MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Entertainment
  • చెప్పి మరీ ఏఎన్నార్ రికార్డులు చెల్లా చెదురు చేసిన సూపర్ స్టార్ కృష్ణ.. శ్రీదేవిని తప్పించాల్సిందే అంటూ

చెప్పి మరీ ఏఎన్నార్ రికార్డులు చెల్లా చెదురు చేసిన సూపర్ స్టార్ కృష్ణ.. శ్రీదేవిని తప్పించాల్సిందే అంటూ

చెప్పి మరీ ఏఎన్నార్ రికార్డులని బ్రేక్ చేశారు సూపర్ స్టార్ కృష్ణ. ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు ధీటైన హీరో అనే గుర్తింపు కృష్ణకి వచ్చింది ఆ చిత్రంతోనే. ఇంతకీ ఆ మూవీ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jan 18 2026, 10:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సూపర్ స్టార్ కృష్ణ వరుస విజయాలు
Image Credit : Youtube/ Telugu Full Movies

సూపర్ స్టార్ కృష్ణ వరుస విజయాలు

సూపర్ స్టార్ కృష్ణ తన కెరీర్ లో సాధించని ఘనత అంటూ లేదు. సినిమా కోసం ఎన్నో ప్రయోగాలు, లెక్కకు మించి సాహసాలు చేశారు. తెలుగు సినిమా రూపురేఖలు మారడంలో కృష్ణ కీలక పాత్ర పోషించారు. సూపర్ స్టార్ కృష్ణకి 70వ దశకం గోల్డెన్ డికేడ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈ దశాబ్దంలోనే కృష్ణకి మోసగాళ్లకు మోసగాడు, పండంటి కాపురం, అల్లూరి సీతారామరాజు లాంటి అద్భుతమైన చిత్రాలు పడ్డాయి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బిగ్గెస్ట్ హిట్ గా పండంటి కాపురం
Image Credit : Asianet News

బిగ్గెస్ట్ హిట్ గా పండంటి కాపురం

1972లో సూపర్ స్టార్ కృష్ణ నటించిన పండంటి కాపురం చిత్రం విడుదలై బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఫ్యామిలీ ఆడియన్స్ ని ఉర్రూతలూగించింది. ఈ చిత్రాన్ని కృష్ణ తన సొంత నిర్మాణంలో రూపొందించారు. కృష్ణ సోదరులు జి హనుమంతరావు, ఆదిశేషగిరి రావు నిర్మాణ బాధ్యతలు చూసుకున్నారు. ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ తో పాటు జమున, ఎస్వీ రంగారావు, గుమ్మడి, విజయనిర్మల, బి సరోజాదేవి, జయసుధ, ప్రభాకర్ రెడ్డి లాంటి లెజెండ్రీ నటీనటులు నటించారు. 

Related Articles

Related image1
చిరంజీవి కంటే చంద్రమోహన్ కే క్రేజ్ ఎక్కువ, అతడిని తొలగించండి అంటూ స్టార్ డైరెక్టర్ కామెంట్స్.. కట్ చేస్తే
Related image2
Naga Chaitanya: నాగ చైతన్యతో నటించి కనిపించకుండా పోయిన ఆరుగురు హీరోయిన్లు.. డేంజర్ లో మరో ముగ్గురి కెరీర్
35
ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు ధీటైన హీరో
Image Credit : Asianet News

ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు ధీటైన హీరో

ఈ చిత్రానికి సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని కృష్ణ సోదరుడు ఆదిశేషగిరి రావు ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు ధీటైన హీరో సూపర్ స్టార్ కృష్ణ అనే గుర్తింపు పండంటి కాపురం చిత్రంతోనే వచ్చింది అని తెలిపారు. అంతకు ముందు 1971లో ఏఎన్నార్ నటించిన దసరా బుల్లోడు విడుదలై ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసింది. 

45
ఏఎన్నార్ రికార్డులని చెప్పి మరీ కొట్టిన కృష్ణ
Image Credit : social media

ఏఎన్నార్ రికార్డులని చెప్పి మరీ కొట్టిన కృష్ణ

ఆ సినిమాని బీట్ చేయాలనే టార్గెట్ తోనే కృష్ణ గారు పండంటి కాపురం చిత్రం ప్రారంభించారు. ఆయన అనుకున్నట్లుగానే పండంటి కాపురం సంచలన విజయం సాధించి దసరా బుల్లోడు కలెక్షన్స్ రికార్డ్ ని బ్రేక్ చేసింది అని ఆదిశేషగిరి రావు తెలిపారు. ఈ చిత్రాన్ని 1975లో హిందీలో సునెహ్రా సన్సార్ అనే పేరుతో రీమేక్ చేశారు. హిందీలో రాజేంద్ర కుమార్, హేమ మాలిని జంటగా నటించారు. రాజేంద్ర కుమార్ కి అంతగా క్రేజ్ లేదు. అయినప్పటికీ ఈ చిత్రం హిందీలో బాగానే ఆడింది. 

55
శ్రీదేవికి ఝలక్
Image Credit : Asianet News

శ్రీదేవికి ఝలక్

తెలుగులో జయసుధ చిన్న పాత్రలో నటించారు. ఆమె పాత్ర కోసం హిందీలో శ్రీదేవిని తీసుకున్నాం. సునెహ్రా సన్సార్ చిత్ర హక్కులని నార్త్ లో ఒక ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి ఇచ్చాం. శ్రీదేవి పాత్ర కొంత షూటింగ్ జరిగిన తర్వాత ఆ డిస్ట్రిబ్యూషన్ వాళ్ళు రషెస్ చూశారు. శ్రీదేవిని చూసి ఈ అమ్మాయి బాగలేదు.. ఆమెని తీసేసి వేరే వాళ్ళని పెట్టుకుంటేనే ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తాం అని వాళ్ళు అడ్డం తిరిగారు. అప్పటికి శ్రీదేవికి అంత క్రేజ్ లేదు. ఇక చేసేది లేక శ్రీదేవిని తప్పించి వేరే అమ్మాయితో షూటింగ్ పూర్తి చేసినట్లు ఆదిశేషగిరి రావు తెలిపారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
వినోదం
కృష్ణ ఘట్టమనేని

Latest Videos
Recommended Stories
Recommended image1
Irumudi OTT Date: రవితేజ 'ఇరుముడి' ఓటీటీ రిలీజ్‌ డేట్‌ ఇదే.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Recommended image2
Mandi Chicken Biryani: ఇంట్లోనే ఈజీగా పొగలు కక్కే చికెన్ మండి బిర్యానీ..ముక్క కూడా మిగలదు
Recommended image3
Nagarjuna: కాలు విరిగినా షూటింగ్‌ చేసిన నాగార్జున, సెట్‌లో తీవ్ర అవమానం.. రియాలిటీ చూపించిన దర్శకుడు
Related Stories
Recommended image1
చిరంజీవి కంటే చంద్రమోహన్ కే క్రేజ్ ఎక్కువ, అతడిని తొలగించండి అంటూ స్టార్ డైరెక్టర్ కామెంట్స్.. కట్ చేస్తే
Recommended image2
Naga Chaitanya: నాగ చైతన్యతో నటించి కనిపించకుండా పోయిన ఆరుగురు హీరోయిన్లు.. డేంజర్ లో మరో ముగ్గురి కెరీర్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved