- Home
- Entertainment
- Gossips
- రామ్ చరణ్ , ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టబోతున్నారా? వారసులు వస్తున్నారంటూ మెగా అభిమానుల సందడి
రామ్ చరణ్ , ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టబోతున్నారా? వారసులు వస్తున్నారంటూ మెగా అభిమానుల సందడి
మెగా కోడలు ఉపాసన కొణిదెల మరోసారి తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఈసారి మెగా ఫ్యామిలీకి వారసులు రాబోతున్నారన్న ఆశతో అభిమానులు ఉన్నారు. రామ్ చరణ్ దంపతులు కవల పిల్లలకు జన్మనివ్వబోతున్నట్టు జరుగుతున్నప్రచారంలో నిజం ఎంత?

రెండో సారి తల్లి కాబోతున్న ఉపాసన
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన కొణిదెల దంపతులు మరోసారి తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. ఈసారి పక్కాగా మెగా వారసుడు రాబోతున్నాడంటూ అభిమానులు ఆనందలో ఉన్నారు. ఇప్పటికే క్లిన్ కారా వల్ల తమ కుటుంబంలో ఎప్పుడూ లేనంతగా అద్భుతాలు జరిగాయని మెగా ఫ్యామిలీ సంతోషంలో ఉన్నారు. క్లింకార పుట్టిన తరువాతే రామ్ చరణ్ కు పాన్ వరల్డ్ స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆర్ఆర్ఆర్ కు ఆస్కార్ వచ్చింది, రామ్ చరణ్ కు ఎన్నో గౌవరవాలు కూడా దక్కాయి. దాంతో క్లింకారాను తమ ఇంటి మహాలక్ష్మిగా చిరు ఫ్యామిలీ భావిస్తున్నారు.
మెగా వారసుడి కోసం వెయిటింగ్..
ఇక మెగా వారసత్వాన్ని నిలబెట్టే హీరో కోసం చిరంజీవి ఎదురు చూస్తున్నారు. అందకే ఒక్క కొడుకును కూడా ఇ్వవమని రామ్ చరణ్ ను అడిగినట్టు చిరంజీవి గతంలో ఓ ఈవెంట్ లో వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే చిరు అలా అడగడంతో.. విమర్శలు కూడా ఫేస్ చేశారు. ఈక్రమంలో ఉపాసన మళ్లీ తల్లి కాబోతోందన్న వార్త మెగా అభిమానుల్లో భారీ ఉత్సాహాన్ని నింపింది. అయితే ఈసారి మెగాస్టార్ ఆశించినట్టుగానే రామ్ చరణ్ వారసుడిని అందిస్తాడని అంటున్నారు. అయితే ఈసారి ఉపాసన ఒక బిడ్డకు కాకుండా ఇద్దరు బిడ్డలకు జన్మనివ్వబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది.
ఇద్దరు వారసులు రాబోతున్నారా?
ఉపాసనకు కవలపిల్లలు పుట్టబోతున్నారన్న ప్రచారం ఎక్కువగా జరుగుతోంది. దాంతో ఇద్దరు మెగా వారసులు రాబోతున్నారని చిరు, చరణ్ అభిమానులు దిల్ ఖుష్ అవుతున్నారు. పండగ చేసుకుంటున్నారు. కానీ నిజంగా ఉపాసన కవలపిల్లలకు జన్మనివ్వబోతుంది అని అధికారికంగా ఎవరు చెప్పలేదు. ఇక వచ్చేది వారసులే అనడానికి కూడా అవకాశం లేదు.. ఎవరో తెలుసుకునేందుకు మన చట్టం ఒప్పకోదు. కానీ అభిమానులు మాత్రం మెగా హీరోలు రాబోతున్నారంటూ నమ్మకంతో ఉన్నారు. సంతోషంతో ..సందడి చేస్తున్నారు.
ఉపాసన బేబీ బంప్ ఫోటోస్..
త్వరలోనే ఉపాసన డెలివరీకి ఏర్పాట్లు జరుగుతన్నట్టు సమాచారం. దాంతో రామ్ చరణ్ కూడా షూటింగ్ లేని సమయాల్లో ఉపాసనతోనే ఎక్కువ సమయాన్ని గడుపుతున్నారని, కొన్ని సందర్భాల్లో ఆమె కోసం షూటింగ్‌లను కూడా రద్దు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇటీవల ఉపాసన బేబీ బంప్‌తో కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి ప్రముఖ జపనీస్ చెఫ్ అసవా తకమాసా వెళ్లారు. ఆ సమయంలో రామ్ చరణ్, ఉపాసన ఆయనతో దిగిన ఫోటో ప్రస్తుతం వైరల్ అవుతోంది. అందులో ఉపాసన బేబీ బంప్‌తో కనిపించింది.
ఉపాసన సీమంతం
గత ఏడాది అక్టోబర్ లో ఉపాసనకు సీమంతం కార్యక్రమం కూడా జరిగింది. ఆ తర్వాత నుంచి ఆమె ఎక్కువగా ఇంటికే పరిమితమైనట్లు సమాచారం. గతంలో ఉపాసన క్లిన్ కారాకు జన్మనిచ్చిన సమయంలో కూడా సోషల్ మీడియాలో చాలా రూమర్లు వైరల్ అయ్యాయి. ఆమె సరోగసీ పద్ధతి ద్వారా బిడ్డ జన్మనిచ్చిందని.. రకరకాలుగా గుసుగుసలు వినిపించాయి. కానీ ఈసారి ఉపాసన బేబీ బంప్‌తో స్పష్టంగా కనిపించడంతో.. అలాంటి ప్రచారాలకు, రూమర్లకు పూర్తిగా చెక్ పడినట్లైంది. ఈ ఫోటోలు బయటకు రావడంతో అభిమానులు మరోసారి ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

