MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • Cricket
  • Ben Stokes: సడన్ షాక్ ఇచ్చిన ఇంగ్లండ్ కెప్టెన్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు బెన్ స్టోక్స్ సడన్ రిటైర్మెంట్ ఎందుకిచ్చాడు?

Ben Stokes: సడన్ షాక్ ఇచ్చిన ఇంగ్లండ్ కెప్టెన్.. ఇంటర్నేషనల్ క్రికెట్‌కు బెన్ స్టోక్స్ సడన్ రిటైర్మెంట్ ఎందుకిచ్చాడు?

Ben Stokes : నా పని అయిపోయింది.. అంటూ కన్నీళ్లతో స్టార్ ప్లేయర్ బెన్ స్టోక్ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్, స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌కు హఠాత్తుగా రిటైర్మెంట్ ఎందుకు ప్రకటించాడు?

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 29 2026, 10:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
15 ఏళ్ల ప్రస్థానానికి ఎండ్ కార్డ్.. బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ వెనుక అసలు కథ ఇదే
Image Credit : Getty

15 ఏళ్ల ప్రస్థానానికి ఎండ్ కార్డ్.. బెన్ స్టోక్స్ రిటైర్మెంట్ వెనుక అసలు కథ ఇదే

ఇంగ్లండ్ క్రికెట్ అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. ఆ జట్టు టెస్ట్ కెప్టెన్, లెజెండరీ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ అంతర్జాతీయ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు సడన్ అనౌన్స్‌మెంట్ చేశారు. న్యూజిలాండ్‌తో కరెంట్‌లీ జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ ముగిసిన తర్వాత తను ఇంటర్నేషనల్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేస్తానని క్లారిటీ ఇచ్చారు.

ట్రెంట్ బ్రిడ్జ్ టెస్టులో తను బౌలింగ్ వేస్తున్న టైమ్‌లోనే ఈ రిటైర్మెంట్ స్టేట్‌మెంట్ రిలీజ్ కావడం గమనార్హం. విశేషం ఏంటంటే, రిటైర్మెంట్ అనౌన్స్ చేసిన తర్వాత వేసిన ఫస్ట్ బాల్‌కే స్టోక్స్ వికెట్ తీశారు. జ్యాక్ ఫోల్క్స్ ఇచ్చిన క్యాచ్‌ను సెకండ్ స్లిప్‌లో పట్టుకోవడంతో ఈ అద్భుతం జరిగింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
డ్రెస్సింగ్ రూమ్‌లో ఎమోషనల్ స్పీచ్
Image Credit : Getty

డ్రెస్సింగ్ రూమ్‌లో ఎమోషనల్ స్పీచ్

35 ఏళ్ల బెన్ స్టోక్స్ జూన్ 28న నాలుగో రోజు ఆట ప్రారంభానికి ముందే తన టీమ్‌మేట్స్‌కు ఈ డెసిషన్ చెప్పారు. ఇటీవల లండన్ నైట్‌క్లబ్‌లో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల స్టోక్స్ రెండో టెస్టుకు దూరమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మూడో టెస్టుకు కెప్టెన్‌గా కమ్‌బ్యాక్ ఇచ్చి ఈ నిర్ణయం తీసుకున్నారు.

డ్రెస్సింగ్ రూమ్‌లో స్టోక్స్ చాలా ఎమోషనల్ అవుతూ మాట్లాడారు. "నేను ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నాననే రీజన్స్ తర్వాత మాట్లాడుకుందాం. కానీ ఈ టీమ్ కోసం, మీ అందరి కోసం నా సర్వస్వం ఇచ్చాను. ఇప్పుడు నాకు చివరి అవకాశం వచ్చింది. నేను కోరేది ఒక్కటే, మీరంతా కూడా అదే చేయండి. రిజల్ట్ ఎలా ఉన్నా, చివరి రెండు రోజులు మన టీమ్ 100% ఎఫర్ట్ పెట్టిందని గర్వంగా గ్రౌండ్ దాటాలి" అని స్టోక్స్ చెప్పారు.

35
15 ఏళ్ల వండర్‌ఫుల్ జర్నీకి ఎండ్ కార్డ్
Image Credit : Getty

15 ఏళ్ల వండర్‌ఫుల్ జర్నీకి ఎండ్ కార్డ్

2011లో వైట్ బాల్ క్రికెట్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన బెన్ స్టోక్స్.. 15 ఏళ్ల పాటు ఇంగ్లండ్ క్రికెట్‌లో ఒక వెలుగు వెలిగారు. డిసెంబర్ 2013లో అడిలైడ్ యాషెస్ సిరీస్‌తో టెస్ట్ డెబ్యూ చేశారు. ఇంగ్లండ్ క్రికెట్ హిస్టరీలోనే మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ ప్లేయర్‌గా స్టోక్స్ నిలిచారు. ముఖ్యంగా 2019 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై స్టోక్స్ ఆడిన నాకౌట్ ఇన్నింగ్స్ (84 నాటౌట్) మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కు తీసుకెళ్లి, ఇంగ్లండ్‌ను ఫస్ట్ టైమ్ వరల్డ్ ఛాంపియన్‌గా నిలబెట్టింది. అదే ఏడాది యాషెస్ సిరీస్‌లో హెడింగ్లీ లో ఆడిన హిస్టారికల్ 135 నాటౌట్ ఇన్నింగ్స్ క్రికెట్ హిస్టరీలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ మ్యాచ్‌గా నిలిచిపోయింది.

45
బాజ్‌బాల్ ఎరా అండ్ రికార్డులు
Image Credit : Getty

బాజ్‌బాల్ ఎరా అండ్ రికార్డులు

2022లో జో రూట్ టెస్ట్ కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాక బెన్ స్టోక్స్ ఆ బాధ్యతలు అందుకున్నారు. హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్‌తో కలిసి టెస్ట్ క్రికెట్‌లో సరికొత్త అటాకింగ్ ఫిలాసఫీ బాజ్‌బాల్ ను తీసుకొచ్చారు. వీరి లీడర్‌షిప్‌లో ఇంగ్లండ్ వరుసగా న్యూజిలాండ్, సౌతాఫ్రికా, పాకిస్తాన్‌లపై మెమరబుల్ విక్టరీస్ సాధించింది. స్టోక్స్ తన కెరీర్‌లో 122 టెస్టులు ఆడి 7,228 రన్స్ చేశారు, 246 వికెట్లు తీశారు. అలాగే 114 వన్డేల్లో 3,463 రన్స్, 74 వికెట్లు.. 43 టీ20ల్లో 585 రన్స్, 26 వికెట్లు పడగొట్టారు. జాక్వెస్ కల్లిస్ తర్వాత 7 వేల టెస్ట్ రన్స్, 250 టెస్ట్ వికెట్లు తీసిన సెకండ్ ఆల్‌రౌండర్‌గా రికార్డ్ క్రియేట్ చేశారు. స్టోక్స్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ 44 టెస్టుల్లో 24 మ్యాచ్‌లు గెలిచింది.

55
ఈసీబీ చైర్మన్ ఘన నివాళి
Image Credit : Getty

ఈసీబీ చైర్మన్ ఘన నివాళి

బెన్ స్టోక్స్ సడన్ డెసిషన్‌పై ఇంగ్లండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ రిచర్డ్ థాంప్సన్ రియాక్ట్ అయ్యారు. "బెన్ స్టోక్స్ ఇంగ్లండ్ గ్రేటెస్ట్ క్రికెటర్లలో ఒకరిగా, ఈ జనరేషన్ బిగ్గెస్ట్ హీరోగా రిటైర్ అవుతున్నారు. ప్రెజర్ టైమ్‌లో తను ఆడే విధానం, గ్రౌండ్‌లో ఎప్పుడూ లొంగిపోని అతని యాటిట్యూడ్ అభిమానుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి. ఒక అద్భుతమైన బ్యాటర్, బెస్ట్ బౌలర్, ఫియర్ లెస్ కెప్టెన్‌ను ఈరోజు ఇంటర్నేషనల్ క్రికెట్ మిస్ అవుతోంది" అని కొనియాడారు.

తన లాస్ట్ ఇన్నింగ్స్‌లో కూడా స్టోక్స్ రెండు సిక్సర్లు కొట్టి, పాత స్టైల్‌లోనే దూకుడుగా ఆడి ఔటయ్యారు. ఆ తర్వాత న్యూజిలాండ్ ప్లేయర్స్, టీమ్‌మేట్స్ స్టోక్స్‌కు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చి గ్రాండ్‌గా సెండ్ ఆఫ్ ఇచ్చారు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
Rugby Premier League: ముంబైని చితక్కొట్టిన హైదరాబాద్ హీరోస్.. గచ్చిబౌలిలో చిరంజీవి, పీవీ సింధు హంగామా
Recommended image2
IND vs IRE: అబ్బా ఏం మ్యాచ్ రా బాబు.. లాస్ట్ బాల్‌కి సిక్స్ కొట్టినా ఓడిపోయిన ఇండియా.. అసలు కారణాలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved