MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ నటి, సాయి సేవలో తులసి శేష జీవితం..

సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ నటి, సాయి సేవలో తులసి శేష జీవితం..

Tulasi Retires from Films : సినిమాలు అధికారికంగా రిటైర్మెంట్ ప్రకటించారు సౌత్ సీనియర్ నటి తులసి. తన తరువాతి జీవితం సాయి సేవలో గడపాలని కోరుకుంటున్నట్టు ఆమె వెల్లడించారు. 

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 19 2025, 06:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
సినిమాలకు గుడ్ బై..
Image Credit : Asianet News

సినిమాలకు గుడ్ బై..

తల్లి పాత్రలతో తెలుగు ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయిన ప్రముఖ నటి తులసి, తన సినీ ప్రయాణానికి ముగింపు పలకనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సంవత్సరం డిసెంబర్ 31న సాయి బాబా దర్శనం చేసుకుని.. తన నట జీవితానికి గుడ్ బై చెప్పబోతున్నట్టు తులసి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఆమె ఈ నిర్ణయం సినీ వర్గాల్లో, అభిమానుల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
చిన్నవయసులో సినిమాల్లోకి ఎంట్రీ
Image Credit : instagram pages

చిన్నవయసులో సినిమాల్లోకి ఎంట్రీ

చాలా చిన్న వయసులోనే తులసి సినిమా కెరీర్ ప్రారభించింది. 1964 లో మూడున్నర నెలల పసిపాపగా ఉన్నప్పుడు ‘జీవన తరంగాలు’ అనే సినిమాతో కెమెరా ముందుకు వచ్చింది తులసి. ఆమె తల్లి, అలనాటి నటి సావిత్రికి సన్నిహితురాలు కావడంతో, ఆ చిత్రంలో ఉయ్యాలలలో ఊగే పసిపాప పాత్రలో నటించే అవకాశం దక్కింది. ఆ తర్వాత నాలుగేళ్ల వయసు నుంచే బాలనటిగా తెలుగు, తమిళం, కన్నడ, భోజ్‌పురి భాషల్లో 300 లకు పైగా చిత్రాల్లో నటించి మెప్పించింది. హీరోయిన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. శంకరాభరణంలో బాలనటిగా ఆమెకు మంచి గుర్తింపు లభించింది.

34
హీరోయిన్ గా, తల్లిగా అనేక పాత్రల్లో
Image Credit : our own

హీరోయిన్ గా, తల్లిగా అనేక పాత్రల్లో

తులసి బాలనటిగా మంచి పేరు తెచ్చుకున్న తరువాత.. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. హీరోయన్ గా చంద్రమోహన్ లాంటి హీరోలతో నటించిన తులసి.. తెలుగుతో పాటు వివిధ భాషల్లో హీరోయిన్ గా గుర్తింపు సాధించింది. ఇక తులసి కన్నడ దర్శకుడు శివమణిని వివాహం చేసుకున్న తరువాత కొంతకాలం సినీ రంగానికి విరామం ఇచ్చారు. ఈ విరామం తరువాత ఆమె మరోసారి రీఎంట్రీ ఇస్తూ క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించడం ప్రారంభించారు. ముఖ్యంగా తల్లి పాత్రల్లో ఆమె ప్రభాస్, శృతీ హాసన్ లాంటి వారికి తల్లిగా నటించి మెప్పించారు.

44
సినిమాలు తగ్గించిన నటి
Image Credit : Google

సినిమాలు తగ్గించిన నటి

ఈమధ్య కాలంలో తులసి పెద్దగా సినిమాలు చేయడంలేదు. అవకాశాలు వస్తున్నా.. తులసి సినిమాల సంఖ్యను తగ్గించుకుంది. ఈ సమయంలో ఆమె సాయిబాబా సన్నిధానంలో గడపడానికి కేటాయించింది. బాబాపై భక్తిని తరచూ సోషల్ మీడియా వేదికగా వెల్లడిస్తూ ఉంటుంది తులసి. ఇక తన తాజా పోస్ట్‌లో డిసెంబర్ 31న సాయిబాబా దర్శనం చేసుకోనున్నానని, అదే రోజు తన నటన జీవితానికి చివరి రోజు అవుతుందని పేర్కొన్నారు. దీనితో ఆమె సుదీర్ఘమైన సినీ ప్రయాణం ముగించబోతున్నట్టు తెలుస్తోంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
తెలుగు సినిమా
తమిళ సినిమా
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Hi OTT Release: హాయ్ ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది.. నయనతార మూవీ లైఫ్ టైమ్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?
Recommended image2
Rama Prabha: ప్రతి నెలా 25 వేలు అకౌంట్ లో వేస్తాడు, కానీ ఫోన్ మాత్రం ఎత్తడు, రమాప్రభకు సహాయం చేస్తున్న డైరెక్టర్ ఎవరు?
Recommended image3
Giri Babu: 40 రూపాయల రూమ్ రెంట్, స్కూల్ లో డ్రిల్ మాస్టర్ గా పనిచేస్తూ.. గిరిబాబుతో కలిసున్న స్టార్ హీరో ఎవరో తెలుసా?
Related Stories
Recommended image1
సుమ కనకాల రిటైర్మెంట్ ఎప్పుడో తెలుసా? క్లారిటీతో పాటు కౌంటర్ కూడా ఇచ్చిన స్టార్ యాంకర్
Recommended image2
వారణాసిలో మహేష్ ఒక్కడే కాదు.. ఎద్దుపై ఎంట్రీ ఇచ్చిన తెలుగు హీరోలు ఇంకెవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved