- Home
- Entertainment
- చిరంజీవి కంటే చంద్రమోహన్ కే క్రేజ్ ఎక్కువ, అతడిని తొలగించండి అంటూ స్టార్ డైరెక్టర్ కామెంట్స్.. కట్ చేస్తే
చిరంజీవి కంటే చంద్రమోహన్ కే క్రేజ్ ఎక్కువ, అతడిని తొలగించండి అంటూ స్టార్ డైరెక్టర్ కామెంట్స్.. కట్ చేస్తే
చిరంజీవి తన కెరీర్ బిగినింగ్ లో ఎన్నోసార్లు తిరస్కరణకు గురయ్యారు. ఒక లెజెండ్రీ డైరెక్టర్ తెరకెక్కించిన సూపర్ హిట్ మూవీలో చిరంజీవి హీరోగా నటించాల్సింది. ఆ వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

చిరంజీవి కెరీర్ కష్టాలు
మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారు చిత్రం తిరుగులేని కలెక్షన్స్ తో బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. చిరంజీవి సినిమాకి హిట్ టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద రచ్చ ఎలా ఉంటుందో ఈ సినిమాతో ప్రూవ్ అయింది. చిరంజీవి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని ఈ స్థాయికి చేరుకున్నారు.కెరీర్ బిగినింగ్ లో చిరంజీవి చాలా మంది డైరెక్టర్ల దగ్గర తిరస్కరణకి గురయ్యారు. చిరంజీవితో జాతర అనే సినిమా తెరకెక్కించిన దర్శకుడు ధవళ సత్యం ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
డైరెక్టర్ ధవళ సత్యం
ధవళ సత్యం స్టార్ డైరెక్టర్ దాసరి నారాయణ రావుకి శిష్యుడు. ఆయన తెరకెక్కించిన తొలి చిత్రం జాతర. ఈ మూవీలో చిరంజీవి హీరోయిన్. 1980లో తెరకెక్కిన జాతర చిత్రం మంచి విజయం సాధించింది. 1978 నుంచే సత్యంకి చిరంజీవి తెలుసు. 1978లో నేను దాసరి గారికి అసిస్టెంట్ డైరెక్టర్ ని. ఆ టైంలో దాసరి గారు శివరంజని చిత్రం తెరకెక్కించాడనికి రెడీ అవుతున్నారు. హీరో కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయి.
చిరంజీవిని రిజెక్ట్ చేసిన స్టార్ డైరెక్టర్
ఆడిషన్స్ కి చిరంజీవి కూడా వచ్చారు. నటన ఇరగదీశాడు. మేమంతా చిరంజీవి ఈ చిత్రంలో హీరోగా ఫిక్స్ అయిపోతాడు అని అనుకున్నాం. కానీ దాసరి గారు చిరంజీవిని సెలెక్ట్ చేయలేదు. హరిప్రసాద్ ని తీసుకున్నారు. అప్పుడే చిరంజీవితో ఒక మాట అన్నాను. నేను డైరెక్టర్ అయితే నా ఫస్ట్ సినిమా హీరో నువ్వే అని చెప్పా. నేను కామెడీగా చెబుతున్నాను అనుకుని.. అంత అవసరం లేదండీ..ఐదు సన్నివేశాలు ఉండే పాత్ర ఇవ్వండి చాలు అని రిక్వస్ట్ చేశారు.
చిరంజీవిని తొలగించు, చంద్రమోహన్ ని పెట్టుకో
చిరంజీవికి చెప్పినట్లుగానే జాతర సినిమాలో హీరోగా తీసుకున్నాను. ఆ సినిమా కోసం చిరంజీవితో పాటు అందరినీ కొత్త వాళ్ళని తీసుకున్నా. నేను కూడా కొత్తే. దీనితో మా గురువు దాసరి గారు చిరంజీవి విషయంలో అభ్యంతరం చెప్పారు. నీకు ఇది తొలి చిత్రం. అందరూ కొత్త వాళ్లనే పెట్టుకుంటే ఎలా వర్కౌట్ అవుతుంది అని దాసరి అన్నారు. నాకు చెప్పకుండా హీరోని ఎలా సెలెక్ట్ చేశావ్ అని అడిగారు. చిరంజీవిలో ఒక స్పార్క్ ఉంది. భవిష్యత్తులో గొప్ప ఆర్టిస్ట్ అయిపోతాడు అని అన్నాను. అదేం లేదు.. చిరంజీవిని తొలగించి చంద్రమోహన్ ని హీరోగా పెట్టుకో.
తిరుగులేని స్టార్ గా ఎదిగిన చిరంజీవి
కనీసం హీరోకి అయినా క్రేజ్ ఉంటే నీ తొలి చిత్రానికి ఉపయోగపడుతుంది అని దాసరి అన్నారు. కానీ నేను వినకుండా చిరంజీవినే హీరోగా ఫైనల్ చేసినట్లు ధవళ సత్యం తెలిపారు. ఆ తర్వాత రోజుల్లో తనకే డేట్లు ఇవ్వలేనంత బిజీ ఆర్టిస్ట్ గా చిరంజీవి మారిపోయారు అని సత్యం గుర్తు చేసుకున్నారు.

