- Home
- Entertainment
- ప్రభాస్ కి ఇష్టంలేని రాజమౌళి సినిమా ఏంటో తెలుసా.. అదే హీరోతో మరో మూవీ చేస్తే మెంటలెక్కిందట
ప్రభాస్ కి ఇష్టంలేని రాజమౌళి సినిమా ఏంటో తెలుసా.. అదే హీరోతో మరో మూవీ చేస్తే మెంటలెక్కిందట
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శక ధీరుడు రాజమౌళి మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరి కాంబినేషన్ లో ఛత్రపతి, బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలు రూపొందాయి.
- FB
- TW
- Linkdin
Follow Us

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, దర్శక ధీరుడు రాజమౌళి మధ్య ఉన్న బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరి కాంబినేషన్ లో ఛత్రపతి, బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలు రూపొందాయి. బాహుబలి రెండు భాగాలు ఇండియన్ సినిమాపై, ముఖ్యంగా తెలుగు సినిమాపై చాలా ప్రభావం చూపాయి.
ప్రభాస్ ఒక సందర్భంలో మాట్లాడుతూ.. రాజమౌళి నాకు ఒకసారి కథ చెప్పారు. ఆ కథ సింహాద్రి. అప్పటికి ఆయన స్టూడెంట్ నెంబర్ 1 చిత్రం చేసి ఉన్నారు. స్టూడెంట్ నెంబర్ 1 హిట్ అయినప్పటికీ నాకు ఆ చిత్రం నచ్చలేదు. దీంతో సింహాద్రి చిత్రాన్ని రిజెక్ట్ చేశాను ఆ టైంలో నాకు ఏది మంచి కథ, ఏది మంచిది కాదు అని నిర్ణయించుకునే ఎక్స్పీరియన్స్ కూడా లేదు. కానీ సింహాద్రి చిత్రాన్ని రిజెక్ట్ చేశాను.
సింహాద్రి రిలీజ్ కి ముందు జూనియర్ ఎన్టీఆర్ తో కలిపి ప్రీవ్యూ చూసాను. ఆ మూవీ చూశాక నాకు మెంటల్ ఎక్కింది. ఇంత మంచి డైరెక్టర్ ని నేను రిజెక్ట్ చేశానా అని బాధపడ్డాను. ఇక రాజమౌళి నాతో సినిమా చేయడేమో అని అనుకున్నా. కానీ అదంతా ఆయన మనసులో పెట్టుకోకుండా నాతో ఛత్రపతి సినిమా చేశారు. మనుషులు ఇలా కూడా ఉంటారా అని నాకు అప్పుడు అనిపించింది అని ప్రభాస్ గుర్తు చేసుకున్నారు.
రాజమౌళి కూడా ఓ ఇంటర్వ్యూలో తాను దర్శకత్వం వహించిన చిత్రాల్లో ఏ మూవీ అంటే ఇష్టం లేదో రివీల్ చేశారు. రాజమౌళి కి కూడా స్టూడెంట్ నెంబర్ 1 మూవీ అంటే ఇష్టం లేదట.
ఆ మూవీని ఇప్పుడు చూస్తే ఏమాత్రం మెచ్యూరిటీ లేని విధంగా దర్శకత్వం చేసినట్లు అనిపిస్తుందని రాజమౌళి తెలిపారు. తన కెరీర్ నుంచి ఒక చిత్రాన్ని తీసేయాల్సి వస్తే స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రాన్ని పక్కన పెట్టేస్తానని రాజమౌళి అన్నారు.