MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Shivakumar Marihal: బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక జైన్ ప్రియుడు, షాలినీకి ఇచ్చిపడేసిన శివకుమార్

Shivakumar Marihal: బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక జైన్ ప్రియుడు, షాలినీకి ఇచ్చిపడేసిన శివకుమార్

Shivakumar Marihal: అప్పుడు ప్రియుడు.. ఇప్పుడు ప్రియురాలు.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో వైల్డ్ 5 గురు వైల్డ్ ఎంట్రీ ఇవ్వగా.. అందులో శివకుమార్ కూడా ఒకరు. సీజన్ 7 లో టాప్ 5 లో నిలిచిన ప్రియాంక జైన్ ప్రియుడు శివకుమార్.

3 Min read
Author : Mahesh Jujjuri
Published : Oct 11 2026, 07:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బిగ్ బాస్ తెలుగు 10 లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్..
Image Credit : Star Maa

బిగ్ బాస్ తెలుగు 10 లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్..

తెలుగు బుల్లితెరపై అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో 'బిగ్ బాస్' (Bigg Boss Telugu) సీజన్ 10 రసవత్తరంగా సాగుతోంది. ఈ షోలో ఇప్పటికే ఉన్న జనాలు కొట్టుకు చస్తున్నారు. ప్రతీ రోజు పెద్ద యుద్దమే కొనసాగుతుండగా.. హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీల ద్వారా మరింత జోష్ తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. అందులో భాగంగా తాజాగా ఆ ఐదుగురు వైల్ కార్డ్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. అందులో సీరియల్ హీరో శివకుమార్ (Shivakumar Marihal) కూడా ఉన్నాడు. శివ కుమార్ బిగ్ బాస్ ఎంట్రీ గురించి చాలా కాలంగా వార్తలు వైరల్ అవుతుండగా.. అనుకున్నట్టుగానే హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు మౌనరాగం హీరో. బిగ్ బాస్ సీజన్ 7 లో టాప్ 5లోకి వచ్చిన ప్రియాంక జైన్ ప్రియుడు శివకుమార్. అప్పుడు ప్రియురాలు బిగ్ బాస్ తో సత్తా చాటగా.. ఇప్పుడు ప్రియుడు తన టాలెంట్ చూపించడానికి రెడీ అయ్యాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
షాలినికి ఇచ్చిపడేసిన శివకుమార్
Image Credit : Star Maa

షాలినికి ఇచ్చిపడేసిన శివకుమార్

బిగ్ బాస్ హౌస్‌లోకి వైల్డ్ కార్డ్‌ ద్వారా అడుగుపెట్టడానికి ముందు హోస్ట్ నాగార్జున వారి ముఖాలు రివిల్ చేయకుండా మాస్క్ లు పెట్టి.. హౌస్ లో వారి గురించి మాట్లాడించారు. బిగ్ బాస్ హౌస్ లో నీ టార్గెట్ ఎవరు అని కింగ్ అడిగిన వెంటనే.. షాలినీ మీద ఆరో మార్క్ పెట్టాడు శివ. తన గేమ్ తాను ఆడకుండా.. రోహిత్ ను ప్రభావితం చేస్తుందని, గట్టిగా అరవడం లాంటివి తనలో మైనస్ అవుతున్నాయంటూ.. తన అభిప్రాయం వెల్లడించాడు శివ.

అంతే కాదు షాలిని అగ్నిపరీక్షలో ఎంత బాగా ఆట చూపించిందో.. ఆతర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తరువాత తన ఆట పూర్తిగా మారిపోయిందని అన్నాడు. షాలినీతోనే డైరెక్ట్ గా మార్లాడుతూ.. షాలినీ గారు మీరు బిగ్ బాస్ హౌస్ లోకి బిగ్ బాస్ కప్ కోసం వెళ్లినట్టు లేదు.. రోహిత్ ను గెలుచుకోడానికి వెళ్లినట్టుందని అన్నాడు. మరో వైపు చరణ్‌ పరిస్థితి కూడా అలానే ఉంది. హౌస్ లోకి లక్కిగా రెండో సారి వచ్చాడు.. కానీ ఆ లక్కును నిలబెట్టుకునేలా లేడు అంటూ చరణ్ పై కూడా విమర్శలు చేశాడు శివ కుమార్. నరేష్ ఈ విషయం గురించి చెప్పినా కూడా పట్టించుకోలేదు. అతన్ని విమర్శించారు. అది కరెక్ట్ కాదు అని అన్నాడు శివ. ఆ ఇద్దరి గురించి హౌస్ లో జరుగుతున్న పరిణామాలు, స్ట్రాటజీల గురించి శివకుమార్ తనదైన శైలిలో విశ్లేషించారు.

35
అసలు ఎవరు ఈ శివకుమార్ - బ్యాక్ గ్రౌండ్ ఏంటి?
Image Credit : Shivakumar Marihal / FaceBook

అసలు ఎవరు ఈ శివకుమార్ - బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

శివకుమార్ పూర్తి పేరు శివకుమార్ మారిహాల్. ఈయన సొంతూరు కర్ణాటక అయినప్పటికీ, తన అభినయంతో తెలుగు టెలివిజన్ రంగంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. స్టార్ మా ఛానెల్‌లో ప్రసారమైన సూపర్ హిట్ సీరియల్ 'మౌనరాగం' ద్వారా శివకుమార్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. ఈ ధారావాహికలో ఆయన నటనకు మంచి గుర్తింపు రావడంతో పాటు యువతలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆ తర్వాత 'నిన్ను కోరి' వంటి సీరియల్స్‌తో పాటు పలు టెలివిజన్ షోలలో పాల్గొంటూ తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. నటనపై మక్కువతో ఇండస్ట్రీలోకి వచ్చిన ఆయన, అతి తక్కువ కాలంలోనే తన హ్యాండ్సమ్ లుక్స్, సహజమైన నటనతో బుల్లితెర ప్రియుల ఫేవరెట్ హీరోగా నిలిచారు.

45
ప్రియాంక జైన్‌తో పరిచయం, ప్రేమ
Image Credit : Shivakumar Marihal / FaceBook

ప్రియాంక జైన్‌తో పరిచయం, ప్రేమ

శివకుమార్ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. తెలుగు బుల్లితెరపై మోస్ట్ వాంటెడ్ సెలబ్రిటీ జోడీగా శివకుమార్ ‌- ప్రియాంక జైన్ గుర్తింపు పొందారు. 'మౌనరాగం' సీరియల్‌లో నటిస్తున్న సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా క్రమంగా ప్రేమగా మారింది. అప్పటి నుంచి గత ఏడేళ్లుగా వీరు ప్రేమలో ఉన్నారు. సహజీవనం కూడా చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ ఈ జంట ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటూ తమ రీల్స్, వెకేషన్స్ ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. అంతేకాకుండా 'నెవర్ ఎండింగ్ టేల్స్' (Never Ending Tales) పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్‌ను కూడా ప్రారంభించి తమ వ్యక్తిగత విషయాలను అభిమానులకు చేరువ చేశారు.

55
ప్రియాంక జైన్ బ్యాక్‌గ్రౌండ్
Image Credit : Shivakumar Marihal / FaceBook

ప్రియాంక జైన్ బ్యాక్‌గ్రౌండ్

శివకుమార్ ప్రియురాలైన ప్రియాంక జైన్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఆమె 'మౌనరాగం', 'జానకి కలగనలేదు' వంటి సీరియల్స్ ద్వారా తెలుగు ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ముఖ్యంగా గతంలో ప్రసారమైన 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 7' లో కంటెస్టెంట్‌గా పాల్గొని టాప్-5 వరకు వెళ్ళి లేడీ టైటిల్ ఫేవరెట్‌గా సత్తా చాటారు. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆమె పలు రియాలిటీ షోలు, డ్యాన్స్ షోలలో పాల్గొంటూ కెరీర్‌లో దూసుకుపోతున్నారు. ఇలా బుల్లితెరపై విడివిడిగా తమ నటనతో ఆకట్టుకున్న ఈ జంట, ఇప్పుడు ఒకరు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ కాగా, మరొకరు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా బిగ్ బాస్ హౌస్‌లోకి అడుగుపెట్టడం బుల్లితెర వర్గాల్లో అత్యంత ఆసక్తికరమైన చర్చగా మారింది. శివకుమార్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ హౌస్‌లోని పాత కంటెస్టెంట్లకు ఏ విధమైన సవాళ్లను విసురుతుందో వేచి చూడాలి.

About the Author

MJ
Mahesh Jujjuri
మహేశ్ జుజ్జూరి 13 ఏళ్ళకు పైగా తెలుగు జర్నలిస్టుగా పని చేస్తున్నారు. ఈయన గతంలో 10 టీవీలో సినిమా, ఫీచర్స్ జర్నలిస్టుగా పని చేశారు. 2021 నుంచి ఏసియా నెట్ తెలుగులో సినిమా జర్నలిస్టుగా ఉన్నరు. ఓటీటీ, టీవీ, బిగ్ బాస్, లైఫ్ స్టైల్ ఇతర సెలబ్రిటీలకు సంబందించిన విశేషాలను, ఫీచర్లను రాయడం ఈయన ప్రత్యేకత. క్వాలిటీ కంటెంట్‌ తో విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది.
బిగ్ బాస్ తెలుగు
వినోదం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Rakul Preet Singh: రాంచరణ్ సినిమా నుంచి అజయ్ దేవగన్ మూవీ వరకు.. రకుల్ కెరీర్ లో టాప్ 10 బెస్ట్ రోల్స్ ఇవే
Recommended image2
Chiranjeevi: నా డబ్బు తిరిగి రావాలంటే చిరంజీవి ఒక్కడే మార్గం..ఛాన్స్ ఇచ్చిన మెగాస్టార్ నే ముంచేసిన డైరెక్టర్
Recommended image3
Amitabh Bachchan Net Worth: 90 కోట్ల అప్పు నుంచి 4 వేల కోట్ల ఆస్తి వరకు బిగ్ బీ జర్నీ
Related Stories
Recommended image1
Kannamoochi Web Series: దాగుడుమూతలు ఆడుతూ కూతురు మాయం.. ఓటీటీలో వణుకు పుట్టిస్తున్న వెబ్ సిరీస్
Recommended image2
Katakatala Rudraiah Review: కృష్ణ మీద కోపంతో కృష్ణంరాజుకు నిర్మాత అవకాశం.. బ్లాక్‌బస్టర్‌ను సూపర్ స్టార్ ఎలా మిస్ అయ్యాడు? కటాకటాల రుద్రయ్య' రివ్యూ..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved