- Home
- Entertainment
- సుమ కనకాల రిటైర్మెంట్ ఎప్పుడో తెలుసా? క్లారిటీతో పాటు కౌంటర్ కూడా ఇచ్చిన స్టార్ యాంకర్
సుమ కనకాల రిటైర్మెంట్ ఎప్పుడో తెలుసా? క్లారిటీతో పాటు కౌంటర్ కూడా ఇచ్చిన స్టార్ యాంకర్
Suma Kanakala Retirement : దాదాపు 30 ఏళ్లుగా తెలుగు ఆడియన్స్ ను తన యాంకరింగ్ తో అలరిస్తుంది సుమ కనకాల. యాంకరింగ్ రంగంలో ఇంతకాల నిలబడ్డ స్టార్ మరొకరు లేరు. మరి సుమ కనకాల రిటైర్మెంట్ ఎప్పుడు?

బుల్లితెర సంచలనం..
టెలివిజన్ ప్రపంచంలో.. యాంకర్ సుమ ఒక సంచలనం, దాదాపు 30 ఏళ్లుగా ఫిల్మ్ ఇండస్ట్రీలో కొనసాగుతున్న సుమ... 20 ఏళ్లుగా యాంకరింగ్ రంగంలో దూసుకుపోతోంది. 50 ఏళ్లు దాటినా.. అదే ఉత్సాహంతో, అదే జోష్ తో కొనసాగుతోంది సుమ. మలయాళ అమ్మాయి అయినా.. తెలుగువారి ఇళ్లలో ఓ కుటుంబ సభ్యురాలిలా మారిపోయిన సుమ, తన స్పస్టమైన తెలుుగు, మాట తీరు, కామెడీ టైమింగ్, ఎనర్జీతో ప్రేక్షకుల్ని ఎప్పటికప్పుడూ అలరిస్తూ వస్తోంది. ఇన్నేళ్ల నుంచి యాంకరింగ్ చేస్తూనే ఉన్నా, ఆమె తీరులో ఎలాంటి మార్పు లేదు. మునుపటికంటే ఎక్కువ ఉత్సాహంతో పనిచేస్తోంది సుమ కనకాల.
సుమ రిటైర్మెంట్ గురించి గుసగుసలు
ఇక రీసెంట్ గా సుమ గురించి సోషల్ మీడియాలో ఓ చర్చ బాగా నడుస్తోంది. సుమ వయసు పెరుగుతోంది, ఆమె తరువాత అంతటి స్థాయికి ఎవరు వస్తారన్న చర్చ జరుగుతోంది. అంతే కాదు కొంత మంది యాంకర్స్ ల్ కూడా సుమకు ఎక్కువ అవకాశాలు వస్తున్నాయి. మాకు ఛాన్స్ లు రావడంలేదు అన్ని అనుకుంటన్నట్టు టాక్ నడుస్తోంది. సాధారణంగా యాంకర్స్ కెరీర్ టైమ్ చాలా తక్కువ గా ఉంటుంది. ఎక్కువ కాలం ఒకరినే కంటీన్యూ చేయాలని అనుకోరు. కొత్త ముఖాలు వస్తే.. పాత యాంకర్స్ కు అవకాశాలు తగ్గిపోతాయి. కానీ సుమ విషయంలో మత్రం పరిస్థితి పూర్తి భిన్నంగా మారిపోయింది. ఆమె వయసు పెరిగే గొద్ది.. ఇంకాస్త జోరు పెంచుతోంది.
స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన సుమ కనకాల
బయట వినిపిస్తున్న రిటైర్మెంట్ వార్తలపై రీసెంట్ గా స్పందించింది సుమ. స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వడంతో పాటు స్పష్టమైన సమాధానం కూడా ఇచ్చింది. సుమ ప్రత్యేక పాత్రలో నటించిన ప్రేమంటే సినిమా నవంబర్ 21న రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన సుమ, రిటైర్మెంట్ గురించి వస్తున్న ప్రశ్నలకు చాలా ఘాటుగా కౌంటర్ ఇచ్చింది. “మా అమ్మకు 84 ఏళ్లు. కానీ చాలా యంగ్‌గా ఉంటారు. ఆమెకే రిటైర్మెంట్ లేదు. నేను ఎందుకు రిటైర్ అవ్వాలి?” అని రివర్స్ ప్రశ్నించింది సుమ.
రిటైర్మెంట్ మా జీన్స్ లోనే లేదు..
సుమ మాట్లాడుతూ, “చాలా మంది నన్ను అడుగుతున్నారు మీరు ఎప్పుడు రిటైర్ అవుతారు అని. మా ఫ్యామిలీలో జెనెటిక్స్ బలంగా ఉన్నాయి. మా అమ్మమ్మ 101 ఏళ్లు జీవించారు. మా పెద్ద మామయ్యకు 99 ఏళ్లు, ఇప్పటికీ అడ్వకేట్‌గా పనిచేస్తున్నారు. ఆయన గిన్నిస్ రికార్డ్ హోల్డర్. మరి రిటైర్మెంట్ గురించి నన్నెందుకు అడుగుతున్నారు? నేను ఇప్పట్లో రిటైర్ అయ్యే ప్రసక్తే లేదు” అని స్పష్టం చేసింది సుమ కనకాల.
సమ ఎమోషనల్ కామెంట్స్
''ఏకార్యక్రమం చేసినా.. స్టేజ్‌పైకి వచ్చిన ప్రతిసారీ ప్రేక్షకుల నుంచి వినిపించే మాట సుమ అక్క. వారు అలా అంటూ.. కేరింతలు కొడుతుంటే.. అవి నాకు శక్తినిస్తాయి, మీ అరుపుల్లో, ప్రేమలో ఇంత ఎనర్జీ ఉంది. అలా ఉన్నప్పుడు నేను ఎలా రిటైర్ అవుతాను?” అంటూ సుమ ఎమోషనల్ కామెంట్స్ చేసింది.సుమ చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇక సుమ రిటైర్మెంట్ గురించి ఆలోచించేవారికి ఇది అతిపెద్ద కౌంటర్ అని చెప్పవచ్చు. ఆమె మాటల ప్రకారం, ఇంకా ఎన్నో సంవత్సరాలు యాంకరింగ్ ప్రపంచంలో కొనసాగనుందని స్పష్టమైంది.

