MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Siva Reddy: 11 లక్షలు పెడితే 100 కోట్లు.. స్నేహితుడి చేతిలో నటుడు శివారెడ్డి ఎలా మోసపోయాడో తెలుసా?

Siva Reddy: 11 లక్షలు పెడితే 100 కోట్లు.. స్నేహితుడి చేతిలో నటుడు శివారెడ్డి ఎలా మోసపోయాడో తెలుసా?

Siva Reddy: స్నేహితుడి చేతిలో మోసపోవడం కారణంగా 100 కోట్లు పోగొట్టుకున్నాడు నటుడు శివారెడ్డి. అప్పట్లో తొందరపడకుండా ఉండి ఉంటే.. ఇప్పుడు కోటీశ్వరుడిని అయ్యేవాడినని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇంతకీ శివారెడ్డి ఎలా మోసపోయాడు? ఆ 100 కోట్ల విషయం ఏంటి?

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 12 2026, 09:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
మిమిక్రీ ఆర్టిస్ట్ గా, నటుడిగా శివారెడ్డి జర్నీ..
Image Credit : Asianet News

మిమిక్రీ ఆర్టిస్ట్ గా, నటుడిగా శివారెడ్డి జర్నీ..

తెలుగు టెలివిజన్ రంగంలో తన అద్భుతమైన మిమిక్రీ ప్రతిభతో, కామెడీ టైమింగ్‌తో కోట్లాది మంది ప్రేక్షకులను అలరించిన ప్రముఖ నటుడు శివారెడ్డి (Shiva Reddy). బుల్లితెరపై మాత్రమే కాకుండా, దాదాపు 30 ఏళ్లకు పైగా తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా కొనసాగుతున్నారు. కామెడీ పాత్రలు చేస్తూ... హీరో ఫ్రెండ్ వేషాలతో అదరగొట్టారు. అయితే వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న శివారెడ్డి, తాను జీవితంలో చూసిన ఆర్థిక మోసాలకు సంబంధించిన విషయాలను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఆసక్తికర విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
స్నేహితుడి చేతిలో 70 లక్షలు.. మోసపోయిన శివారెడ్డి
Image Credit : Asianet News

స్నేహితుడి చేతిలో 70 లక్షలు.. మోసపోయిన శివారెడ్డి

ఇంటర్వ్యూలో ఆయన పంచుకున్న జ్ఞాపకాల ప్రకారం, తాను కష్టపడి సంపాదించిన డబ్బును నమ్మి మోసపోవడం వల్ల ఎంతటి భారీ నష్టాన్ని చూడాల్సి వచ్చిందో వివరించారు. ఇంతకీ శివారెడ్డి ఎలా మోసపోయారు, ఎంత మొత్తం కోల్పోయారు, అలాగే మణికొండ స్థలం గురించి ఆయన చెప్పిన షాకింగ్ విషయాలు ఏంటో చూద్దాం. జీవితంలో ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును ఎదుటివారిని నమ్మి చేతిలో పెడితే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనేదానికి శివారెడ్డి ఉదంతం ఒక ఉదాహరణగా నిలుస్తుంది. తాను ఎంతో నమ్మిన ఒక స్నేహితుడు 70 లక్షల రూపాయలొկ డబ్బును తీసుకువెళ్లి తిరిగి ఇవ్వకుండా తీవ్రంగా మోసం చేశాడని శివారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

పక్కనే ఉంటూ వెన్నుపోటు పొడిచిన వ్యక్తి

ఒక స్నేహితుడు తనను నమ్మించి మోసం చేయడం వల్ల తాను ఆర్థికంగా చాలా నష్టపోయానని తెలిపారు. ఒకవేళ ఆ రోజు ఆ వ్యక్తి తన డబ్బును మోసం చేయకుండా ఉంటే, తాను ఆ మొత్తంతో మంచి ప్రాపర్టీని కొనుగోలు చేయాలని అనుకున్నట్లు వెల్లడించారు. శివారెడ్డి మాట్లాడుతూ... "అతను ఎప్పుడూ నా దగ్గరే ఉంటూ... నేను ఏదైనా స్థలం కొనాలనుకుంటే... 'అది బాలేదు, ఇది బాలేదు' అంటూ నన్ను కొనకుండా చేసేవాడు. పైగా అతని తండ్రి కూడా వచ్చి... 'వద్దు' అని గట్టిగా, నమ్మకంగా చెప్పేవాడు. మన మంచి కోసమే చెబుతున్నారేమో అని నేను అనుకునేవాడిని. అలా వదిలేసిన స్థలాలు ఇప్పుడు 50 కోట్లకు పైగా ధర పలుకుతున్నాయి" అని శివారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

34
11 లక్షల స్థలం - ఇప్పుడు 100 కోట్లు వచ్చేవి..
Image Credit : Asianet News

11 లక్షల స్థలం - ఇప్పుడు 100 కోట్లు వచ్చేవి..

ఈ ఇంటర్వ్యూలో శివారెడ్డి ప్రత్యేకంగా మణికొండ ప్రాంతం గురించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు అందరినీ విస్మయానికి గురిచేస్తున్నాయి. గతంలో మణికొండ ప్రాంతంలో రెండు ఎకరాలు తీసుకుందామనుకున్నాడట శివారెడ్డి. ఆ రెండు ఎకరాల భూమి కేవలం 11 లక్షల రూపాయలకే ఇస్తామన్నారట. అక్కడ పెట్టుబడి పెట్టే అవకాశం తన ముందు ఉండేదని ఆయన తెలిపారు. అయితే, ఆ సమయంలో జరిగిన మోసాల వల్ల ఆ భూమిని కొనుగోలు చేయలేకపోయానని వాపోయారు.

ఒకవేళ ఆ రోజు తాను ఆ మణికొండ భూమిలో పెట్టుబడి పెట్టి ఉంటే, కాలక్రమేణా అక్కడ భారీగా వెలిసిన విల్లాలు మరియు పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్ల ద్వారా తనకు ఎంతో లాభం వచ్చేదని పేర్కొన్నారు. ఆ స్థలంలో కనీసం ఒక 10 లేదా 20 విల్లాలు వచ్చినా కూడా, నేడు ఒక్కో విల్లా విలువ కోట్ల రూపాయలు ఉండేదని, తద్వారా తన ఆస్తుల విలువ 100 కోట్లకు పైగా చేరి ఉండేదని ఆయన తెలిపారు.

44
మాదాపూర్‌ లో మంచి భూమిని ఎలా వదిలేసుకున్నారు
Image Credit : Asianet News

మాదాపూర్‌ లో మంచి భూమిని ఎలా వదిలేసుకున్నారు

మరొక సంఘటనలో భాగంగా మాదాపూర్ పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న సుమారు 450 గజాల మంచి ప్రాపర్టీ కోసం తాను 35 లక్షల రూపాయలు అడ్వాన్స్ చెల్లించినట్లు శివారెడ్డి వెల్లడించారు. ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఎల్‌ఆర్‌ఎస్, బిఆర్‌ఎస్ వంటి పేపర్లు అడిగినప్పుడు, ఆ వ్యక్తి మొదట ఇస్తానని చెప్పి ఆ తర్వాత రకరకాలుగా కాలయాపన చేశాడని తెలిపారు.

తనకు ఆ వ్యక్తి బిజీ షెడ్యూల్ వల్ల పేపర్లు దొరకలేదని భావించినా, చివరికి విసిగిపోయి తన డబ్బులు తనకు వెనక్కి ఇచ్చేయమని కోరినట్లు చెప్పారు. ఇది కూడా తన స్నేహితుడు చెప్పడం వల్లే డబ్బులు వెనక్కి ఇచ్చేయమన్నట్టు శివారెడ్డి వెల్లడించారు. లేకుంటే కాస్త ఓపికగా ఉంటే ఆ ప్లేస్ తన సొంతమయ్యేదన్నారు శివారెడ్డి.

అయితే తాను ఊహించని విధంగా ఆ వ్యక్తి తనను మళ్లీ ఇంటికి ఆహ్వానించాడని, తన కుటుంబ సభ్యులంతా శివారెడ్డికి వీరాభిమానులని చెప్పి ఆదరించారని తెలిపారు. అంతేకాకుండా, తాను ఇచ్చిన అసలు మొత్తాన్ని ఎలాంటి కోతలు లేకుండా, ఏకంగా ఒక సంచిలో పెట్టి టేబుల్ మీద గౌరవంగా తెచ్చిచ్చినట్లు శివారెడ్డి చెప్పారు.

జీవితంలో ఒకవైపు స్నేహితులు - ఇతరుల మోసాల వల్ల భారీ ఆర్థిక నష్టాలను చవిచూసినప్పటికీ, కొన్ని సందర్భాల్లో ఎదురైన ఇలాంటి అనుభవాలు జీవిత పాఠాలను నేర్పించాయని ఆయన ఈ వీడియో ద్వారా పంచుకున్నారు.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Apoorva Remuneration: మూడు వారాలకే అపూర్వ ఎలిమినేషన్.. ఆమెకు అందిన పారితోషికం ఎంతో తెలుసా?
Recommended image2
Hanuman Ansh Telugu Day 3 Collections: తెలుగులో హనుమాన్‌ అంశ్‌ ఊహించని జంప్‌.. మూడు రోజుల్లో ఎంత వచ్చాయంటే?
Recommended image3
Charan Remuneration: నాలుగు వారాలున్న చరణ్‌కి బిగ్‌ బాస్‌ తెలుగు 10 నుంచి దక్కిన పారితోషికం ఇంతేనా?
Related Stories
Recommended image1
Shivakumar Marihal: బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక జైన్ ప్రియుడు, షాలినీకి ఇచ్చిపడేసిన శివకుమార్
Recommended image2
Katakatala Rudraiah Review: కృష్ణ మీద కోపంతో కృష్ణంరాజుకు నిర్మాత అవకాశం.. బ్లాక్‌బస్టర్‌ను సూపర్ స్టార్ ఎలా మిస్ అయ్యాడు? కటాకటాల రుద్రయ్య' రివ్యూ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved