- Home
- Entertainment
- TV
- బాలకృష్ణ ను లయన్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? డబ్బింగ్ థియేటర్ బాలయ్యను చూసి భయపడ్డ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు?
బాలకృష్ణ ను లయన్ అని ఎందుకు పిలుస్తారో తెలుసా? డబ్బింగ్ థియేటర్ బాలయ్యను చూసి భయపడ్డ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు?
Why Balakrishna Is Called Lion : నందమూరి నటరత్నం బాలకృష్ణ ను లయన్ అని అసలు ఎందుకు పిలుస్తారో తెలుసా? స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గమనించిన విషయం ఏంటి? బాలయ్యలో స్పెషల్ టాలెంట్ గురించి ఆయన ఏం చెప్పారు?

నందమూరి నటసింహం బాలయ్య..
నటసింహం బాలకృష్ణకు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. సినిమాల్లో ఆయన మార్క్ సెపరేట్ గా ఉంటుంది. డైలాగ్స్, యాక్షన్, డాన్స్, ఏదైనా సరే బాలయ్య మార్క్ కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా పవర్ ఫుల్ డైలాగ్స్ ను.. అంత బేస్ వాయిస్ తో చెప్పడం మరెవరికీ సాధ్యం కాదు. బాలకృష్ణ వాయిస్ లో మాత్రమే ఆ మ్యాజిక్ బేస్ వినిపిస్తుంటుంది. ఆ సౌండింగ్ కు నందమూరి అభిమానులు పూనకాలు వచ్చినట్టు ఊగిపోతుంటారు. బాలయ్య సినిమాల్లో ఒక్క అరుపుకే గుండె ఆగిపోయి మరణించిన విలన్స్ ఎంతో మంది ఉన్నారు. బాలకృష్ణ చేస్తేనే అటువంటి సీన్స్ కు ఆ క్రేజ్ ఉంటుంది. అది నందమూరి నటసింహానికి మాత్రమే సాధ్యం.
బాలయ్యను లయన్ అని ఎందుకు అంటారు..?
బాలకృష్ణ యాక్షన్స్ సీన్స్ చాలా గంభీరంగా ఉంటాయి. ఆయన ఫైటింగ్స్ సిల్వర్ స్క్రీన్ పై చూసి అభిమానులు తెగ ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఇలాంటి సన్నివేశాలు షూటింగ్ చేయడం ఒక ఎత్తు అయితే.. వాటికి డబ్బింగ్ చెప్పడం మరో ఎత్తు. బాలయ్య చేసే భారీ యాక్షన్ సీన్స్ కు డబ్బింగ్ థియేటర్లలో అంతే ఫోర్స్ తో డబ్బింగ్ చెపితే.. అక్కడి బాక్స్ లు బ్లాస్ట్ అవ్వాల్సిందే. బాలయ్య విషయంలో కూడా అదే జరుగుతుంది. ఆయన పవర్ ఫుల్ డైలాగ్స్ కు డబ్బింగ్ థియేటర్ షేక్ అవుతుందట. అందుకే ఆయనకు లయన్ అనే పేరు వచ్చినట్టు ఇండస్ట్రీలో పలువురు చెపుతుంటారు. ఆమధ్య కాలంలో మ్యుూజిక్ డైరెక్టర్ తమన్ ఈ విషయంపై క్లారిటీ ఇచ్చాడు.
బాలయ్యపై తమన్ కామెంట్స్..
బాలయ్యను ఎందుకు లయన్ అంటారు అనే విషయంపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్ క్లారిటీ ఇచ్చారు. డాకూ మహారాజ్ రిలీజ్ టైమ్ లో జరిగిన ప్రమోషన్ ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ.. "ఎందుకు బాలయ్యను లయన్ అంటారు అంటే.. ఆయన డైలాగ్ డెలివరీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆయన డబ్బింగ్ 1000 రెట్లు స్ట్రాంగ్ గా ఉంటుంది. ఆయన సినిమాల్లో నటించడం కాదు.. డబ్బింగ్ థియేటర్లో మళ్లీ నటిస్తారు. ఆ డైలాగ్ చెప్పేటప్పుడు.. షూటింగ్ లో ఎలా నటించారో.. అలాగే నటిస్తూ చెపుతారు. నేను డబ్బింగ్ థియేటర్ లో ప్రత్యక్షంగా చూశాను. ఆయన పవర్ చూసి షాక్ అయ్యాను.. ఆయనకు షూటింగ్ కు డబ్బింగ్ థియేటర్ కు పెద్ద తేడా లేదు'' అని తమన్ అన్నారు.
డబుల్ హ్యాట్రిక్ దిశగా బాలయ్య..
బాలకృష్ణ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. 65 ఏళ్ల వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. ఇప్పటికే హాట్రిక్ హిట్ కొట్టిన బాలయ్య.. నాలుగు సినిమాలతో సక్సెస్ ఫుల్ గా ఫిల్మ్ జర్నీ కొనసాగిస్తున్నాడు. ఇంకో రెండు సినిమాలు సక్సెస్ అయితే డబుల్ హ్యాట్రిక్ ఆయన ఖాతాలో పడుతుంది. ప్రస్తుతం రెండు సినిమాలు సెట్స్ మీద ఉండగా.. డిసెంబర్ లో ఒక సినిమా రిలీజ్ కు రెడీగా ఉంది. అందులో ఒకటి అఖండ2 కాగా, మరొకటి మలినేని గోపీచంద్ తో తెరకెక్కించబోయే సినిమా. గోపీచంద్ సినిమాలో బాలయ్య యోధుడిలా కనిపించబోతునట్టు తెలుస్తోంది. ఈ రెండు సినిమాలు కూడా హిట్ అయితే.. అరుదైన రికార్డ్ బాలయ్య సొంతం అవుతుంది.
అఖండ తాండవానికి అంతా సిద్ధం
ప్రస్తుతం బాలకృష్ణ అఖండ 2 సినిమాతో బిజీగా ఉన్నారు. అఖండ సినిమాక సీక్వెల్ గా తెరకెక్కుతోన్న ఈసినిమాను బోయపాటి డైరెక్ట్ చేస్తున్నాడు. బోయపాటి, బాలయ్యది హిట్ కాంబినేషన్. వీరిద్దరు కలిసి చేసిన సినిమాల్లో ఒక్కటి కూడా ప్లాప్ అవ్వలేదు. దాంతో అఖండ 2పై భారీ అంచనాలు ఉన్నాయి. అభిమానులు ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. డిసెంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా అఖండ 2 రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే ఈసినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ , టీజర్, ట్రైలర్ కు పూనకాలతో ఊగిపోయారు అభిమానులు . థియేటర్లలో బాక్సులు బద్దలయ్యేలా తమన్ మ్యూజిక్ అందించగా.. బాక్సాఫీస్ బద్దలయ్యే కలెక్షన్స్ వస్తాయన్న నమ్మకంతో ఉన్నారు టీమ్.

