- Home
- Entertainment
- Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
Bigg Boss Telugu 9: భరణి ఎలిమినేటెడ్.. టాప్ 5 సభ్యులు వీరే, ప్రియురాలి కోసం ఇమ్ము చేయబోతున్న త్యాగం ఇదే
కింగ్ నాగార్జున హోస్ట్ గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 లో భాగంగా సండే రోజు ఆసక్తికర పరిణామాలు జరిగాయి. కళ్యాణ్ ఇప్పటికే ఫైనలిస్ట్ గా అర్హత సాధించాడు. ఆ తర్వాత ఫైనలిస్ట్ లు ఎవరో నాగార్జున ఈ ఎపిసోడ్ లో రివీల్ చేశారు.

బిగ్ బాస్ తెలుగు 9
బిగ్ బాగ్ తెలుగు 9 షోలో సండే రోజు నాగార్జున బిగ్ బాస్ టైటిల్ ప్రైజ్ మనీ రివీల్ చేశారు. అదే విధంగా ఫైనలిస్ట్ లని కూడా ఖరారు చేశారు. బిగ్ బాస్ విజేతగా నిలిచిన వ్యక్తికి రూ 50 లక్షల ప్రైజ్ మనీ దక్కుతుంది అని నాగార్జున తెలిపారు. ఇంటి సభ్యులు ఒక్కొక్కరిని పిలిచి.. టైటిల్ గెలిస్తే ఆ ప్రైజ్ మనీతో ఏం చేస్తారు అని అడిగారు. దీనికి ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్ గా సమాధానం ఇచ్చారు. అమ్మా నాన్నల కోసం అప్పు చేసి ఇల్లు కట్టినట్లు ఇమ్మాన్యుయేల్ తెలిపాడు.
టైటిల్ గెలిస్తే ఇమ్ము ఏం చేస్తాడో తెలుసా
బిగ్ బాస్ టైటిల్ గెలిస్తే అందులో కొంత అమౌంట్ ని అప్పులకు కట్టేస్తానని తెలిపాడు. నన్ను నమ్ముకుని నన్ను ప్రేమిస్తున్న అమ్మాయి ఒకరున్నారు. ఆమె డాక్టర్ చదువుతోంది. కొంత డబ్బు ఉపయోగించి ఆమెని పీజీ చదివిస్తాను. మిగిలిన డబ్బుని తన ఫ్యామిలీ కోసం ఉపయోగిస్తాను అని ఇమ్మాన్యుయేల్ తెలిపాడు. మా అక్క పిల్లలని కూడా చదివిస్తాను అని ఇమ్మాన్యుయేల్ తెలిపాడు. భరణి తాను టైటిల్ గెలిస్తే చారిటి కోసం, ఓల్డేజ్ హోమ్ కోసం ఉపయోగిస్తానని తెలిపాడు.
రెండవ ఫైనలిస్ట్ గా తనూజ
ఆ తర్వాత ఫైనలిస్ట్ లని రివీల్ చేయడం ప్రారంభం అయింది. కళ్యాణ్ తప్ప మిగిలిన ఐదుగురిని నాగార్జున స్విమ్మింగ్ పూల్ వద్దకు పిలిచారు. పూల్ వద్ద ముత్యాల లాంటి ఆకారాలు ఉన్నాయి. వాటిని పట్టుకుని ఇంటి సభ్యులు ఒక్కొక్కరు నెక్స్ట్ ఫైనలిస్ట్ ఎవరు కావాలని భావిస్తారో వారిని మనసులో తలుచుకు పూల్ లో వదలాలి. చివర్లో పూల్ నుంచి ఒక పేరు రివీల్ అవుతుంది. వారే కళ్యాణ్ తర్వాత రెండవ ఫైనలిస్ట్ అవుతారు. ఆ విధంగా ఎంతో అందంగా తనూజ పేరు రివీల్ అయింది. దీనితో తనూజ ఫైనలిస్ట్ గా అవకాశం పొందింది.
పవన్, ఇమ్మాన్యుయేల్ లకు ఛాన్స్
ఆ తర్వాత మిగిలిన ముగ్గురు ఫైనలిస్ట్ లని కూడా రివీల్ చేశారు. మూడవ ఫైనలిస్ట్ గా డిమాన్ పవన్ నిలిచాడు. కళ్యాణ్ హ్యామర్ తో గోడని పగలగొట్టగా అందులో డిమాన్ పవన్ ఫైనలిస్ట్ అని వచ్చింది. ఆ తర్వాత నాల్గవ ఫైనలిస్ట్ గా ఇమ్మాన్యుయేల్ నిలిచాడు. దీనికి ఇక చివర్లో మిగిలింది సంజన, భరణి మాత్రమే. వీరిద్దరిలో ఒకరు ఫైనలిస్ట్ అవుతారు మరొకరు ఎలిమినేట్ అవుతారు. దీనితో ఉత్కంఠ మొదలైంది.
భరణి అవుట్, టాప్ 5 లిస్ట్ ఇదే
నాగార్జున సంజన, భరణి ఇద్దరినీ యాక్టివిటీ ఏరియాకి పిలిచారు. వారి మధ్యలో ఫీనిక్స్ బర్డ్ తిరుగుతూ ఉంటుంది. అది ఆగినప్పుడు దాని రెక్కలు లాగాలి. భరణి, సంజన అలాగే చేశారు. దీనితో భరణి ఉన్నవైపు ఎలిమినేట్ అని.. సంజన ఉన్నవైపు ఫైనలిస్ట్ అని వచ్చింది. దీనితో భరణి ఎలిమినేట్ కాక తప్పలేదు. మొత్తంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో టాప్ 5 ఎవరో తేలిపోయింది. కళ్యాణ్, తనూజ, పవన్, ఇమ్మాన్యుయేల్, సంజన ఫైనలిస్ట్ లుగా నిలిచారు. భరణికి ఇంటి సభ్యులు ఎమోషనల్ వీడ్కోలు పలికారు. టాప్ 5 సభ్యులు గార్డెన్ ఏరియాకి వచ్చి సెలెబ్రేట్ చేసుకున్నారు.

