MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అనుష్క శెట్టి సినిమాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉందా? నిజం ఎంత?

అనుష్క శెట్టి సినిమాలకు గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉందా? నిజం ఎంత?

టాలీవుడ్ స్టార్ హీరోయన్ అనుష్క శెట్టి సినిమాలు గుడ్ బై చెప్పబోతోందా? ఉమెన్ ఓరియెంటెడ్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన అనుష్క కెరీర్ ఎందుకు ముందుకు వెళ్లడంలేదు. స్వీటీ మనసులో ఉన్న ఆలోచన ఏంటి? 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Jul 30 2025, 01:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : instagram / Anushka Shetty

టాలీవుడ్ లో స్టార్ హీరోలకు సమానంగా అనుష్క ఇమేజ్

సౌత్ సినిమా ఇండస్ట్రీలో తక్కువ సమయంలోనే భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించిన హీరోయిన్‌లలో అనుష్క శెట్టి ఒకరు. ‘అరుంధతి’, ‘బాహుబలి’ వంటి భారీ హిట్లతో తన నటనను నిరూపించుకున్న ఈ స్టార్ హీరోయిన్, టాలీవుడ్ లో స్టార్ హీరోలకు సమానంగా ఇమేజ్ ను సొంతం చేసుకుంది. అయితే గత కొంతకాలంగా అనుష్క సినిమాలకు గ్యాప్ ఇస్తున్న విషయం తెలిసిందే.

అనుష్క నటించిన తాజా చిత్రం 'ఘాటి' విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ, రిలీజ్ డేట్ పై స్పష్టత లేకపోవడం ఫ్యాన్స్‌లో గందరగోళం ఏర్పడింది. ఇప్పటివరకు ఈ సినిమా రెండు సార్లు వాయిదా పడింది. కానీ ఇప్పటికీ రిలీజ్ తేదీపై మూవీ టీమ్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

DID YOU
KNOW
?
యోగా టీచర్ గా అనుష్క శెట్టి
అనుష్క శెట్టి సినిమాల్లోకి రాకముందు యోగా టీచర్ గా పనిచేశారు. ప్రస్తుతం మూవీస్ తగ్గించిన అనుష్క, మళ్లీ యోగా టీచర్ గా కెరీర్ స్టార్ట్ చేయబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
Image Credit : instagram/ Anushka Shetty

అనుష్క శెట్టి కెరీర్ పై రకరకాల ఊహాగానాలు

ఈ నేపధ్యంలో అనుష్క కెరీర్‌పై అనేక ఊహాగానాలు చెలరేగుతున్నాయి. ముఖ్యంగా ఆమె మొన్నటి వరకూ హైదరాబాద్ లో ఉండి.. రీసెంట్ గానే బెంగళూరుకు షిప్ట్ అయినట్టు టాక్ వినిపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అనుష్క సినిమాలకు బ్రేక్ ఇచ్చే ఉద్దేశంతోనే వెళ్తున్నారా? లేదా కొత్త ప్రయాణాన్ని ప్రారంభించాలనుకుంటున్నారా? అనే ప్రశ్నలు అభిమానులలో మొదలయ్యాయి.

35
Image Credit : instagram / Anushka Shetty

ఘాటి సినిమాను క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. ఉత్తరాంధ్రలో గంజాయి సాగు నేపథ్యంగా రూపొందిన ఈ పాన్ ఇండియా సినిమా, అనుష్క కెరీర్‌లో ఇంత వరకూ చేయని డిఫరెంట్ మూవీగా నిలవబోతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన టీజర్, పోస్టర్లలో అనుష్క లుక్ కు పాజిటివ్ రెస్పాన్స్‌ వస్తోంది.

అయితే సినిమా విడుదల వాయిదా పడటమే కాదు, అనుష్క తదుపరి ప్రాజెక్ట్ గురించి ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవడంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు. గతంలో అరుంధతి, బాహుబలి లాంటి సినిమాల్లో పవర్ ఫుల్ పాత్రల్లో కనిపించిన ఈ స్టార్ హీరోయిన్ చేసిన సినిమాలు ఆతరువాత పెద్దగా గుర్తింపు పొందలేదు.

45
Image Credit : Instagram / Anushka

అనుష్క శెట్టి యోగా టీచర్ గా మారబోతోందా?

అనుష్క ప్రస్తుతం తన వ్యక్తిగత జీవితం మీద దృష్టి పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని సోషల్ మీడియా వార్తల ప్రకారం ఆమె బెంగళూరులో యోగా టీచర్‌గా జీవితం గడపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అనుష్క ఇంకా సినిమాల్లో నటించాలని అభిమానులు కోరకుంటున్నారు. ఘాటి సినిమా విజయం అనుష్క కెరీర్‌ను మరో మలుపు తిప్పే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈసినిమా హిట్ అయితే ఆమె మళ్లీ వరుసగా సినిమాలు చేస్తుందన్న నమ్మకంతో ఉన్నారు. ఘటి సక్సెస్ తో అనుష్క ఇండస్ట్రీలో యాక్టివ్‌గా మారే అవకాశం ఉందని సినీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది.

55
Image Credit : Instagram / Anushka

మీడియాకు కాస్తదూరంగా ఉంటారు అనుష్క. ఒక వేళ ఏదైనా ఇంటన్వ్య ఇచ్చి ఉంటే.. దానిద్వారా అయినా తన భవిష్యత్ ప్రణాళికలపై స్పష్టతనిచ్చే అవకాశం ఉండేది అని అభిమానులు చర్చించుకుంటున్నారు. ఈలోపు సోషల్ మీడియాలో ఆమె గురించి గాసిప్స్, ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఘాటి అనుష్క సినీ ప్రయాణానికి టర్నింగ్ పాయింట్‌గా మారుతుందా లేదా అనేది రిలీజ్ తరువాత చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
అనుష్క శెట్టి
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
AK 47 3 Days Collections: ఆదర్శ కుటుంబం రివ్యూ, వెంకటేష్‌, త్రివిక్రమ్‌ సినిమా హిట్టా ఫట్టా?
Recommended image2
Jyoti Poorvaj: 15 రోజులు ఇంటికి వెళ్ళలేదు, అతడిని పెళ్లి చేసుకోవాలని అప్పుడే డిసైడ్ అయ్యా.. డబ్బు కోసం కాదు
Recommended image3
Rohith Naidu Remuneration: సంచలన కంటెస్టెంట్‌ రోహిత్‌ బిగ్‌ బాస్‌ పారితోషికం ఎంతో తెలుసా? ఇందులోనూ అన్యాయమేనా
Related Stories
Recommended image1
ఆ చంద్రుడు లేనిదే ఈ సూర్యుడు లేడు, స్టేజ్ పైనే కన్నీరు పెట్టిన రచ్చ రవి, జబర్థస్త్ లో ఎమోషనల్ మూమెంట్
Recommended image2
ఆడిషన్స్ కు పాస్ పోర్ట్ సైజ్ ఫోటోతో వెళ్లిన నటి, 750 తో కెరీర్ స్టార్ చేసిన బిగ్ బాస్ బ్యూటీ.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved