- Home
- Entertainment
- వెంకటేష్ జోడీగా ఐశ్వర్య రాయ్, క్రేజీ కాంబోలో మిస్సయిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఏది?
వెంకటేష్ జోడీగా ఐశ్వర్య రాయ్, క్రేజీ కాంబోలో మిస్సయిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఏది?
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎన్నో కాంబినేషన్లు మిస్ అయ్యాయి. స్టార్ హీరోలతో మల్టీస్టారర్లు, హీరోల పక్కన స్టార్ హీరోయిన్ల కాంబినేషన్లు చాలా మిస్ చేసుకున్నారు ఆడియన్స్. అందులో వెంకటేష్, ఐశ్వర్యరాయ్ కాంబో కూడా ఉంది.

రీమేక్ ల రారాజు విక్టరీ వెంకటేష్
టాలీవుడ్‌లో 90వ దశకం స్టార్ హీరోలలో విక్టరీ వెంకటేష్ కూడా ఒకరు. తెలుగు పరిశ్రమలో ఆయనకు ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ మద్దతుతో వెంకటేష్ స్టార్ హీరోగా వెలుగు వెలిగారు. వెంకటేష్ అంటే రీమేక్ సినిమాల రాజుగా టాలీవుడ్ లో పేరుంది. 65 ఏళ్ల వయస్సులో కూడా వెంకీ, తన సినిమా కెరీర్‌ను విజయవంతంగా కొనసాగిస్తూ ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తున్నారు. సూపర్ హిట్ సినిమాలు చేస్తూ.. ఫ్యాన్స్ కు దిల్ ఖుష్ చేస్తున్నారు. రీసెంట్ గా ఆయన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మరోసారి బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్నారు. ఇప్పుడు వరుసగా సినిమాలు సిద్ధం చేస్తున్నారు.
KNOW
వెంకటేష్ జంటగా నటిస్తే స్టార్ డమ్ పక్కా
వెంకటేష్ కెరీర్‌లో ఆయన సరసన అనేక మంది టాప్ హీరోయిన్లు నటించారు. సౌత్ హీరోయిన్లతో పాటు బాలీవుడ్ స్టార్ బ్యూటీస్ తో కూడా వెంకటేష్ ఆడిపాడారు. బాలీవుడ్ ను ఏలిన ఎంత మంది టాప్ హీరోయిన్లతో వెంకటేష్ స్క్రీన్ షేర్ చేసుకున్నారు. కత్రినా కైఫ్ హీరోయిన్ గా మొదటి సినిమా మల్లీశ్వరి కూడా వెంకటేష్ జంటగానే నటించింది. ఈక్రమంలోనే వెంకటేష్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్, మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ నటించాల్సి ఉండి మిస్ అయ్యిందని మీకు తెలుసా?
వెంకటేష్, ఐశ్వర్యా రాయ్ కాంబినేషన్ లో సినిమా
వెంకటేష్, ఐశ్వర్యా రాయ్ కాంబినేషన్ లో సినిమా రావాల్సి ఉంది. దాదాపు కాంబో ఖరారు అయ్యింది అనుకున్న టైమ్ లో సడెన్ గా ఈ సినిమా మిస్ అయ్యింది. ఈ విషయాన్ని గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు జయంత్ సి పరాన్జీ వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ షాకింగ్ విషయాలు తెలిపారు. వెంకటేష్ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ ప్రేమించుకుందాం రా. ఈ సినిమాలో హీరోయిన్‌గా అంజలా జవేరి నటించింది. అయితే ఈ పాత్ర కోసం మొదట ఐశ్వర్యరాయ్‌ను తీసుకోవాలని జయంత్ అనుకున్నారు.
ప్రేమించుకుందాం రా సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్యరాయ్
ఈ విషయం గురించి ఆయన మాట్లాడుతూ.. "ఐశ్వర్య రాయ్ ఇండస్ట్రీకి కొత్తగా వచ్చినప్పటి రోజులు. నా బంధువుల ద్వారా ఆమె గురించి నాకు తెలిసింది. ఆమె వెంకటేష్ జోడీగా బాగుంటుంది అనిపించింది. ఈ పాత్రకు చాలా బాగా సరిపోతుందని నేను భావించాను.
ఈసినిమా కథ కూడా చెప్పాను, కథ బాగా నచ్చింది చేస్తాను అని అన్నారు. డేట్స్ కూడా ఇచ్చేసింది. కాని అప్పుడు కొన్ని కారణాల వల్ల ఈ సినిమా ఆమె చేయకుండా అయిపోయింది. దీంతో అంజలా జవేరిని రంగంలోకి దింపాము. అయితే అప్పటి నుంచి ఐశ్వర్యారాయ్ తో ఫ్రెండ్షిప్ నడుస్తూనే ఉంది. దాంతో ఆతరువాత రావోయి చందమామ సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి వెంటనే ఆమె ఒప్పుకున్నారు అని జయంత్ అన్నారు.
బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపిన ప్రేమించుకుందాం రా సినిమా
ప్రేమించుకుందాం రా సినిమా 1997లో విడుదలై యువతలో విపరీతమైన క్రేజ్‌ను సొంతం చేసుకుంది. జయంత్ సి పరాన్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. 28 ఏళ్ల క్రితమే ఈసినిమా 20 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. వెంకటేష్ కెరీర్ లో యూత్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్న సినిమాగా నిలిచింది.
అప్పట్లో యువత ఈ సినిమా చూసి ఉర్రూతలూగారు, ప్రేమికులయితే చెప్పనక్కర్లేదు. ప్రేమించుకుందాం రా ఆరోజుల్లో ఒక సంచలనం అని చెప్పవచ్చు. అంతే కాదు ఈసినిమాతోనే బాలీవుడ్ బ్యూటీ అంజలా జవేరి హీరోయిన్ గా టాలీవుడ్ లో అడుగు పెట్టింది.