- Home
- Entertainment
- అందుకే ఆ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేస్తే.. చాలా హ్యాపీగా ఉంటుందన్న బిగ్ బాస్ బ్యూటీ..
అందుకే ఆ ఫోటోలు ఇన్‌స్టాలో షేర్ చేస్తే.. చాలా హ్యాపీగా ఉంటుందన్న బిగ్ బాస్ బ్యూటీ..
Actress Inaya Sultana: తెలుగు బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత విపరీతమైన ఫాలోయింగ్ తెచ్చుకున్న ఈ భామ.. ఆపై బ్రేకప్ తో డిప్రెషన్ లోకి వెళ్లింది. దాని గురించి ఏమన్నదంటే.? ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి స్టోరీలో చూసేయండి మరి.

బిగ్ బాస్‌తో ఫేం..
బిగ్ బాస్-6లోకి అడుగుపెట్టి.. ఆ షో ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించింది నటి ఇనాయా సుల్తానా. హౌస్ నుంచి బయటకు రాగానే ఈ అమ్మడికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. అంతేకాకుండా పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది.
హైదరాబాద్ నుంచే..
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన ఈ అమ్మడు.. అటు సోషల్ మీడియాలో తెగ క్రేజ్ సంపాదించుకోగా.. వెండితెరపై పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'జాట్', 'భైరవం', 'బుజ్జి ఇలా రా', 'బచ్చలమల్లి' సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కీలక పాత్రలు పోషించింది.
గౌతమ్‌తో లవ్, బ్రేకప్..
ఊహించని విధంగా సోషల్ మీడియాలో ఫేం సంపాదించినా ఈ బ్యూటీ.. ఎప్పుడూ ఆ ఫోటోలు షేర్ చేస్తూ విపరీతమైన ఫాలోయింగ్ రాబట్టుకుంది. అదే సమయంలో పలు షోలలో కూడా పాల్గొన్న ఈమెకు.. గౌతమ్ అనే వ్యక్తితో పరిచయం.. ఆపై ప్రేమ ఏర్పడింది. అయితే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకుందామనుకునేలోపే బ్రేకప్ చెప్పేసుకున్నారు.
బ్రేకప్ తర్వాత ఇలా..
నేను బ్రేకప్ అయిన తర్వాత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాను. దాని నుంచి బయటకు రావడానికి చాలా సమయం పట్టింది. డిప్రెషన్ ను అధిగమించేందుకు ఎన్నో కొత్త విషయాలను నేర్చుకోవాలని అనుకున్నా.. డబ్బుతో ఏదైనా కొనొచ్చునని తెలిసింది. కానీ శరీరాన్ని కొనలేం, మార్చలేం అని అర్ధం చేసుకున్నా.
ఇన్‌స్టాలో ఆ ఫోటోలు..
నిత్యం ఇన్‌స్టాలో అలాంటి ఫోటోలు షేర్ చేయడానికి కారణం ఏంటో ఓపెన్ గా చెప్పేసింది ఈ బ్యూటీ. డిప్రెషన్ నుంచి బయటపడటానికి.. నా జీవితంలో సంతోషాన్ని ఇచ్చే ఒకే ఒక పని జిమ్. జిమ్‌లో కష్టపడి శరీర ఆకృతిని మార్చుకోవడం వల్ల లభించే సంతృప్తి అంతా ఇంతా కాదు. అందుకే నిత్యం జిమ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటా.

