- Home
- Entertainment
- ఎక్కువ లిప్ లాక్ సీన్లు చేసిన టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు..50 ప్లస్ ఏజ్ లో అరాచకం, మైండ్ బ్లాక్ అయ్యే లిస్ట్
ఎక్కువ లిప్ లాక్ సీన్లు చేసిన టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు..50 ప్లస్ ఏజ్ లో అరాచకం, మైండ్ బ్లాక్ అయ్యే లిస్ట్
టాలీవుడ్ లో ఎక్కువ లిప్ లాక్ సన్నివేశాల్లో నటించిన హీరోలు, హీరోయిన్ల జాబితా ఇక్కడ చూడవచ్చు. ఇందులో మహేష్ బాబు, అల్లు అర్జున్, అనుష్క, సమంత, కాజల్ తో పాటు 50 ప్లస్ ఏజ్ స్టార్ హీరో కూడా ఉన్నారు.

Tollywood Lip kisses
తెలుగులో రొమాంటిక్ జోనర్ లో తెరకెక్కే చిత్రాల్లో లిప్ లాక్ సన్నివేశాలు కామన్ అయిపోయాయి. 50 ఏళ్ళు పైబడిన సీనియర్ హీరోల నుంచి కుర్ర హీరోల వరకు అందరూ రొమాంటిక్ సీన్స్ లో నటిస్తున్నారు. టాలీవుడ్ లో నాగ చైతన్య, మహేష్ బాబు, అల్లు అర్జున్, రవితేజ, సిద్దు జొన్నలగడ్డ, అడివి శేష్, గోపీచంద్ లాంటి హీరోలు లిప్ లాక్ సన్నివేశాల్లో నటించారు. హీరోయిన్ల విషయానికి వస్తే సమంత, కాజల్ అగర్వాల్, అనుష్క శెట్టి, శోభిత ధూళిపాళ లాంటి వారంతా టాలీవుడ్ హీరోలతో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించారు. ఆ చిత్రాలు ఏవి అనే వివరాలు ఇప్పుడు చూద్దాం. కొందరు హీరోలు, హీరోయిన్లు మల్టిపుల్ టైమ్స్ రొమాంటిక్ సీన్స్ లో నటించారు.
నాగ చైతన్య-సమంత
అక్కినేని నాగ చైతన్య, సమంత ఏ మాయ చేసావె చిత్రంలో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించడం అప్పట్లో పెద్ద సంచలనం. గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రొమాంటిక్ ఎమోషనల్ డ్రామాలో చైతు, సమంత అద్భుతమైన కెమిస్ట్రీ పండించారు. ఫలితంగా ఏ మాయ చేసావె చిత్రం సూపర్ హిట్ అయింది.
మహేష్ బాబు - కాజల్ అగర్వాల్
చాకొలేట్ బాయ్ లా కనిపిస్తూ మహిళలని ఆకర్షించే హీరోల్లో మహేష్ బాబు ఒకరు. చాకొలేట్ బాయ్ లా ఉంటారు కానీ మహేష్ మాస్ మ్యానరిజమ్స్ అంటే యువతకి పిచ్చి. మహేష్ బాబు కూడా కొన్ని చిత్రాల్లో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించారు. అందులో ముందుగా చెప్పుకోవలసింది బిజినెస్ మాన్ మూవీ గురించి. ఈ మూవీలో కాజల్ అగర్వాల్ ని గ్లామరస్ గా ప్రజెంట్ చేసిన డైరెక్టర్ పూరి జగన్నాధ్.. మహేష్ బాబుతో లిప్ కిస్ సన్నివేశం చేయించారు.
అల్లు అర్జున్ - దీక్ష సేత్
టాలీవుడ్ లో లిప్ లాక్ సన్నివేశాల్లో ఎక్కువగా నటించే హీరోల్లో అల్లు అర్జున్ ముందు వరుసలో ఉంటారు. వేదం మూవీలో అల్లు అర్జున్ హీరోయిన్ దీక్షా సేత్ తో ముద్దు సన్నివేశంలో నటించారు. ఈ మూవీలో అల్లు అర్జున్ నటన అద్భుతంగా ఉంటుంది. క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో అల్లు అర్జున్, అనుష్క శెట్టి, మంచు మనోజ్, దీక్ష సేత్ ప్రధాన పాత్రల్లో నటించారు.
మహేష్ బాబు - సమంత
మహేష్ బాబు నటించిన మరో ముద్దు సన్నివేశం దూకుడు చిత్రంలో ఉంటుంది. సమంత, మహేష్ మధ్య లిప్ లాక్ సీన్ ఉంటుంది. నాగ చైతన్య తర్వాత సమంత మహేష్ బాబుతో బోల్డ్ సీన్ లో నటించింది. దూకుడు మూవీ మహేష్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటి.
అల్లు అర్జున్ - కాజల్ అగర్వాల్
కాజల్ అగర్వాల్ తో కూడా అల్లు అర్జున్ లిప్ లాక్ సన్నివేశంలో నటించారు. ఆర్య 2 మూవీలో బన్నీ, కాజల్ మధ్య ముద్దు సన్నివేశం ఉంటుంది. మిస్టర్ ఫర్ఫెక్ట్ లాగా నటించే అల్లు అర్జున్ లిప్ట్ లో ఉన్నప్పుడు కాజల్ కి లిప్ కిస్ ఇవ్వడం చాలా ఫన్నీగా ఉంటుంది. మ్యూజికల్ గా ఈ మూవీ రాణించినప్పటికీ కమర్షియల్ గా హిట్ కాలేదు.
గోపీచంద్ - అనుష్క శెట్టి
లక్ష్యం మూవీలో అనుష్క శెట్టి, గోపీచంద్ లిప్ లాక్ సీన్ లో నటించారు. లక్ష్యం మూవీ సూపర్ హిట్ అయింది. అనుష్క, గోపీచంద్ లక్ష్యం, శౌర్యం చిత్రాల్లో కలసి నటించారు.
అల్లు అర్జున్ - భాను శ్రీ మెహ్రా
అల్లు అర్జున్ లిప్ లాక్ సన్నివేశం చేసిన మరో మూవీ వరుడు. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్ గా భానుశ్రీ మెహ్రా నటించారు. ఆ మూవీలో బన్నీ, భానుశ్రీ మధ్య ముద్దు సన్నివేశం ఉంటుంది. ఈ చిత్రం డిజాస్టర్ గా నిలవడంతో భానుశ్రీకి ఆ తర్వాత అవకాశాలు రాలేదు.
రవితేజ - మీనాక్షి చౌదరి
50 ప్లస్ ఏజ్ లో కూడా రవితేజ రొమాంటిక్ సీన్స్ లో దూసుకుపోతున్నారు. ఖిలాడీ చిత్రంలో రవితేజ, మీనాక్షి చౌదరి లిప్ లాక్ సన్నివేశంలో నటించారు. రవితేజ లిప్ లాక్ సన్నివేశం చేసింది ఒక్క సినిమాలో మాత్రమే కాదు. రామారావు ఆన్ డ్యూటీ చిత్రంలో దివ్యాంశ కౌశిక్ తో.. టచ్ చేసి చూడు చిత్రంలో రాశి ఖన్నాతో ముద్దు సన్నివేశాల్లో నటించారు.
అడివి శేష్ - శోభిత, సయీ మంజ్రేకర్, మీనాక్షి
అడివి శేష్ కూడా మల్టిపుల్ మూవీస్ లో ముద్దు సన్నివేశాల్లో నటించారు. గూఢచారి లో శోభిత ధూళిపాళతో, మేజర్ లో సయీ మంజ్రేకర్ తో, హిట్ 2లో మీనాక్షి చౌదరితో ముద్దు సన్నివేశాల్లో నటించారు.
సిద్దూ జొన్నలగడ్డ - నేహా శెట్టి, అనుపమ
టాలీవుడ్ లో బోల్డ్ రొమాన్స్ చేసే హీరోల్లో ప్రస్తుతం సిద్ధూ జొన్నలగడ్డ ముందు వరుసలో ఉన్నారు. డీజే టిల్లు చిత్రంలో నేహా శెట్టితో ముద్దు సన్నివేశంలో నటించి రొమాన్స్ పండించారు. ఆ తర్వాత టిల్లు స్క్వేర్ లో అనుపమ పరమేశ్వరన్ తో లిప్ లాక్ సన్నివేశంలో నటించారు.
కార్తికేయ- పాయల్ రాజ్ పుత్
ఆర్ఎక్స్ 100 చిత్రంలో పాయల్ రాజ్ పుత్, కార్తికేయ చేసిన రొమాంటిక్ సీన్స్ సంచలనం సృష్టించాయి. బోల్డ్ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రంలో కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ లిప్ లాక్ సీన్స్ లో నటించారు.
అల్లు శిరీష్ - అను ఇమ్మాన్యుయేల్
ఊర్వశివో రాక్షసివో చిత్రంలో అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ బోల్డ్ రొమాంటిక్ సీన్స్ లో నటించారు. ఇద్దరి మధ్య లిప్ లాక్ సీన్స్ కూడా ఉంటాయి.