- Home
- Entertainment
- 50 ఏళ్లలో 1000 సినిమాలు, 6 ఏళ్లలో హీరోగా 54 మూవీస్, స్టార్ హీరోలకు కూడా సాధ్యం కాని రికార్డు సాధించిన నటుడు ఎవరో తెలుసా?
50 ఏళ్లలో 1000 సినిమాలు, 6 ఏళ్లలో హీరోగా 54 మూవీస్, స్టార్ హీరోలకు కూడా సాధ్యం కాని రికార్డు సాధించిన నటుడు ఎవరో తెలుసా?
తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో సీనియర్ నటులు ఎంతో మంది ఉన్నారు. వారిలో ఎవరి టాలెంట్ వారిది, ఎవరి రికార్డులు వారివి. స్టార్డమ్ లేకపోయినా.. అద్భుతాలు చేసిన వారు ఎందరో ఉన్నారు. వారిలో 1000 సినిమాల రికార్డు ఉన్న హీరో గురించి మీకు తెలుసా?

టాలీవుడ్ లో మల్టీ టాలెంటెడ్ స్టార్స్
తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో మంది సీనియర్ స్టార్స్ ఉన్నారు. వారిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క టాలెంట్. ఎవరి స్పెషాలిటీ వారిది. అందులో మల్టీ టాలెంట్ స్టార్స్ కూడా ఉన్నారు. నటులుగా ఎంట్రీ ఇచ్చి సింగర్స్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ లుగా, రకరకాలుగా ప్రతిభ చూపించిన వారు ఉన్నారు. కానీ ఒక నటుడు మాత్రం టాలీవుడ్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి.. డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, హీరోగా, క్యారెక్టర్ నటుడిగా, సింగర్ గా, నిర్మాతగా, హోస్ట్ గా, మల్టీ టాలెంటెడ్ స్టార్ గా తనను తాను నిరూపించుకున్నాడు. ఆయన మరెవరో కాదు సాయి కుమార్. పోలీస్ పాత్రలతో తెలుగువారి మనసులు దోచుకున్న సాయి కుమార్.. తన కంచు కంఠంతో..మాస్ జనాలను అల్లాడించేశాడు.
50 ఏళ్ల కెరీర్ లో 1000 సినిమాల రికార్డు..
సాయి కుమార్ కెరీర్ లో మల్టీ టాస్క్ లను సూనాయాసంగా పూర్తి చేశాడు. ఆయన 50 ఏళ్ల సినిమా జీవితంలో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా 1000 కి పైగా సినిమాలు పూర్తి చేశాడు. నటుడిగా 300 లకు పైగా సినిమాల్లో నటించారు. అందులో హీరోగా 100 లోపు సినిమాలు చేశారు. సాయి కుమార్ టైమ్ ఒకప్పుడు ఎలా నడిచిందంటే.. దాదాపు 6 ఏళ్లలోనే హీరోగా 54 సినిమాల్లో నటించిన రికార్డు సాయి కుమార్ ఖాతాలో ఉంది. అంతే కాదు ఎన్నో కార్యక్రమాలకు ఆయన హోస్ట్ గా వ్యవహరించి మెప్పించాడు. కెరీర్ లో తాను అనుకున్నవన్నీ చేయగలిగానన్న సంతృప్తి ఉంది అని, పలు సందర్భాల్లో సాయి కుమార్ వెల్లడించారు.
పవర్ ఫుల్ పోలీస్ పాత్రలకు పెట్టింది పేరు..
సాయి కుమార్ అనగానే తెలుగు వారికి వెంటనే పోలీస్ స్టోరీ సినిమా గుర్తుకు వస్తుంది. ఈసినిమాలో సాయి కుమార్ నటన ఎవరు మర్చిపోలేరు. పవన్ ఫుల్ డైలాగ్స్ తో పాటు.. సాయి కుమార్ కళ్లలో కనిపించే ఎమోషన్.. సినిమాకు హైలెట్ గా నిలిచింది. ఈసినిమా నుంచి సాయికుమార్ కు వరుసగా పోలీస్ పాత్రలు వచ్చాయి. చిత్రం ఏంటంటే.. సాయి కుమార్ హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారిన తరువాత కూడా ఆయన కు ఎక్కువగా పోలీస్ వేషాలే వచ్చాయి. సీనియర్ పోలీస్ ఆఫీసర్ గా సాయి కుమార్ ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించారు.
వారసత్వంగా వచ్చిన కంచు కంఠం
సాయి కుమర్ కెరీర్ కు బాగా ఉపయోగిపడింది ఆయన కంచు కంఠం. ఆయన డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఎంత బిజీగా ఉండేవారంటే.. ఒక్క సినిమాకు డబ్బింగ్ చెప్పినందుకు 10 లక్షల హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకున్న ఏకైక ఆర్టిస్ట్ గా సాయి కుమార్ నిలిచారు. ఆయనకు ఈ వాయిస్ తన తండ్రి పీజే శర్మ నుంచి వారసత్వంగా వచ్చింది. ఆయన కూడా సీనియర్ ఆర్టిస్ గా ఎన్నో సినిమాల్లో నటించారు, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా రాణించారు. ఆయన కంఠ తన ముగ్గురు కొడుకులకు వచ్చింది. ఇండస్ట్రీలో సాయి కుమార్ తో పాటు ఆయన తమ్మళ్లు రవిశంకర్, అయ్యప్పలు ఆర్టిస్ట్ లు గా, డబ్బింగ్ ఆర్టిస్టులుగా కొనసాగుతున్నారు. అమ్మ బొమ్మాళే.. అంటూ సాయి కుమార్ తమ్ముడు రవిశంకర్ వాయస్ ను ఆడియన్స్ మర్చిపోలేరు.
సాయి కుమార్ వారసత్వం..
సాయి కుమార్ తో పాటు ఆయన తమ్ముడు రవిశంకర్ కూడా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటుడిగా కొనసాగుతున్నాడు. అద్భుతమైన పాత్రలు కూడా చేశాడు. ఇక సాయి కుమార్ తనయుడు ఆది సాయి కుమార్ కూడా హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. రీసెంట్ గా ఆయన నటించి శంబాల మూవీ రిలీజ్ అయ్యి పర్వాలేదు అనిపించింది. హీరోగా స్టార్ డమ్ లేకపోయినా.. మంచి మంచి కథలను సెలక్ట్ చేసుకుంటూ.. నటుడిగా కొనసాగుతున్నాడు ఆది సాయి కుమార్. సాయి కుమార్ కూడా ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చిన్నా, పెద్ద సినిమాల్లో నటిస్తూ.. కెరీర్ లో బిజీగా ఉన్నాడు.

