అడివి శేష్ గూఢచారి 2 తో పాటు బోల్డ్ హీరోయిన్ నుంచి రాబోతున్న 5 సినిమాలు ఇవే
Wamiqa Gabbi: వామికా గబ్బీ సినిమాలకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆమె చివరిసారిగా రాజ్‌కుమార్ రావ్ సినిమా 'భూల్ చూక్ మాఫ్'లో కనిపించింది. ఈ సినిమాలో ఆమె నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.

నటి వామిక గబ్బి
నటి వామిక గబ్బి గతంలో తెలుగులో భలే మంచి రోజు అనే చిత్రంలో నటించింది. ఈ మూవీ విడుదలై పదేళ్లు అవుతోంది. కానీ ఆ తర్వాత వామిక మరో తెలుగు మూవీ చేయలేదు. బాలీవుడ్ లో మాత్రం బోల్డ్ గా నటిస్తూ క్రేజ్ కొట్టేసింది. దాదాపు పదేళ్ల తర్వాత వామిక తెలుగులో నటిస్తోంది. ఆమె నుంచి వచ్చే ఏడాది రాబోతున్న 5 సినిమాల వివరాలు ఇప్పుడు చూద్దాం.
పతి పత్నీ ఔర్ వో
కార్తీక్ ఆర్యన్ 'పతి పత్నీ ఔర్ వో' సినిమాకు సీక్వెల్ రాబోతోంది. మీడియా కథనాల ప్రకారం, ఈ సినిమాలో వామికా గబ్బీ ప్రధాన పాత్రలో కనిపించొచ్చు.
భూత్ బంగ్లా
'భూత్ బంగ్లా' సినిమాలో అక్షయ్ కుమార్‌తో పాటు వామికా గబ్బీ కూడా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా 2026లో విడుదల కానుంది.
టిక్కీ టాకా
మలయాళ చిత్రం 'టిక్కీ టాకా'లో వామికా గబ్బీ కథానాయికగా కనిపించనుంది. అయితే, ఈ సినిమా విడుదల తేదీ ఇంకా ప్రకటించలేదు.
దిల్ కే దర్వాజే ఖోల్ నా డార్లింగ్
'దిల్ కే దర్వాజే ఖోల్ నా డార్లింగ్'లో వామికా గబ్బీ ఏ పాత్రలో కనిపిస్తుందో ఇంకా తెలియలేదు. కానీ ఈ సినిమాకు ఆమె ఓకే చెప్పింది.
గూఢచారి 2
తనకి పాపులారిటీ రాకముందు వామిక గబ్బి తెలుగులో భలే మంచి రోజు అనే చిత్రంలో నటించింది. ఆ తర్వాత మళ్ళీ తెలుగులో నటించలేదు. ఇప్పుడు బాలీవుడ్ లో వామిక బోల్డ్ అండ్ క్రేజీ హీరోయిన్. ఇలాంటి సమయంలో వచ్చే ఏడాది మరో తెలుగు చిత్రంలో నటిస్తోంది. అడివి శేష్ క్రేజీ ప్రాజెక్ట్ గూఢచారి 2(జి2) లో ఆమె నటిస్తోంది.

