- Home
- Entertainment
- ఆమె సత్తా ఏంటో చిరంజీవి, వెంకటేష్ లకు తెలుసు..శ్రీదేవికి చెమటలు పట్టించి దురదృష్టానికి బలైన హీరోయిన్
ఆమె సత్తా ఏంటో చిరంజీవి, వెంకటేష్ లకు తెలుసు..శ్రీదేవికి చెమటలు పట్టించి దురదృష్టానికి బలైన హీరోయిన్
Divya Bharti : పదహారేళ్ళ టీనేజ్ వయసులో శ్రీదేవి, మాధురి దీక్షిత్ లాంటి అగ్ర హీరోయిన్లకు చెమటలు పట్టించిన హీరోయిన్ ఒకరున్నారు. చివరికి ఆమె దురదృష్టానికి బలయ్యారు.

ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోయే హీరోయిన్
తెలుగు చిత్ర పరిశ్రమలో తమదైన ముద్ర వేసి కనుమరుగైన హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. తక్కువ కాలం హీరోయిన్లుగా రాణించినప్పటికీ కొందరు హీరోయిన్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎప్పటికీ ప్రేక్షకుల హృదయాల్లో గుర్తుండిపోతారు. అలాంటి వారిలో దివ్య భారతి ఒకరు. 1990లో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన దివ్య భారతి తెలుగు, హిందీ పరిశ్రమలలో ఒక వెలుగు వెలిగింది.
స్టార్ హీరోలకు విజయాలు అందించిన అదృష్ట దేవత
తెలుగులో వరుస బ్లాక్ బస్టర్ చిత్రాల్లో నటించిన ఆమె అగ్ర హీరోలకు విజయాలు అందించే అదృష్ట దేవతలా నిలిచింది. కానీ దివ్య భారతికి తన రియల్ లైఫ్ లో అదృష్టం లేకుండా పోయింది. 19 ఏళ్ళ అతి పిన్న వయసులో దివ్య భారతి మరణించి తిరిగిరానిలోకాలకు వెళ్ళిపోయింది. ఆమె ముంబైలో తాను నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ పై నుంచి ప్రమాదవశాత్తూ పడిపోయి మరణించింది అని చెబుతుంటారు. అయితే ఆమె మరణం ఇప్పటికీ మిస్టరీనే.
టీనేజ్ లోనే హీరోయిన్ గా ఎంట్రీ
దివ్య భారతి తెలుగులో విక్టరీ వెంకటేష్ బొబ్బిలి రాజా చిత్రంతో ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ సంచలన విజయం గా నిలిచింది. ఆ మూవీలో నటించే సమయంలో దివ్య భారతి వయసు 16 ఏళ్ళు మాత్రమే. అంటే టీనేజ్ అమ్మాయి. బొబ్బిలి రాజా సక్సెస్ తో ఏకంగా మోహన్ బాబు, చిరంజీవి లాంటి బడా స్టార్లతో నటించే అవకాశం దక్కించుకుంది. మోహన్ బాబుతో నటించిన అసెంబ్లీ రౌడీ, చిరంజీవితో నటించిన రౌడీ అల్లుడు చిత్రాలు సూపర్ హిట్స్ అయ్యాయి. దీనితో దివ్య భారతి నిర్మాతలకు గోల్డెన్ హీరోయిన్ గా మారిపోయింది.
శ్రీదేవికి సైతం చెమటలు పట్టించింది
అప్పట్లో ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్ల జాబితాలో దివ్య భారతి చేరిపోయింది. 90 దశకంలోనే దివ్య భారతి ఏకంగా 50 లక్షల పారితోషికం అందుకునే వారట. ఆ టైంలో మీద ఉన్న శ్రీదేవి, మాధురి దీక్షిత్ లాంటి బాలీవుడ్ హీరోయిన్లకు కూడా దివ్య భారతి తన క్రేజ్ తో చెమటలు పట్టించింది. గ్లామర్ విషయంలో శ్రీదేవి, మాధురి దీక్షిత్ లని తలదన్నే హీరోయిన్ వచ్చింది అని అప్పట్లో ప్రచారం జరిగింది. హిందీలో కూడా వరుస అవకాశాలు అందుకుంది.
ఇండియాలోనే గొప్ప హీరోయిన్ అయి ఉండేది
దివ్య భారతి సత్తా గమనించిన మోహన్ బాబు, చిరంజీవి ఆమె గొప్ప హీరోయిన్ అవుతుందని అంచనా వేశారు. మోహన్ బాబు ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ దివ్య భారతి బ్రతికుంటే ఇండియాలోనే టాప్ హీరోయిన్ అయి ఉండేది. అందం, అభినయం విషయంలో ఆమెకి తిరుగులేదు. కానీ ఆమె తలరాత.. త్వరగా అందరినీ వదిలి వెళ్ళిపోయింది అని మోహన్ బాబు అన్నారు.