- Home
- Entertainment
- TV
- రాజమౌళి కి ఛాలెంజ్ విసిరిన జూనియర్ ఎన్టీఆర్, అల్పులు, అధములు అంటూ జక్కన్న పై తారక్ కౌంటర్లు
రాజమౌళి కి ఛాలెంజ్ విసిరిన జూనియర్ ఎన్టీఆర్, అల్పులు, అధములు అంటూ జక్కన్న పై తారక్ కౌంటర్లు
Jr NTR Challenges to Rajamouli : రాజమౌళి కి ఓపెన్ ఛాలెంజ్ విసిరాడు జూనియర్ ఎన్టీఆర్. షూటింగ్ లో తమను టార్చర్ చేస్తున్నాడని కంప్లైంట్ చేసిన తారక్.. 17 టేకులు తీసుకున్న ఒక సీన్ గురించి మాట్లాడుతూ.. జక్కన్నకు షాక్ ఇచ్చాడు.

రాజమౌళి ఎన్టీఆర్ బంధం..
ప్రస్తుతం తెలుగు పరిశ్రమను హాలీవుడ్ స్థాయిలో నిలబెట్టి.. ఆస్కార్ ను కూడా సాధించి పెట్టిన దర్శకుడు రాజమౌళి. వెండితెరపై తన కెరీర్ ను ఎన్టీఆర్ సినిమాతోనే స్టార్ట్ చేశాడు. స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో ఫస్ట్ సినిమానే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు జక్కన్న. ఈసినిమా తరువాత నుంచి తారక్ తో రాజమౌళి బంధం బలపడింది. మంచి స్నేహితులయ్యారు. రాజమౌళి ఎక్కువ సినిమాలు చేసిన ముగ్గరు హీరోలలో ఎన్టీఆర్ దే ఫస్ట్ ప్లేస్. జూనియర్ తో రాజమౌళి నాలుగు సినిమాలు చేశారు. స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి, యమదొంగ, ఆర్ఆర్ఆర్ ఈ నాలుగు సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి.
రాజమౌళి తో తారక్ చమత్కారాలు..
రాజమౌళి ఎంత పెద్ద దర్శకుడు అయినా.. ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరో అయినా.. ఈ ఇద్దరు కలిశారంటే.. చిన్న పిల్లల్లా మారిపోతుంటారు. ఒకరిని ఒకరు తిట్టుకోవడం, కౌంటర్లు వేసుకోవడం, కలబడిపోవడం ఇలా ఇద్దరు కలిస్తే.. ఫన్ మూమెంట్స్ ను ఎంజాయ్ చేస్తారు. నిజానికి ఈ ఇద్దరి మధ్య పదేళ్ళకు పైగా వయసు వ్యత్యాసం ఉంది. అయినా సరే చిన్ననాటి స్నేహితుల మాదిరిగా క్లోజ్ గా ఉండటం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. రాజమౌళి ముందు మాట్లాడాలంటేనే చాలామంది ఆలోచిస్తుంటారు. కానీ ఎన్టీఆర్ మాత్రం రాజమౌళిని ఏం అనాలనుకున్నా స్వతంత్రగా అనేస్తాడు. అంతే కాదు జక్కన్న గొప్పతనం గురించి, ఆయన పనితనం గురించి అద్భుతమైన విషయాలు చెప్పాలన్నా కూడా అది ఒక్క జూనియర్ ఎన్టీఆర్ కు మాత్రమే సాధ్యం ఎందుకంటే దర్శకుడిగా, వ్యక్తిగా రాజమౌళి ఏంటో తారక్ కు బాగా తెలుసు.
17 టేకులు చేయించిన జక్కన్న..
రాజమౌళి సినిమా అంటే.. ప్రమోషన్లు కాస్త డిఫరెంట్ గా ఉంటుంటాయి. ఆర్ఆర్ఆర్ కోసం కూడా ఇలాంటివి ఎన్నో ప్లాన్ చేశారు రాజమౌళి టీమ్. ఆ ఇంటర్వ్యూలలో ఎన్టీఆర్ రాజమౌళి సరదాగా గొడవలు పడిన సందర్భాలు చాలా ఉన్నాయి. షూటింగ్ విషయంలో రాజమౌళి టార్చర్ ను కళ్లకు కట్టినట్టు వివరిస్తుంటాడు ఎన్టీఆర్. ఈక్రమంలోనే నాటు నాటు పాటలో ఒక చిన్న స్టెప్ కోసం 17 టేకులు తీసుకున్నసందర్భాన్ని ఎన్టీఆర్ తో పాటు రామ్ చరణ్ కూడా గుర్తు చేశారు. నాటు నాటు సాంగ్ లో ఇద్దరు కలిసి చేసే లెగ్ స్టెప్ కోసం 17 టేకులు తీసుకున్నారు రాజమౌళి. అన్ని టేకులు తీసుకున్నా కానీ.. చివరకు అన్నీ వదిలేసి రెండో టేక్ ను ఓకే చేశారు. ఈ విషయం గురించి మాట్లాడుతూ.. రాజమౌళి గురించి తారక్ ఫన్నీ కామెంట్స్ చేశారు.
జక్కన్నకు ఛాలెంజ్ విసిరిన జూనియర్
ఇంటర్వ్యూలో రామ్ చరణ్ మాట్లాడుతూ.. '' ఒక్క చిన్న బిట్ కోసం 17 టేకులు చేయించారు.. అందులో చివరకు ఏ టేక్ ఒకే చేశారో అడగండి '' అని సుమతో అన్నాడు. అప్పుడు రాజమౌళి మాట్లాడుతూ.. " ఏది పర్ఫెక్ట్ గా ఉంటే అది చేస్తాం.. మీరు చేయలేపోయారు కాబట్టే అన్ని టేకులు తీసుకోవలసి వచ్చింది'' అని అన్నాడు. దాంతో సుమ కల్పించుకుని... ఎంత మాట అన్నారు. వారు చేయలేకపోవడమా.. కావాలంటే ఇక్కడ చేసి చూపిస్తారు అనేసింది. వెంటనే ఎన్టీఆర్ అందుకుని.. '' ఒక్క బిట్ కోసం అన్ని టేకులు తీసుకోవాలా..? రెండోది బాగానే ఉంది కదా... ముందే అది ఒకే చేయొచ్చు కదా.. అల్పులు .. అధములు అయిననవాళ్ల గురించి.. మనకు ఇక్కడ అసందర్భ ప్రేలాపనలు ఏలా..'' అంటూ రాజమౌళి కి కౌంటర్ వేశారు ఎన్టీఆర్. అంతే కాదు మేము చేయలేకపోయం అంటున్నారు కదా.. సినిమాలో మేం కాకపోతే ఆయన వేశాడా..? కావాలంటే ఆ నాటు నాటు స్టెప్ రాజమౌళి ని వేసి చూపించమనండి. నేను ఛాలెంజ్ విసురుతున్నా అని అన్నారు ఎన్టీఆర్.
ఎన్టీఆర్ ను నిలబెట్టిన రాజమౌళి
ఎన్టీఆర్ రాజమౌళి ఎప్పుడు ఎక్కడ ఎలా ఉన్నా.. పని విషయంలో మాత్రం ఇద్దరు చాలా స్ట్రిక్ట్ గా మెయింటేన్ చేస్తుంటారు. షూటింగ్ విషయం చాలా సీరియస్ గా తీసుకుంటారు. షాట్ గ్యాప్ లో మాత్రం కౌంటర్లు పేలుతుంటాయి. ఎన్టీఆర్ ఇచ్చిన అవకాశం తో దర్శకుడిగా తనను తాను నిరూపించుకున్న రాజమౌళి.. తారక్ ను పాన్ ఇండియా హీరోగా మార్చారు. ఆర్ఆర్ఆర్ తో జూనియర్ ను ఆస్కార్ రేంజ్ కు తీసుకెళ్ళాడు. ఇప్పుడు ఎన్టీఆర్ తో సినిమా చేయాలంటే.. భారీ బడ్జెట్ , పాన్ ఇండియా స్టోరీ తప్పనిసరి. ప్రస్తుతం తారక్ వరుసగా మూడు పాన్ ఇండియా సినిమాలను లైన్ చేసుకుని ఉన్నారు. ప్రశాంత్ నీల్ తో సినిమా అయిపోయిన తరువాత దేవర 2, ఆతరువాత మరో భారీ బడ్జెట్ మూవీతో సందడి చేయబోతున్నాడు.
వారణాసితో రాజమౌళి ఫుల్ బిజీ బిజీ..
ప్రస్తుతం మహేష్ బాబు తో వారణాసి బిజీలో ఉన్నాడు రాజమౌళి. అమెజాన్ అడ్వెంచర్ కాన్సెప్ట్ తో రూపొందుతున్న ఈ సినిమాను దాదాపుగా 1500 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నట్టు తెలుస్తోంది. గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళ స్టార్ ప్రిథ్వీరాజ్ సుకుమారన్ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నారు. ఈసారి హాలీవుడ్ ను జక్కన్న గట్టిగా టార్గెట్ చేసినట్టు సమాచారం. 2027 సమ్మర్ లో వారణాసి రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు టీమ్.

