MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • TV
  • Bigg Boss Telugu Rohit: నాగార్జునపై మండిపడుతున్న రోహిత్ ఫ్యాన్స్.. బిగ్ బాస్ చేసిన పనికి సోషల్ మీడియాలో ట్రోల్స్‌ దుమారం!

Bigg Boss Telugu Rohit: నాగార్జునపై మండిపడుతున్న రోహిత్ ఫ్యాన్స్.. బిగ్ బాస్ చేసిన పనికి సోషల్ మీడియాలో ట్రోల్స్‌ దుమారం!

Bigg Boss Telugu Rohit: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో ఎక్కువ మంది అభిమానులను సంపాదించుకున్న సామాన్య కంటెస్టెంట్ రోహిత్ ఎలిమినేషన్ వార్తలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. బిగ్ బాస్ పై.. నాగార్జునపై నెట్టింట దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.

2 Min read
Author : Mahesh Jujjuri
Published : Nov 01 2026, 11:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
రోహిత్ ఎలిమినేషన్ దుమారం..
Image Credit : Jio Hotstar

రోహిత్ ఎలిమినేషన్ దుమారం..

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో రోహిత్ ఎలిమినేషన్ వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తోంది. తమ అభిమాన కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటకు వెళ్లడాన్ని రోహిత్ ఫ్యాన్స్ తో పాటు కామన్ బిగ్ బాస్ ఆడియన్స్ ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా ఓటింగ్, ఎలిమినేషన్ ప్రక్రియపై ప్రశ్నలు లేవనెత్తుతూ బిగ్ బాస్ నిర్వాహకులపై విమర్శలు చేస్తున్నారు. మరోవైపు హోస్ట్ నాగార్జునను కూడా కొందరు నెటిజన్లు టార్గెట్ చేస్తూ కామెంట్లు పెడుతున్నారు.

#JusticeForRohit ట్రెండింగ్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో ఎనిమిదో వారం ఎలిమినేషన్ వ్యవహారం పెద్ద వివాదంగా మారింది. ముఖ్యంగా రోహిత్ ఎలిమినేషన్ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. విన్నర్ అవుతాడని భావించిన కంటెస్టెంట్‌ను ఇలా మధ్యలోనే బయటకు పంపించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎక్స్‌ (ట్విట్టర్‌) వేదికగా #BiggBossTelugu10, #JusticeForRohit, #RohitNaidu వంటి హ్యాష్‌ట్యాగ్‌లు వైరల్ అవుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
రోహిత్ ఎలిమినేషన్‌తో మొదలైన వివాదం
Image Credit : Asianet News

రోహిత్ ఎలిమినేషన్‌తో మొదలైన వివాదం

ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందనే ప్రచారం మధ్య ఝాన్సీ, రోహిత్ పేర్లు తెరపైకి వచ్చాయి. ఝాన్సీ ఎలిమినేషన్ తర్వాత రోహిత్ విషయంలో మరో ట్విస్ట్ చోటుచేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. హౌస్‌లో కొనసాగడానికి ఎవరు అనర్హులనే నిర్ణయాన్ని కంటెస్టెంట్లకే అప్పగించగా, ఎక్కువ మంది రోహిత్ పేరును సూచించినట్లు తెలుస్తోంది. అయితే ప్రేక్షకుల ఓటింగ్‌కు బదులుగా హౌస్‌మేట్స్ నిర్ణయంతో ఎలిమినేషన్ జరగడంపై అభిమానులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

ఓటింగ్‌లో ముందున్నాడని ఫ్యాన్స్ వాదన

రోహిత్‌కు బయట భారీగా అభిమానులు ఉన్నారని, కొన్ని ఆన్‌లైన్ పోల్స్‌లోనూ అతడికి మంచి మద్దతు కనిపించిందని ఫ్యాన్స్ చెబుతున్నారు. అలాంటప్పుడు ప్రేక్షకుల ఓట్లను పక్కనపెట్టి హౌస్‌మేట్స్ నిర్ణయంతో ఎలిమినేట్ చేయడం అన్యాయమని మండిపడుతున్నారు. మరికొందరు అయితే పబ్లిక్ ఓటింగ్‌కు విలువ లేకపోతే ప్రేక్షకుల నుంచి ఓట్లు ఎందుకు అడుగుతున్నారని నిర్వాహకులను ప్రశ్నిస్తున్నారు.

ఎక్స్‌లో కనిపిస్తున్న పోస్టుల్లో ‘జస్టిస్ ఫర్ రోహిత్’, ‘బ్యాన్ బిగ్ బాస్ తెలుగు 10’ వంటి నినాదాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రోహిత్‌ను మొదటి నుంచి టార్గెట్ చేశారని, అతడిపై ఒత్తిడి పెంచేలా పరిణామాలు సాగాయని కొందరు అభిమానులు ఆరోపిస్తున్నారు. అయితే ఇవన్నీ సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న అభిప్రాయాలు మాత్రమే. ఓటింగ్ వివరాలు అధికారికంగా వెల్లడైతేనే ఈ ఆరోపణలపై స్పష్టత వస్తుంది.

34
నాగార్జునపై కూడా విమర్శలు
Image Credit : Asianet News

నాగార్జునపై కూడా విమర్శలు

ఈ వివాదం హోస్ట్ నాగార్జున వరకు చేరింది. వీకెండ్ ఎపిసోడ్లలో కంటెస్టెంట్ల ప్రవర్తనపై ఆయన చేసే వ్యాఖ్యలు, కొందరిని ప్రశ్నించే విధానం పక్షపాతంగా ఉందని కొందరు నెటిజన్లు విమర్శిస్తున్నారు. రోహిత్ విషయంలోనూ సరైన మద్దతు ఇవ్వలేదని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే మరికొందరు మాత్రం నాగార్జున తన బాధ్యతను నిర్వర్తిస్తున్నారని, హౌస్‌లో జరిగిన విషయాల ఆధారంగానే మాట్లాడుతున్నారని సమర్థిస్తున్నారు. గతంలో కూడా రోహిత్, త్రిగుణ్ వంటి కంటెస్టెంట్ల ప్రవర్తనపై నాగార్జున ప్రశ్నలు లేవనెత్తినట్లు వార్తలు వచ్చాయి. దీంతో హోస్ట్ వ్యాఖ్యలు, ఎలిమినేషన్ నిర్ణయాలను కలిపి అభిమానులు చర్చిస్తున్నారు.

44
సీక్రెట్ రూమ్ ట్విస్ట్.. మరో కొత్త చర్చ
Image Credit : Star Maa

సీక్రెట్ రూమ్ ట్విస్ట్.. మరో కొత్త చర్చ

రోహిత్‌ను నేరుగా ఇంటికి పంపకుండా సీక్రెట్ రూమ్‌కు పంపినట్లు కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో మాత్రం దీనిపై భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. కొందరు అతడికి మరో అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారని అంటుంటే, మరికొందరు రోహిత్ సీక్రెట్ రూమ్‌కు వెళ్లేందుకు ఇష్టపడలేదని పోస్టులు చేస్తున్నారు. ఈ విషయంలో అధికారిక ఎపిసోడ్‌లో వచ్చే స్పష్టత కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

అభిమానుల ఆగ్రహం.. బిగ్ బాస్‌కు కొత్త సవాల్!

రోహిత్ అభిమానుల పోస్టుల్లో నిర్వాహకులపై నిరసనతో పాటు అతడికి సపోర్ట్ గా వరుసగా పోస్ట్ లు నెట్టింట కనిపిస్తున్నాయి. మరోవైపు రోహిత్ ఆటతీరు, ఇతర కంటెస్టెంట్లతో అతడి ప్రవర్తనను విమర్శిస్తూ కొందరు నెటిజన్లు భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి రోహిత్ ఎలిమినేషన్ బిగ్ బాస్ తెలుగు 10 నిర్వాహకులకు కొత్త తలనొప్పిగా మారింది. ప్రేక్షకుల ఓటింగ్‌కు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు? హౌస్‌మేట్స్ నిర్ణయానికి ఎంత విలువ ఉంది? సీక్రెట్ రూమ్ వ్యవహారంలో అసలు ఏం జరిగింది? అనే ప్రశ్నలకు అధికారిక సమాధానం రావాల్సి ఉంది.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు
వినోదం
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Singer Jhansi Remuneration: సింగర్‌ ఝాన్సీ బిగ్‌ బాస్‌ పారితోషికం.. 8 వారాలకు ఇంతేనా?
Recommended image2
Bigg Boss 10 Double Elimination: ఎలిమినేషన్‌లో ట్విస్ట్, రోహిత్‌ ఔట్‌.. బిగ్‌ బాస్‌ చరిత్రలో ఫస్ట్ టైమ్‌
Recommended image3
Bigg Boss 10: ఎనిమిదో వారం షాకింగ్‌ ఎలిమినేషన్‌, బిగ్‌ బాస్‌ తెలుగు 10 హౌజ్‌ నుంచి రైతు బిడ్డ ఔట్‌?
Related Stories
Recommended image1
Tailor Bird: సూది దారం లేకుండా.. ఆకులను అద్భుతంగా కుట్టే పిట్ట.. చిన్న పక్షికి ఇంత తెలివి ఎలా?
Recommended image2
Bobbili Brahmanna Review: బాలకృష్ణకు చుక్కలు చూపించిన కృష్ణంరాజు సినిమా.. బొబ్బిలి బ్రహ్మన్న రివ్యూ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved