MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Akhanda 2 : బాలయ్య అభిమానులకు భారీ షాక్, ఆగిపోయిన అఖండ2 రిలీజ్ , కారణం ఏంటంటే?

Akhanda 2 : బాలయ్య అభిమానులకు భారీ షాక్, ఆగిపోయిన అఖండ2 రిలీజ్ , కారణం ఏంటంటే?

Akhanda 2 : నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్లతో ఎదురు చూసిన సినిమా అఖండా 2. ఈ సినిమా రిలీజ్ ఆగిపోయింది. ఇంతకీ అఖండ2 వాయిదాకు కారాణం ఏంటో తెలుసా?  మళ్లీ ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారు? 

2 Min read
Mahesh Jujjuri
Published : Dec 05 2025, 07:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
భారీ అంచనాల నడుమ..
Image Credit : Asianet News

భారీ అంచనాల నడుమ..

వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతున్నాడు బాలకృష్ణ.. వెంట వెంటనే నాలుగు హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకున్నాడు. డబుల్ హ్యాట్రిక్ దిశగా వెళ్తోన్న బాలయ్య సక్సెస్ లైన్ లో అఖండా 2 సినిమా ఐదొవది. ఈక్రమంలో ఈసినిమాపై అభిమానులు భారీగా ఆశలు పెట్టుకున్నారు. ఇక అంతే భారీ అంచనాల నడుమ రిలీజ్ రు రెడీ అయిన అఖండ 2 మూవీ రిలీజ్ ఆగిపోయింది. ఎప్పుడు రిలీజ్ అవ్వబోతోందో కూడా ఇంకా ప్రకటించలేదు. చివరి నిమిషంలో ఈసినిమా వాయిదాకు కారణం ఏంటి?

24
రిలీజ్ పై కోర్టుకెక్కింది ఎవరు?
Image Credit : 14 reels plus/Youtube

రిలీజ్ పై కోర్టుకెక్కింది ఎవరు?

డిసెంబర్ 5వ న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కావాల్సిన అఖండా 2 సినిమా బెనిఫిట్ షోలను ముందుగా రద్దు చేశారు. ఈ విషయంలోనే అభిమానులు చాలా నిరాశ చెందారు. కానీ అసలు సినిమానే మొత్తంగా రిలీజ్ ఆపేయడంతో.. నందమూరి అభిమానులకు షాక్ తగిలినట్టు అయ్యింది. సడెన్ గా ఈ సినిమా విడుదల వాయిదా వేయాలంటూ.. డిసెంబర్ 4 న ఎరోస్ ఇంటర్నేషన్ సంస్థ మద్రాస్ కోర్టును ఆశ్రయించడం వివాదంగా మారింది. రాత్రి వరకు ఎరోస్ సంస్థతో జరిపిన చర్చలు విఫలం కావడంతో సినిమా నిరవధికంగా వాయిదా వేసినట్టు తెలుస్తోంది.

Related Articles

Related image1
బాలకృష్ణ ను లయన్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? డబ్బింగ్ థియేటర్ బాలయ్యను చూసి భయపడ్డ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు?
Related image2
రాజమౌళి కి ఛాలెంజ్ విసిరిన జూనియర్ ఎన్టీఆర్, అల్పులు, అధములు అంటూ జక్కన్న పై తారక్ కౌంటర్లు
34
సోషల్ మీడియాలో వెల్లడించిన నిర్మాణ సంస్థ
Image Credit : youtube/14 reels

సోషల్ మీడియాలో వెల్లడించిన నిర్మాణ సంస్థ

అఖండ2 వాయిదాపై ఎక్స్ లో నిర్మాణ సంస్థ ఓ ప్రకటన కూడా రిలీజ్ చేసింది. భారమైన హృదయంతో అఖండ 2 సినిమా వాయిదా వేశామని తెలియచేయడానికి చింతిస్తున్నాం. కొన్ని సమస్యలు పరిష్కరించలేని పరిస్థితులు ఏర్పడ్డ కారణంగా ఈ సినిమాను అనుకున్న టైమ్ కు రిలీజ్ చేయలేకపోతున్నాం. ఇది మాకు చాలా బాధాకరమైన విషయం. ఈ సినిమా కోసం వెయిట్ చేస్తున్న ప్రతీ ఒక్కఅభిమానికి అఖండ వాయిదా వేయడం తీవ్ర నిరాశను కలిగించి ఉంటుంది. వారి పరిస్థితిని మేము అర్ధం చేసుకోగలం. ఈ సినిమా చూట్టు నెలకొన్న సమస్యలను పరిష్కరించడం కోసం ప్రతీక్షణం ప్రయత్నిస్తూనే ఉన్నాం. అభిమానులకు మా వల్ల కలిగిన ఈ అసౌకర్యానికి చాలా బాధపడుతూ.. క్షమాపణలు అడుగుతున్నాం.. ఈ పరిస్థితుల్లో మీ సహకారం మాకు ఎంతో అవసరం. అదే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. అన్ని సమస్యలు పరిక్షరించి.. త్వరలోనే అఖండ2 రిలీజ్ పై పాజిటీవ్ అప్ డేట్ ను అందిస్తాం అని 14 రీల్స్ ప్లస్ ట్వీట్ చేశారు.

With a heavy heart, we regret to inform you that #Akhanda2 will not be releasing as scheduled due to unavoidable circumstances.

This is a painful moment for us, and we truly understand the disappointment it brings to every fan and movie lover awaiting the film.

We are working…

— 14 Reels Plus (@14ReelsPlus) December 4, 2025

44
నందమూరి అభిమానుల్లో నిరాశ..
Image Credit : stockPhoto

నందమూరి అభిమానుల్లో నిరాశ..

నందమూరి అభిమానులు అఖండ2 పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. బాలయ్య అఖండ తాండవం టీజర్, ట్రైలర్, ప్రమోషన్స్ తో ఆ అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్‌ కు భారీగా డిమాండ్ ఉంది. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ప్రతీ సినిమా సూపర్ హిట్ అయ్యింది. దాంతో అఖండ సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కిన అఖండ 2: తాండవం పై కూడా అంచనలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా తమన్ మ్యూజక్ ఈసినిమాను నెక్ట్స్ లెవల్స్ కు తీసుకెళ్తుందన్న నమ్మకంతో ఉన్నారు అభిమానులు. ఇక ఈ సినిమా ను 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మిస్తుండగా.. బాలకృష్ణ కూతురు తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. సంయుక్త మీనన్, ఆది పినిశెట్టి, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.భారీ బడ్జెట్, హై ఆక్టేన్ యాక్షన్ సీన్లతో రూపొందిన అఖండ2 రిలీజ్ పై త్వరలో మరో ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
నందమూరి బాలకృష్ణ
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Bigg Boss Telugu 9: ఎలాగైనా రీతూని సైడ్ చేయాలని కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ కుట్ర.. వీళ్ళ స్ట్రాటజీతో భరణి బలి
Recommended image2
Akhanda 2 Premiers: అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు, తీవ్ర ఇబ్బందుల్లో నిర్మాతలు.. సినిమా రిలీజ్ పరిస్థితి ఏంటి ?
Recommended image3
Akhanda 2: అఖండ 2లో ప్రగ్యా జైస్వాల్ ఎందుకు లేదో తెలుసా ? స్టోరీ చెబుతూ ట్విస్ట్ రివీల్ చేసిన బాలయ్య
Related Stories
Recommended image1
బాలకృష్ణ ను లయన్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? డబ్బింగ్ థియేటర్ బాలయ్యను చూసి భయపడ్డ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు?
Recommended image2
రాజమౌళి కి ఛాలెంజ్ విసిరిన జూనియర్ ఎన్టీఆర్, అల్పులు, అధములు అంటూ జక్కన్న పై తారక్ కౌంటర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved