకి వచ్చి, అత్యధిక పారితోషికం అందుకునే స్థాయికి చేరడం ఆయన కృషికి నిదర్శనం. బాలీవుడ్‌లో ఆయన ప్రస్థానం ఎంతో మంది యంగ్ స్టార్స్ కి ప్రేరణగా నిలుస్తోంది.