MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IND vs IRE: అబ్బా ఏం మ్యాచ్ రా బాబు.. లాస్ట్ బాల్‌కి సిక్స్ కొట్టినా ఓడిపోయిన ఇండియా.. అసలు కారణాలు ఇవే

IND vs IRE: అబ్బా ఏం మ్యాచ్ రా బాబు.. లాస్ట్ బాల్‌కి సిక్స్ కొట్టినా ఓడిపోయిన ఇండియా.. అసలు కారణాలు ఇవే

India vs Ireland : ఐర్లాండ్ చేతిలో టీమిండియా షాకింగ్ ఓటమిని చవిచూసింది. బెల్ఫాస్ట్‌లో జరిగిన ఉత్కంఠభరితమైన రెండో టీ20లో ఐర్లాండ్ 1 పరుగు తేడాతో భారత్‌పై చరిత్రాత్మక విజయం సాధించి సిరీస్‌ను 2-0తో కైవసం చేసుకుంది. టీమిండియా ఓటమికి కారణాలు గమనిస్తే..

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 29 2026, 08:29 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
సున్నాకే లేచిపోయిన ఓపెనర్లు.. ఐర్లాండ్ బౌలర్ దెబ్బకు వరల్డ్ ఛాంపియన్స్ మైండ్ బ్లాక్
Image Credit : X/BCCI

సున్నాకే లేచిపోయిన ఓపెనర్లు.. ఐర్లాండ్ బౌలర్ దెబ్బకు వరల్డ్ ఛాంపియన్స్ మైండ్ బ్లాక్

బెల్ఫాస్ట్‌లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్‌లో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియాకు ఘోర పరాజయం ఎదురైంది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో ఐర్లాండ్ కేవలం 1 పరుగు తేడాతో భారత్‌పై గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఈ విజయంతో రెండు మ్యాచ్‌ల ఈ టీ20 సిరీస్‌ను ఐర్లాండ్ 2-0తో క్లీన్ స్వీప్ చేసింది. టీమిండియా వరుసగా 16 టీ20 సిరీస్‌ల అజేయ రికార్డుకు ఐరిష్ జట్టు బ్రేక్ వేసింది.

శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో భారత్ ఆడిన మొదటి రెండు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. అనంతరం 155 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ చరిత్రాత్మక మ్యాచ్‌లో భారత జట్టు ఓడిపోవడానికి గల అసలు ఐదు కారణాలు ఇప్పుడు చూద్దాం.

Ireland win the 2️⃣nd T20I by 1 run and clinch the series.

Up next for #TeamIndia is the T20I series against England.

Scorecard ▶️ https://t.co/L8GAMNqUC4#IREvINDpic.twitter.com/lvGbGWPcVv

— BCCI (@BCCI) June 28, 2026

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ఓపెనర్ల ఘోర వైఫల్యం: గోల్డెన్ డక్ అవుట్ అయిన శాంసన్, అభిషేక్
Image Credit : Getty

ఓపెనర్ల ఘోర వైఫల్యం: గోల్డెన్ డక్ అవుట్ అయిన శాంసన్, అభిషేక్

భారత ఇన్నింగ్స్ ఆరంభంలోనే కోలుకోలేని దెబ్బ తగిలింది. ఛేజింగ్ ప్రారంభించిన మొదటి ఓవర్లోనే టీమిండియా ఇద్దరు ఓపెనర్లను కోల్పోయింది. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఇద్దరూ ఐర్లాండ్ బౌలర్ జై ముండ్రా వేసిన మొదటి ఓవర్లోనే గోల్డెన్ డక్‌ గా అవుట్ అయ్యారు. ఈ షాక్ నుంచి టీమిండియా చివరి వరకు కోలుకోలేకపోయింది. పవర్‌ప్లేలోనే కీలక వికెట్లు కోల్పోవడంతో రన్ రేట్ పూర్తిగా పడిపోయింది.

Related Articles

Related image1
Rugby Premier League: ముంబైని చితక్కొట్టిన హైదరాబాద్ హీరోస్.. గచ్చిబౌలిలో చిరంజీవి, పీవీ సింధు హంగామా
Related image2
ATM PIN : ఏటీఎం పిన్ 4 అంకెలే ఎందుకు ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన స్టోరీ ఇదే
36
ఇషాన్ కిషన్ రనౌట్: మ్యాచ్‌ను మలుపు తిప్పిన అడైర్ డైరెక్ట్ హిట్
Image Credit : X/cricketireland

ఇషాన్ కిషన్ రనౌట్: మ్యాచ్‌ను మలుపు తిప్పిన అడైర్ డైరెక్ట్ హిట్

టాప్ ఆర్డర్ కూలిపోయిన సమయంలో ఇషాన్ కిషన్ క్రీజులోకి వచ్చి ఇన్నింగ్స్ నిలబెట్టే ప్రయత్నం చేశాడు. కానీ దురదృష్టవశాత్తూ రోస్ అడైర్ విసిరిన డైరెక్ట్ హిట్‌కు ఇషాన్ కిషన్ రనౌట్ అయ్యాడు. ఇషాన్ కిషన్ వికెట్ పడటంతో భారత్ తీవ్ర ఒత్తిడిలో పడిపోయింది. ఆ తర్వాత వచ్చిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ను కూడా జై ముండ్రా క్లీన్ బౌల్డ్ చేయడంతో భారత్ పూర్తిగా డిఫెన్స్‌లో పడింది.

46
పిచ్‌ను అంచనా వేయడంలో విఫలం: జిడ్డుగా సాగిన బ్యాటింగ్
Image Credit : X/BCCI

పిచ్‌ను అంచనా వేయడంలో విఫలం: జిడ్డుగా సాగిన బ్యాటింగ్

మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ స్వయంగా ఒప్పుకున్నట్లుగా, బెల్ఫాస్ట్ పిచ్ ఎలా స్పందిస్తుందో అంచనా వేయడంలో భారత బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు. సింగిల్స్‌ను డబుల్స్‌గా మార్చడంలో వెనుకబడ్డారు. తిలక్ వర్మ ఒక ఎండ్‌లో ఒంటరి పోరాటం చేస్తూ 46 బంతుల్లో 55 పరుగులు చేసినప్పటికీ, అది భారత్‌కు అత్యంత నెమ్మదైన హాఫ్ సెంచరీగా నమోదైంది. పిచ్ స్లోగా ఉండటంతో భారత బ్యాటర్లు బౌండరీలు కొట్టడానికి బాగా ఇబ్బంది పడ్డారు. భారత్ తన ఇన్నింగ్స్‌లో మొదటి సిక్సర్‌ కొట్టడానికి ఏకంగా 17.1 ఓవర్లు పట్టిందంటే బ్యాటింగ్ ఎంత జిడ్డుగా సాగిందో అర్థం చేసుకోవచ్చు.

56
జై ముండ్రా మ్యాజిక్ స్పెల్, హోలార్డ్ బౌలింగ్ దెబ్బ
Image Credit : X/cricketireland

జై ముండ్రా మ్యాజిక్ స్పెల్, హోలార్డ్ బౌలింగ్ దెబ్బ

ఐర్లాండ్ బౌలర్ జై ముండ్రా అద్భుతమైన స్పెల్‌తో భారత బ్యాటింగ్ వెన్నెముక విరిచాడు. అతను 4 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టాడు. అతని అద్భుత ప్రదర్శనకు గాను 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డులు దక్కాయి. మరోవైపు మాథ్యూ హోలార్డ్ కూడా 4 ఓవర్లలో 26 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు.

ముఖ్యంగా హాఫ్ సెంచరీ చేసి మ్యాచ్ గెలిపించేలా కనిపించిన తిలక్ వర్మను 18వ ఓవర్లో అవుట్ చేసి ఐర్లాండ్‌కు విజయాన్ని ఖాయం చేశాడు. అలాగే అక్షర్ పటేల్, శివం దూబే లను కీలక సమయాల్లో అవుట్ చేసి ఐరిష్ బౌలర్లు మ్యాచ్‌ను తమ వైపు తిప్పుకున్నారు.

66
చివరి ఓవర్ డ్రామా.. చేజారిన హర్షిత్ రాణా పోరాటం
Image Credit : X/BCCI

చివరి ఓవర్ డ్రామా.. చేజారిన హర్షిత్ రాణా పోరాటం

చివరి 2 ఓవర్లలో భారత్ విజయానికి 35 పరుగులు అవసరమయ్యాయి. 19వ ఓవర్లో హర్షిత్ రాణా ఒక సిక్స్, ఒక ఫోర్ కొట్టి ఆశలు రేకెత్తించాడు. చివరి ఓవర్లో 20 పరుగులు కావాల్సి ఉండగా హ్యారీ టెక్టర్ బౌలింగ్‌కు వచ్చాడు. హర్షిత్ రాణా ఫోర్, నో బాల్‌తో మ్యాచ్‌ను ఉత్కంఠగా మార్చాడు. చివరి 3 బంతుల్లో 10 పరుగులు కావాల్సిన దశలో, హ్యారీ టెక్టర్ వేసిన ఫుల్ టాస్ బాల్‌ను లాంగ్ ఆన్ మీదుగా కొట్టబోయి హర్షిత్ రాణా (21 పరుగులు) క్యాచ్ అవుట్ అయ్యాడు. చివరి బంతికి ప్రిన్స్ యాదవ్ సిక్స్ కొట్టినప్పటికీ, భారత్ ఒక పరుగు తేడాతో ఓడిపోవాల్సి వచ్చింది.

After the final ball! 💚#BackingGreen | #IREvIND | #failtesolarpic.twitter.com/sVS0FTOBpD

— Cricket Ireland (@cricketireland) June 28, 2026

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
సెమీఫైన‌ల్‌లోకి దూసుకెళ్లిన ఆస్ట్రేలియా.. భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు ఓట‌మికి కార‌ణం ఏంటో తెలుసా.?
Recommended image2
India vs Ireland: హిస్టరీ కోసం ఐర్లాండ్.. కంబ్యాక్ కోసం శ్రేయాస్ సేన! పరువు నిలుస్తుందా?
Recommended image3
IND vs IRE : ఐర్లాండ్ ల్యాండ్ షేకింగ్ విక్టరీ.. ఈ పసికూన చేతిలో టీమిండియా ఓటమికి టాప్ 5 రీజన్స్ ఇవే
Related Stories
Recommended image1
Rugby Premier League: ముంబైని చితక్కొట్టిన హైదరాబాద్ హీరోస్.. గచ్చిబౌలిలో చిరంజీవి, పీవీ సింధు హంగామా
Recommended image2
ATM PIN : ఏటీఎం పిన్ 4 అంకెలే ఎందుకు ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న ఆసక్తికరమైన స్టోరీ ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved