- Home
- Entertainment
- Richest Actress: పదిహేనేళ్లుగా ఒక సినిమా చేయకపోయినా.. దేశంలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమెనే
Richest Actress: పదిహేనేళ్లుగా ఒక సినిమా చేయకపోయినా.. దేశంలోనే రిచెస్ట్ హీరోయిన్ ఈమెనే
Richest Actress: మనదేశంలోనే అత్యంత ధనిక హీరోయిన్ ఎవరో తెలుసా? పదిహేనేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న జూహీ చావ్లా. ఈమె ఆస్తుల విలువ తెలిస్తే ఆశ్చర్యపోతారు.

ధనిక హీరోయిన్
మనదేశంలో అత్యంత ధనిక హీరోయిన్ గా నిలిచింది జూహీ చావ్లా. ఇతర హీరోయిన్ల ఆస్తితో పోలిస్తే ఈమె ఆస్తి చాలా ఎక్కువ. బాలీవుడ్‌లో ఒకప్పుడు అగ్ర కథానాయికగా వెలుగొందిన జూహీ చావ్లా ఇప్పటికీ ఎంతో మందికి అభిమాన నటి. ఆమె తన అందంగతో, సహజ నటనతో 90వ దశకంలో వరుస హిట్లు అందుకుంది. ఆమె సినిమాలకే పరిమితం కాకుండా వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేసింది. తాజాగా 2025 నాటికి జూహీ చావ్లా సంపద గురించి వచ్చిన రిపోర్టు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. హురున్ ఇండియా రిచ్ లిస్ట్ ప్రకారం జూహీ చావ్లా కుటుంబ సంపద దాదాపు రూ. 7,700 కోట్లకు పైగానే అని అంచనా వేసింది. దీంతో ఆమె భారతదేశంలోనే అత్యంత సంపన్నమైన మహిళా నటిగా గుర్తింపు పొందారు. ఒకప్పుడు వెండితెరను ఏలిన జూహీ..ఇప్పుడు వ్యాపారపరంగా విజయం సాధించింది.
వ్యాపారంలో విజయం
జూహీ చావ్లా సంపద పెరగడానికి ప్రధాన కారణం ఆమె నటన నుంచి వచ్చిందే కాదు వ్యాపార పెట్టుబడులు కీలక పాత్ర పోషించాయి. ఆమె భర్త జై మెహతా ప్రముఖ పారిశ్రామికవేత్త. ఇద్దరూ కలిసి పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టారు. ముఖ్యంగా ఐపీఎల్ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్లో జూహీ చావ్లాకు వాటా ఉంది. ఇదే ఆమె సంపదను భారీగా పెంచింది. షారుక్ ఖాన్‌తో కలిసి KKRను కొనుగోలు చేసిన తర్వాత, ఆ జట్టు విలువ ఎన్నో రెట్లు పెరిగింది. ఐపీఎల్ బ్రాండ్ విలువ పెరగడంతో పాటు స్పాన్సర్లు, టీవీ హక్కులు, ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం కూడా జూహీ కుటుంబ సంపదలో కీలకంగా మారింది. ఇదే ఆమెను ఇతర నటీమణుల కంటే విపరీతమైన ధనవంతురాలిని చేసింది.
నటను దూరంగా ఉన్నా..
సినిమాల విషయానికి వస్తే జూహీ చావ్లా ప్రస్తుతం నటనకు కాస్త దూరంగా ఉందనే చెప్పాలి. గతంలో చేసిన సినిమాల ద్వారా వచ్చిన పేరు, ఆస్తులు ఇప్పటికీ ఆమెకు ఆదాయాన్ని అందిస్తున్నాయి. అంతేకాదు ఆమె పలు నిర్మాణ సంస్థల్లో భాగస్వామిగా ఉన్నారు. రియల్ ఎస్టేట్, సిమెంట్, హాస్పిటాలిటీ వంటి రంగాల్లో చేసిన పెట్టుబడులు కూడా మంచి లాభాలను సాధిస్తోంది జూహీ. ముఖ్యంగా దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న విలువైన భూములు, కమర్షియల్ ప్రాపర్టీలు ఆమె ఆస్తుల్లో ప్రధాన భాగం. 2024తో పోలిస్తే 2025 నాటికి జూహీ చావ్లా సంపద దాదాపు 60 శాతం వరకు పెరిగినట్టు రిపోర్టులు చెబుతున్నాయి.
నటి మాత్రమే కాదు
ఈరోజు జూహీ చావ్లా పేరు వినిపించగానే కేవలం నటిగానే కాదు విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపును సాధించింది. బాలీవుడ్‌లో చాలా మంది నటులు కోట్ల సంపద కలిగి ఉన్నా జూహీ చావ్లా స్థాయికి చేరుకోవడం కొంచెం కష్టమే. సరైన సమయంలో సరైన పెట్టుబడులు పెట్టడం ద్వారా జూహీ అత్యంత ధనికురాలిగా మారింది. వెండితెరపై మాత్రమే కాదు నిజ జీవితంలోనూ విజయం సాధించి చూపించింది జూహీ చావ్లా.

