- Home
- Entertainment
- హీరోగా నటించకుండానే 80 కోట్లు సంపాదిస్తున్న నాగార్జున.. బిగ్ బాస్ 9కి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?
హీరోగా నటించకుండానే 80 కోట్లు సంపాదిస్తున్న నాగార్జున.. బిగ్ బాస్ 9కి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?
అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ప్రయోగాల బాట పట్టారు. నాగార్జున చివరగా నా సామిరంగ అనే చిత్రంలో హీరోగా నటించారు.

అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన కెరీర్ లో ఎన్నడూ లేని విధంగా ప్రయోగాల బాట పట్టారు. నాగార్జున చివరగా నా సామిరంగ అనే చిత్రంలో హీరోగా నటించారు. ఆ తర్వాత నాగార్జున సోలో హీరోగా మరో చిత్రం ప్రారంభించలేదు. త్వరలో నాగార్జున బిగ్ బాస్ సీజన్ 9 కి రెడీ అవుతున్నారు.
సెప్టెంబర్ నుంచి ఈ షో ప్రారంభం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. నాగార్జున హీరోగా సినిమా చేయకుండానే ఈ ఏడాది కొన్ని నెలల వ్యవధిలోనే దాదాపు 80 కోట్లు సంపాదిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
జూన్ లో విడుదలైన కుబేర చిత్రంలో ధనుష్ హీరోగా నటించగా, నాగార్జున మాజీ సీబీఐ అధికారిగా కీలక పాత్రలో నటించారు. శేఖర్ కమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నాగార్జున పర్ఫార్మెన్స్ కి ప్రశంసలు దక్కాయి. ఈ చిత్రానికి నాగార్జున 15 నుంచి 20 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు నాగార్జున సూపర్ స్టార్ రజినీకాంత్ కూలీ చిత్రంలో నెగిటివ్ రోల్ లో నటిస్తున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఆగస్టులో ఈ మూవీ గ్రాండ్ గా రిలీజ్ కి రెడీ అవుతోంది. కూలీ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ కోసం నాగార్జున 25 నుంచి 30 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం.
ఇక బిగ్ బాస్ సీజన్ 9 కోసం నాగార్జున ఏకంగా 30 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నారట. మూడవ సీజన్ నుంచి నాగార్జున బిగ్ బాస్ షో కి పోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. ఇలా కొన్ని నెలల వ్యవధిలోనే నాగార్జున 80 కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నారు.. అది కూడా హీరోగా ఒక్క సినిమాలో కూడా నటించకుండానే.