- Home
- Entertainment
- Demon Rithu: వర్షిణి మిత్ర ద్రోహం చేసింది, అందుకే కట్ చేస్తున్నా.. హౌస్ లో ఎడమొహం పెడమొహంగా రీతూ, డిమాన్
Demon Rithu: వర్షిణి మిత్ర ద్రోహం చేసింది, అందుకే కట్ చేస్తున్నా.. హౌస్ లో ఎడమొహం పెడమొహంగా రీతూ, డిమాన్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 లో 80వ రోజు హౌస్ లోకి గెస్ట్ లుగా డిమాన్ పవన్, రీతూ చౌదరి.. శోభా శెట్టి, టేస్టీ తేజ సందడి చేశారు. సీజన్ లో రీతూ, డిమాన్ మధ్య క్లోజ్ రిలేషన్ సాగిన సంగతి తెలిసిందే.

బిగ్ బాస్ తెలుగు 10
బిగ్ బాస్ హౌస్ లో మాజీ కంటెస్టెంట్ల సందడి కొనసాగుతోంది. 80వ రోజు హౌస్ లోకి మాజీ కంటెస్టెంట్స్ రీతూ, డిమాన్ పవన్ గెస్ట్ లుగా వచ్చారు. వారి తర్వాత టేస్టీ తేజ, శోభా శెట్టి ఎంట్రీ ఇచ్చారు. దీనితో ఈ ఎపిసోడ్ ఎంటర్టైనింగ్ గా సాగింది. అయితే ఆసక్తికరంగా డిమాన్, రీతూ కలసి రాలేదు. ఒకరి తర్వాత ఒకరు వచ్చారు. అది కూడా హౌస్ లోకి వచ్చాక ఇద్దరూ ఎడమొహం పెడమొహం గానే ఉన్నారు.
ఎడమొహం పెడమొహంగా డిమాన్, రీతూ
గత సీజన్ లో ఇద్దరూ బాగా క్లోజ్ అయ్యారు. ఇద్దరి మధ్య ప్రేమ కూడా చిగురించింది. బయటకు వెళ్లిన తర్వాత కూడా ఇద్దరూ తమ రిలేషన్ కొనసాగించారు. కానీ ఆ తర్వాత ఇద్దరూ విడిపోయిన సంగతి తెలిసిందే. డిమాన్ పవన్ స్వయంగా సోషల్ మీడియాలో తాను, రీతూ విడిపోతున్నట్లు ప్రకటించాడు. దానికి కారణం ఇద్దరి మధ్య పరిష్కారం కానీ గొడవలే అని పోస్ట్ చేశారు. ఇదంతా పక్కన పెడితే హౌస్ లోకి వచ్చాక డిమాన్, దేబ్జానీ ఒక టీమ్ గా.. రీతూ, ముకేశ్ మరోటీమ్ గా పోటీ పడ్డారు.
డిమాన్ కి గిఫ్ట్ ఇచ్చిన దేబ్జానీ
ఈ గేమ్ కి త్రిగుణ్ సంచాలకుడు. త్రిగుణ్ సంచాలకుడిగా సరిగ్గా వ్యవహరించాలేదని రీతూ గొడవ పెట్టుకుంది. ఫైనల్ గా ఈ గేమ్ లో దేబ్జానీ, డిమాన్ విజయం సాధించారు. దీనితో దేబ్జానీకి కెప్టెన్సీ కంటెండర్ గా అవకాశం దక్కింది. ఆ సంతోషంలో దేబ్జానీ.. డిమాన్ కి తాను దాచుకున్న టీ షర్ట్ గిఫ్ట్ గా ఇచ్చింది. ఆ తర్వాత హౌస్ లోకి శోభా శెట్టి, టేస్టీ తేజ వచ్చారు.
వర్షిణి మిత్ర ద్రోహం చేసింది
తేజ, నరేష్ ఒక జట్టుగా.. అమన్, శోభ మరో జట్టుగా గేమ్ ఆడారు. ఈ గేమ్‌లో శోభా, అమన్ విజయం సాధించారు. అంతకు ముందు శోభా, తేజ రాగానే హౌస్ మేట్స్ తో ఒక ఆసక్తికర టాస్క్ చేయించారు. హౌస్ లో ఉన్న బెస్ట్ ఫ్రెండ్ కి ఫ్రెండ్ షిప్ బ్యాండ్ తొడగాలి. అలాగే ఫ్రెండ్ షిప్ ఎవరితో చేయకూడదు అనుకుంటారో వాళ్లకు బ్యాండ్ తొలగించి కట్ చేయాలి. ముందుగా త్రిగుణ్ దీనిని ప్రారంభించారు. వంశీ తన బెస్ట్ ఫ్రెండ్ అని అతడికి బ్యాండ్ ఇచ్చాడు. వర్షిణితో ఫ్రెండ్ షిప్ చేయకూడదు అనుకుంటున్నా. ఆమె మిత్ర ద్రోహం చేసింది. బయటకు వెళ్లిన తర్వాత అయినా సారీ చెబుతుందేమో చూడాలి అంటూ ఆమెకి బ్యాండ్ తొడిగి కట్ చేశాడు.















