పాటకు 3 కోట్లు.. ఇండియాలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ సింగర్ ఎవరు..?
సింగర్స్ లో అత్యధికం రెమ్యునరేషన్ తీసుకునే స్టార్ ఎవరు అంటే..వెంటనే ఏ శ్రేయాఘోషల్ పేరో.. చిత్ర, సిద్ధ్ శ్రీరామ్ లాంటి వారి పేర్లు గుర్తుకు వస్తాయి. కాని ఇండియాలోనే హైయ్యెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే సింగర్ ఎవరోతెలుసా..
1950లలో భారతీయ సినిమాలో ప్రముఖ గాయకులకు 300 చెల్లించేవారు. కానీ నేడు దేశంలోని టాప్ సింగర్లకు లక్షల్లో ఇస్తున్నారు. ముఖ్యంగా.. డిమాండ్ ఉన్న స్టార్ సింగర్స్ కు కోట్లలోనే ఇస్తున్నారు. ఇక ఇండియాలో భారీగా రెమ్యూనరేషన్ తీసుకునే సింగర్ ఎవరో తెలుసా..? ఆయన ఒక్క పాటకు ఎంత వసూలు చేస్తాడో కూడా తెలుసుకుందాం..?
అతను భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందుతున్న గాయకుడిగా గుర్తింపు పొందాడు, ఒక్కో పాటకు కోట్లకు కోట్లు వసూలు చేశాడు. అతను మరెవరో కాదు రెహమాన్. తన సంగీతంతో కోట్లాది మంది హృదయాలను హత్తుకున్నాడు ఏఆర్. రెహమాన్. సంగీతం మరియు అతని గానం వల్ల చాలా సినిమాలు విజయవంతంగా నడిచాయి.
నాగార్జున పాడు అలవాటు, మాన్పించేసిన అమల.. ? ఏలా చేసిందో తెలుసా..?
రెహమాన్ సంగీతం సమకూర్చడమే కాకుండా అప్పుడప్పుడు పాటలు కూడా పాడుతున్నారు. ఆయన స్వరంలోని ఎన్నో పాటలు ఎవర్‌గ్రీన్ హిట్‌గా నిలిచి అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నాయి.
శ్రీదేవి డెత్ మిస్టరీ.. బయటపడ్డ అసలు నిజం....? కారణం అదేనా..?
అంతే కాదు ఆయన పాడటం చిత్రం అయితే.. ఆయన పాటకు తీసుకునే రేటు ఇంకా చిత్రం.. ఏఆర్ రెహమాన్ పాట పాడేందుకు ఎంత తీసుకుంటాడో తెలుసా? ఆయన ఒక్కో పాటకు రూ. 3 కోట్ల వరకూ వసూలు చేస్తాడని టాక్. నివేదికల ప్రకారం భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందిన గాయకుడు కూడా రెహమానే.
మహేష్ బాబు సినిమాలో సిమ్రాన్.. రాజమౌళి స్కెచ్ మామూలుగా లేదుగా..
singer shreya ghoshal
భారతదేశంలోని ఇతర టాప్ సింగర్స్ ఉన్నా..ఎక్కువ రేటు మాత్రం రెహమాన్ కే ఇస్తున్నారట. రెహమాన్ తర్వాత, భారతదేశంలో అత్యధిక పారితోషికం పొందిన గాయని శ్రేయా ఘోషల్, ఆమె పాటకు 25 లక్షల వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. సునీతి చౌహాన్ మరియు అరిజిత్ సింగ్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు, ఇద్దరూ రూ. 18-20 లక్షల మధ్య వసూలు చేస్తున్నారు.
Sonu Nigam about coaroach
అత్యధిక పారితోషికం పొందే ఇతర గాయకులలో షాన్ మరియు సోనూ నిగమ్ ఉన్నారు, వీరిద్దరూ రూ. 18 లక్షలు వసూలు చేస్తారు. నేహా కక్కర్, మికా మరియు హనీ సింగ్ ఒక్కో పాటకు దాదాపు 10 లక్షల పారితోషికం తీసుకుంటున్నట్లు సమాచారం.