- Home
- Entertainment
- Suman Shetty Eliminate: సుమన్ శెట్టి ఎలిమినేట్.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన
Suman Shetty Eliminate: సుమన్ శెట్టి ఎలిమినేట్.. భరణితో స్నేహం దెబ్బ కొట్టిందా? తనూజ ఆవేదన
బిగ్ బాస్ తెలుగు 9.. ఈ వారం ఎలిమినేషన్ తేలిపోయింది. సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యాడు. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుందని హోస్ట్ నాగార్జున వెల్లడించారు.

సుమన్ శెట్టి ఎలిమినేట్
బిగ్ బాస్ తెలుగు 9 14వ వారం ఊహించినట్టుగానే జరిగింది. ఈ వారం ఎలిమినేషన్ జరిగింది. వచ్చే వారం ఫైనల్ ఉన్న నేపథ్యంలో ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చేస్తున్నారు. అందులో భాగంగా శనివారం ఎపిసోడ్‌లోనే ఓ ఎలిమినేషన్ చేశారు. అనుకున్నట్టుగానే సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యాడు. మిగిలిన వారితో పోల్చితే తక్కువ ఓట్లు ఆయనకు పడటంతో ఎలిమినేట్ చేశారు. ఆయన ఎలిమినేషన్ అందరిని ఆశ్చర్యపరిచింది.
భరణితో సుమన్ శెట్టి స్నేహం
సుమన్ శెట్టి అంటే అందరికి ఇష్టం. ఆయన్ని అంతా క్యూట్ బాయ్‌గా, సుమ్మూ అంటూ పిలుస్తుంటారు. సరదాగా ఆటపట్టిస్తూ ఉంటారు. అలాంటి సుమన్ శెట్టి ఎలిమినేట్ కావడం కొంత బాధగా ఫీలయ్యారు. ముఖ్యంగా భరణి బాగా ఎమోషనల్ అయ్యారు. ఆయన అస్సలు ఊహించలేదు. ఈ ఇద్దరు తమ స్నేహాన్నిపంచుకున్నారు. ఎపిసోడ్‌లో ఏకంగా ఈ ఇద్దరి స్నేహంపై ఒక ప్రోమోని కూడా కట్ చేశారు. అది ఎంతగానో ఆకట్టుకుంది. మరోవైపు సుమన్‌శెట్టి ఎలిమినేట్ అయినప్పుడు జర్నీ చూపించగా, అది ఎంతగానో అలరించింది.
సుమన్ శెట్టి ఎలిమినేషన్‌కి కారణం
ఎలిమినేట్ అయ్యాక బంగారం ఎవరు, బొగ్గు ఎవరనేది చెప్పాలని నాగార్జున చెప్పగా, అంతా బంగారమే అని తెలిపారు. అందరు బాగా ఆడాలని, కప్ గెలవాలని చెప్పారు. అదే సమయంలో కళ్యాణ్, ఇమ్మాన్యుయెల్‌లను బ్యాంకాక్‌కి తీసుకెళ్తానని చెప్పాడట. తమ మధ్య జరిగిన రహస్యాన్ని స్టేజ్‌ప బహిర్గతం చేశారు. ఇమ్మాన్యుయెల్ అసలు విషయం చెప్పడంతో ఆ తర్వాత నాలుక కర్చుకున్నారు సుమన్. ఇదిలా ఉంటే సుమన్ శెట్టి ఎలిమినేషన్ కి కారణమేంటనేది చూస్తే, బేసిక్‌గా సుమన్ శెట్టికి ఎవరికీ లేని ఫాలోయింగ్ ఉంది. కానీ ఆయన తన సొంత నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల, ఎక్కువగా భరణిపై ఆధారపడటం వల్ల ఆ ప్రభావం సుమన్‌పై పడిందని, అదే ఎలిమినేషన్‌కి కారణమని బిగ్ బాస్ బజ్‌లో శివాజీ చెప్పడం విశేషం.
ట్రస్ట్ ఎవరి విషయంలో
ఇక ఈ వారం ఎవరిని ట్రస్ట్ చేస్తున్నారు, ఎవరిని నమ్మడం లేదనే టాస్క్ ఇచ్చాడు నాగార్జున. ఇందులో సంజనా.. ఇమ్మాన్యుయెల్ ట్రస్ట్ అని, తనూజ కాదని చెప్పింది. పవన్.. ఇమ్మాన్యుయెల్ ట్రస్ట్ అని, భరణి రాంగ్ అని చెప్పగా, భరణి.. సుమన్ శెట్టి ట్రస్ట్ అని, డీమాన్ పవన్ రాంగ్ అని, కళ్యాణ్.. తనూజ ట్రస్ట్ , పవన్ రాంగ్ అని, తనూజ.. కళ్యాణ్ ట్రస్ట్ అని, సంజనా రాంగ్ అని తెలిపారు. మరోవైపు రిగ్రెట్ ఫీలైన వీక్ ల గురించి చెప్పారు. భరణి ఎలిమినేట్ అయినప్పుడు తాను చాలా బాధపడినట్టు తెలిపింది తనూజ. ఒంటరైపోతున్న భావన కలిగిందని వెల్లడించింది. ఇక ఆరో వారంలోనే రీతూని తోసేసే సీన్‌లో తాను అలాను రియాక్ట్ కాకూడదని పవన్ తెలిపారు.
రీతూ వెళ్లిపోవడంతో ఫ్రీ అయిన పవన్
ఇదిలా ఉంటే ఇందులో డీమాన్ పవన్‌ని ఆటపట్టించాడు నాగార్జున. రీతూ వెళ్లిపోయాక చాలా ఫ్రీ అయ్యావని, యాక్టివ్‌గా కనిపిస్తున్నావని తెలిపారు. పవన్ కూడా చాలా యాక్టివ్‌గా రియాక్ట్ కావడం కనిపించింది. ఈ లెక్కన రీతూ తనని గట్టిగా ఇబ్బంది పెట్టిందని, తను ఉండటం వల్ల డీమాన్ పవన్ చాలా కోల్పోయాడనే విషయాన్ని నాగార్జున పరోక్షంగా తెలిపారు. సంజనా, తనూజ, ఇమ్మాన్యుయెల్ కూడా సెటైర్లతో ఆ విషయాన్ని చెప్పడం విశేషం. ఇక ఈవారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని, ఆదివారం ఎపిసోడ్‌లో మరో ఎలిమినేషన్ చూపించబోతున్నారని సమాచారం. ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్‌పై క్లారిటీ వస్తే మిగిలిన వారు ఫైనల్ కి వెళ్తారు. ఈ ఆదివారంతో ఆ విషయం క్లారిటీ రానుంది.

