- Home
- Entertainment
- ANR and Krishnam Raju: ఏఎన్నార్, కృష్ణంరాజు కూడా కాపాడలేకపోయారు..ఘోరంగా దెబ్బతిన్న స్టార్ హీరో
ANR and Krishnam Raju: ఏఎన్నార్, కృష్ణంరాజు కూడా కాపాడలేకపోయారు..ఘోరంగా దెబ్బతిన్న స్టార్ హీరో
ANR and Krishnam Raju : అగ్ర హీరోలంతా వరుస విజయాలతో దూసుకుపోతున్న టైంలో ఒక్క టాలీవుడ్ హీరో మాత్రం డిజాస్టర్ చిత్రాలతో డీలా పడ్డారు. ఆ హీరో ఎవరు ? ఆ చిత్రాలు ఏంటి ? అనే వివరాలు ఈ కథనంలో చూద్దాం.

తెలుగు సినిమా రూపురేఖలు మారాయి
90వ దశకంలో తెలుగు సినిమా రూపురేఖలు మారిపోయాయి. టాలీవుడ్ సినిమాల బడ్జెట్, కలెక్షన్లు అమాంతం పెరుగడం ప్రారంభం అయింది ఇక్కడి నుంచే. 1990 ఏడాది టాలీవుడ్ అగ్ర హీరోలకు బాగా కలిసి వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి, కృష్ణ, విక్టరీ వెంకటేష్ ఈ ఏడాదిలో భారీ విజయాలు సొంతం చేసుకున్నారు. కానీ ఒక్క స్టార్ హీరో నటించిన చిత్రాలు మాత్రం బాక్సాఫీస్ వద్ద ఘోరంగా దెబ్బతిన్నాయి.
సంచలన విజయాలు అందుకున్న చిరంజీవి
ఆ హీరోకి 1990 సంవత్సరం ఏమాత్రం కలిసి రాలేదు. చివరికి సుమన్, శోభన్ బాబు కూడా 1990లో దోషి నిర్దోషి చిత్రంతో సూపర్ హిట్ కొట్టారు. ఒక్క హిట్టు లేకుండా 1990 లో ఊహించని షాక్ ఎదుర్కొన్న స్టార్ మరెవరో కాదు.. అక్కినేని నాగార్జున. మెగాస్టార్ చిరంజీవి ఆ ఏడాది కొండవీటి దొంగ, జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి సంచలన విజయాలు నమోదు చేసుకున్నారు.
విజయాల బాటలో బాలయ్య, వెంకటేష్
నందమూరి బాలకృష్ణ అయితే 1990లో లారీ డ్రైవర్, నారీ నారీ నడుమ మురారి లాంటి సూపర్ హిట్ అందుకున్నారు. ఈ ఏడాది బిగినింగ్ లో ప్రాణానికి ప్రాణం అనే చిత్రంతో బాలయ్యకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ తర్వాత తిరిగి పుంజుకున్నారు. ఈ మూవీలో బాలయ్య, మోహన్ బాబు కలిసి నటించారు. ఇక విక్టరీ వెంకటేష్ 1990లో బొబ్బిలిరాజా చిత్రంతో తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నారు.
ఘోరంగా దెబ్బ తిన్న నాగార్జున
కానీ నాగార్జునకి మాత్రం 1990లో ఊహించని ఫలితాలు ఎదురయ్యాయి. 1989లో నాగార్జున నటించిన శివ చిత్రం తిరుగులేని విజయం సాధించింది. అంతటి భారీ హిట్ తర్వాత నాగార్జున ఎలాంటి మూవీలో నటించినా ప్రేక్షకుల అంచనాలని అందుకోవడం సాధ్యం అయ్యేది కాదు. ఆ ఏడాది నాగార్జున నుంచి వచ్చిన ప్రేమ యుద్ధం, నేటి సిద్ధార్థ, ఇద్దరూ ఇద్దరే చిత్రాలు డిజాస్టర్ అయ్యారు. నేటి సిద్దార్థ చిత్రంలో నాగార్జున తండ్రిగా కృష్ణం రాజు.. ఇద్దరూ ఇద్దరే మూవీలో రియల్ లైఫ్ తండ్రి ఏఎన్నార్ రీల్ తండ్రిగా నటించారు. అటు కృష్ణంరాజు, ఇటు ఏఎన్నార్ కూడా ఆ చిత్రాలని కాపాడలేకపోయారు.
అదొక్కటే పాజిటివ్
ఆ ఏడాది నాగార్జున నటించిన శివ చిత్రం హిందీలో విడుదలై మంచి విజయం సాధించింది. అదొక్కటే నాగార్జునకి ఊరటనిచ్చే అంశం. కెరీర్ బిగినింగ్ లో ఇబ్బందులు ఎదుర్కొన్న నాగార్జున ఆ తర్వాత మాస్ హీరోగా, రొమాంటిక్ హీరోగా గుర్తింపు పొందారు. అన్నమయ్య చిత్రంలో నట విశ్వరూపం ప్రదర్శించి ఆధ్యాత్మిక చిత్రాలకు బ్రాండ్ గా మారారు.