2026 లో బాక్సాఫీస్ వార్, 6 సినిమాలతో బాలీవుడ్ పై యుద్ధానికి సై అంటున్న సౌత్ సినిమా
Bollywood vs South Cinema : 2026లో బాక్సాఫీస్ వార్ కోసం చాలా సినిమాలు రెడీ అవుతున్నాయి. ఈ ఏడాది బాలీవుడ్ వర్సెస్ సౌత్ ఇండియన్ సినిమాలా మారబోతోంది. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం, 2026లో ఎన్ని సినిమాలు తలపడనున్నాయంటే?

జననాయగన్ Vs కిస్ కిస్కో ప్యార్ కరూ 2
ఈ రెండు సినిమాలు జనవరి 9న రిలీజ్ అవుతున్నాయి. 'జననాయగన్ ' తలపతి విజయ్ పాన్ ఇండియా తమిళ యాక్షన్ సినిమా. 'కిస్ కిస్కో ప్యార్ కరూ 2' కపిల్ శర్మ నటించిన బాలీవుడ్ కామెడీ సినిమా. ఈరెండు సినిమాలలో విజయ్ సినిమానే ఎక్కువ ప్రభావం చూపిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.
ధురంధర్ 2 Vs టాక్సిక్
ఇది 2026లో అతిపెద్ద పోటీ. రణవీర్ సింగ్ 'ధురంధర్ 2' మార్చి 9న వస్తోంది. అదే రోజు యశ్ 'టాక్సిక్', అడివి శేష్ 'డకాయిట్: ఎ లవ్ స్టోరీ' కూడా రిలీజ్ అవుతున్నాయి. ఈసినిమాల మధ్య కాస్త టఫ్ కాంపిటేషన్ కనిపించేలా ఉంది. మరీ ముఖ్యంగా రణ్ వీర్ సింగ్ , యష్ మధ్య ప్రధానంగా పోటీ నెలకొనబోతుంది.
రాజా శివాజీ Vs గూఢచారి 2
మే 1న రితేష్ దేశ్‌ముఖ్ 'రాజా శివాజీ' రిలీజ్ అవుతుంది. అదే రోజు అడివి శేష్ నటించిన తెలుగు పాన్ ఇండియా స్పై యాక్షన్ డ్రామా గూఢచారి 2 కూడా రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాలలో గూఢచారి సినిమా ప్రభావం ఎక్కువగా కనిపించే అవకాశం ఉంది.
కాక్‌టెయిల్ 2 Vs జైలర్ 2
సౌత్ సూపర్ స్టార్ రజినీకాంత్ తో తలపడటానికి షాహిద్ కపూర్ రెడీ అవుతున్నాడు. ఈ ఏడాది జూన్ 11 న షాహిద్ కపూర్ 'కాక్‌టెయిల్ 2' రిలీజ్ కాబోతుండగా.. ఆ తర్వాతి రోజే, జూన్ 12న రజనీకాంత్ నటించిన 'జైలర్ 2' పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రెండు సినిమాలలో జైలర్ ప్రభావం బాక్సాఫీస్ దగ్గర ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.
లవ్ అండ్ వార్ Vs ఫౌజీ
ఆగస్టు 14, 2026న 'లవ్ అండ్ వార్', 'నాగ్‌జిలా' వస్తున్నాయి. వీటికి పోటీగా ఆగస్టు 15న పాన్ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన తెలుగు యాక్షన్ డ్రామా 'ఫౌజీ' వస్తోంది. ప్రభాస్ ప్రభంజనం ముందు ఆ రెండు సినిమాలు నిలబడటం కష్టమనే చెప్పాలి.
దృశ్యం 3 Vs దృశ్యం 3
అక్టోబర్ 2, 2026న చరిత్రలో తొలిసారిగా ఒకే పేరుతో రెండు సినిమాలు పోటీ పడనున్నాయి. ఒకటి అజయ్ దేవగన్ బాలీవుడ్ 'దృశ్యం 3', రెండోది మోహన్‌లాల్ మలయాళ 'దృశ్యం 3'. ఈ రెండు సినిమాలు ఒకేసారి రిలీజ్ కాబోతున్నాయి. మరి ఇందులో ఎవరిసినిమాకు ఎక్కువ స్పందన వస్తుందో చూడాలి.

