MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఆ స్టార్ హీరోతో మూవీ నా కెరీర్‌కు మైలురాయి: అనన్య నాగళ్ల

ఆ స్టార్ హీరోతో మూవీ నా కెరీర్‌కు మైలురాయి: అనన్య నాగళ్ల

Ananya Nagalla: అనన్య నాగళ్ళ తన సినీ కెరీర్, వకీల్ సాబ్ అనుభవాలు, ఇండస్ట్రీలోని అవకాశాలపై ఇటీవల ఇంటర్వ్యూలో కీలక విషయాలు పంచుకున్నారు. ఖమ్మం నుంచి వచ్చినా, తెలుగు అమ్మాయిగా దీర్ఘకాలిక కెరీర్‌ను ఆశిస్తున్నానన్నారు.  

1 Min read
Author : Pavithra D
Published : Jan 25 2026, 08:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తన కెరీర్‌లో ఒక మైలురాయి
Image Credit : Ananya Nagalla\Instagram

తన కెరీర్‌లో ఒక మైలురాయి

నటి అనన్య నాగళ్ళ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత జీవితం, ఇండస్ట్రీలో ఎదురైన సవాళ్లను వివరించింది. ఖమ్మం అమ్మాయిగా టాలీవుడ్‌లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకునే ప్రయత్నంలో ఉన్న అనన్య.. వకీల్ సాబ్ చిత్రంలో పవన్ కళ్యాణ్ తో కలిసి నటించడం తన కెరీర్‌లో ఒక మైలురాయిగా చెప్పుకొచ్చింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఖమ్మం నుంచి వచ్చినా..
Image Credit : Asianet News

ఖమ్మం నుంచి వచ్చినా..

ఖమ్మం నుంచి వచ్చినా, తనది విజయవాడ సమీపంలోని సత్తుపల్లి ప్రాంతమని, అందుకే తెలంగాణ స్లాంగ్ ఎక్కువగా కనిపించదని ఆమె వివరించింది. ముంబై నుంచి వచ్చిన హీరోయిన్లకు ఎక్కువ అవకాశాలు వస్తాయనే అభిప్రాయం మొదట్లో ఉన్నప్పటికీ, తెలుగు అమ్మాయిలకు కెరీర్‌లో దీర్ఘకాలిక మనుగడ ఉంటుందని ఆమె పేర్కొంది.

35
ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్నామని..
Image Credit : news buzz

ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్నామని..

గత ఐదు, ఆరు సంవత్సరాలుగా తెలుగు నటీమణులుగా తామందరం ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్నామని, రాబోయే ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఇక్కడే ఉంటామని ఆమె విశ్వాసం వ్యక్తం చేసింది. కేవలం హీరోయిన్‌గానే కాకుండా, అర్థవంతమైన, పాత్ర ప్రాధాన్యమున్న రోల్స్ చేసే అవకాశాలు తెలుగు అమ్మాయిలకు ఎక్కువగా వస్తాయని అనన్య అభిప్రాయపడింది.

45
వకీల్ సాబ్ చిత్రంలో నటించి..
Image Credit : Instagram

వకీల్ సాబ్ చిత్రంలో నటించి..

వకీల్ సాబ్ చిత్రంలో నటించిన తర్వాత, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోతో కలిసి పనిచేసినప్పటికీ, స్టార్ రేంజ్ హీరోలతో సినిమాలు రాలేదని మొదట్లో కొంచెం నిరాశ చెందానని తెలిపింది. అయితే, ఆ తర్వాత వచ్చిన పాత్రలు చాలా మంచివని, తంత్ర లాంటి చిత్రాలలో నటించడం తనకు నచ్చిందని తెలిపింది.

55
క్యారెక్టర్ ఓరియెంటెడ్ టూ పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్
Image Credit : Instagram

క్యారెక్టర్ ఓరియెంటెడ్ టూ పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్

నటిగా తనకు "క్యారెక్టర్ ఓరియెంటెడ్", "పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్" రోల్స్ చేయడమే లక్ష్యమని తెలిపింది. మల్లేశం, ప్లేబ్యాక్, వకీల్ సాబ్ లాంటి చిత్రాలలో ఎక్కువగా సాంప్రదాయ, క్యారెక్టర్ ఓరియెంటెడ్ పాత్రలు చేయడంతో, తాను అలానే ఉంటానని చాలామంది భావించారని చెప్పింది. అయితే, శాకుంతలం షూటింగ్ సమయంలో గ్లామరస్ ఫోటోషూట్స్ చేయడం ప్రారంభించానని, ఆ తర్వాత చేసిన పలు సినిమాల్లో కూడా గ్లామరస్ రోల్స్ చేశానని పేర్కొంది.

About the Author

PD
Pavithra D
పవిత్ర సీనియర్ జర్నలిస్ట్. ఈమె పలు పత్రికల్లో రాజకీయాలు, క్రీడలకు సంబంధించిన వార్తలు రాస్తూ ఉంటారు. గతంలో ఆంధ్రజ్యోతి, ఇతర వెబ్ సైట్లలో సబ్ ఎడిటర్ గా పని చేశారు. ప్రస్తుతం ఏసియానెట్ న్యూస్ తెలుగులో ఫ్రీలాన్సర్ గా ఉన్నారు.
ప్రసిద్ధ వ్యక్తులు
వినోదం
తెలుగు సినిమా
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Pawan Kalyan: ముక్క లేకుంటే ముద్ద దిగదు.. పవన్ కళ్యాణ్ కు క్లాస్ పీకిన చిరంజీవి, పవర్ స్టార్ జీవితాన్ని మార్చిన మాట ఏదో తెలుసా?
Recommended image2
Bigg Boss 10: మూడో వారం ఓటింగ్‌, డేంజర్‌ జోన్‌లో సంచలన కంటెస్టెంట్‌.. కావాలనే తొక్కేస్తున్నారా?
Recommended image3
Roja Selvamani: పరంజ్యోతి ఎపిసోడ్ మొత్తం ఫేకా ? నాకు బాగా ఉపయోగపడింది, నిజాలు బయటపెట్టిన రోజా
Related Stories
Recommended image1
Actress: చేసినవి 12 చిత్రాలైతే అందులో రెండే హిట్స్.. కానీ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.. ఎవరంటే.?
Recommended image2
Actress: చేసినవి 8 చిత్రాలు.. కుర్రాళ్లకు కలల రాణి.. కానీ అర్ధాంతరంగా ఇండస్ట్రీ వదిలేసింది.. ఎవరంటే.?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved