MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • Cricket
  • Virat Kohli : విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఫిక్స్? టీమిండియాలో కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు?

Virat Kohli : విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ఫిక్స్? టీమిండియాలో కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు?

Virat Kohli : 2027 వన్డే ప్రపంచకప్ తర్వాత విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పే అవకాశముంది. మరి కోహ్లీ స్థానంలో వన్డేల్లో భారత్ తరపున మూడో స్థానంలో బ్యాటింగ్ చేసే సత్తా ఉన్న ఆటగాడు ఎవరు?

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 30 2026, 04:26 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కోహ్లీ ప్లేస్‌కు ఎసరు పెట్టిన తెలుగు కుర్రాడు.. 2027 తర్వాత ఇతనే కింగ్!
Image Credit : AFP

కోహ్లీ ప్లేస్‌కు ఎసరు పెట్టిన తెలుగు కుర్రాడు.. 2027 తర్వాత ఇతనే కింగ్!

విరాట్ కోహ్లీ.. ప్రపంచ క్రికెట్‌లో ఈ పేరు ఒక బ్రాండ్. ముఖ్యంగా వన్డే ఫార్మాట్‌లో నంబర్ 3 స్థానంలో కోహ్లీ సృష్టించిన రికార్డులు అసామాన్యం. అయితే, వయసు రీత్యా 2027 వన్డే వరల్డ్ కప్ తర్వాత కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

ఒకవేళ కోహ్లీ తప్పుకుంటే, ఆ కీలకమైన మూడో స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారు? భారత క్రికెట్ భవిష్యత్తు కోసం ఆ సమాధానం ఇప్పుడు దొరికినట్లే కనిపిస్తోంది. ప్రస్తుతం టీమ్ ఇండియా వన్డే జట్టులో శ్రేయాస్ అయ్యర్ నంబర్ 4లో, కేఎల్ రాహుల్ నంబర్ 5లో, హార్దిక్ పాండ్యా నంబర్ 6లో స్థిరపడ్డారు. ఇప్పుడు అందరి దృష్టి కోహ్లీ వారసుడిపైనే ఉంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
నంబర్ 3 రేసులో తిలక్ వర్మ
Image Credit : Getty

నంబర్ 3 రేసులో తిలక్ వర్మ

భారత వన్డే జట్టులో మూడో స్థానానికి అత్యంత బలమైన పోటీదారుగా యువ సంచలనం తిలక్ వర్మ కనిపిస్తున్నాడు. సునామీ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టే సత్తా తిలక్ సొంతం. క్రీజులోకి వస్తే చాలు, బంతిని బాదడమే లక్ష్యంగా పెట్టుకునే ఈ యంగ్ ప్లేయర్, వన్డే ఫార్మాట్‌లో టీమ్ ఇండియాకు బెస్ట్ నంబర్ 3 ఆప్షన్ అని విశ్లేషకులు భావిస్తున్నారు. బౌలర్ ఎవరైనా సరే, కనికరం లేకుండా షాట్లు ఆడటం తిలక్ వర్మ ప్రత్యేకత. బ్యాట్‌ను తల్వార్‌లా తిప్పుతూ పరుగుల వరద పారించగల టాలెంట్ తిలక్ వర్మలో పుష్కలంగా ఉంది.

Related Articles

Related image1
MI vs SRH: ర్యాన్ రికెల్టన్ విశ్వరూపం.. ముంబై ఇండియన్స్ హిస్టరీలో ఫాస్టెస్ట్ సెంచరీతో రికార్డుల వేట !
Related image2
Vaibhav vs Manu : వైభవ్ సూర్యవంశీ సంచలనం.. ఒలింపిక్ స్టార్ మను భాకర్ ఏమన్నారో తెలుసా?
34
తిలక్ వర్మ రికార్డులు ఇవే
Image Credit : Tilak Varma\Twitter

తిలక్ వర్మ రికార్డులు ఇవే

కేవలం హిట్టింగ్ మాత్రమే కాదు, తిలక్ వర్మ వద్ద అద్భుతమైన టెక్నిక్ కూడా ఉంది. ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడంలోనూ, స్పిన్నర్లను సమర్థంగా ఆడటంలోనూ తిలక్ దిట్ట. వన్డేల్లో మూడో స్థానంలో వచ్చే బ్యాటర్‌కు ఉండాల్సిన ఓపిక, టెక్నిక్ ఇతనిలో ఉన్నాయి. గణాంకాల విషయానికి వస్తే, టీమ్ ఇండియా తరపున 49 టీ20 మ్యాచ్‌ల్లో 44.81 సగటుతో 1389 పరుగులు చేశాడు. ఇందులో 2 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. వన్డేల విషయానికి వస్తే, 5 మ్యాచ్‌ల్లో ఒక అర్ధసెంచరీతో 68 పరుగులు చేశాడు. టీ20ల్లో చూపిస్తున్న జోరును వన్డేల్లోనూ కొనసాగిస్తే పరుగుల కొండను నిర్మించడం తిలక్ వర్మకు పెద్ద కష్టం కాదు.

44
టీమిండియా భవిష్యత్తు ఆశాకిరణం
Image Credit : X/BCCI

టీమిండియా భవిష్యత్తు ఆశాకిరణం

తిలక్ వర్మ తన ఆఖరి వన్డే మ్యాచ్‌ను 2025, డిసెంబర్ 6న సౌత్ ఆఫ్రికాపై ఆడాడు. టీ20ల్లో తన సత్తా చాటుతున్న తిలక్ వర్మను వన్డే జట్టుకు ఎక్కువ కాలం దూరం పెట్టడం సెలక్టర్లకు కష్టమే. నిలకడగా రాణిస్తూ, మ్యాచ్‌ను మలుపు తిప్పే సామర్థ్యం ఉన్న ఇతడు కోహ్లీ వారసుడిగా సరిగ్గా సరిపోతాడని అభిమానులు నమ్ముతున్నారు. 2027 వరల్డ్ కప్ తర్వాత టీమ్ ఇండియా మిడిల్ ఆర్డర్ బాధ్యతలను భుజాన వేసుకోగలిగే సత్తా తిలక్ వర్మకు ఉంది. మరి బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Recommended image2
Shafali Verma: 22 ఏళ్లకే హిస్టరీ క్రియేట్ చేసిన షఫాలీ వర్మ.. పాక్ మ్యాచ్‌లో దెబ్బకు రికార్డులన్నీ బద్దలు
Recommended image3
Sree Charani: పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న తెలుగమ్మాయి.. శ్రీచరణి దెబ్బకు రికార్డులు బద్దలు
Related Stories
Recommended image1
MI vs SRH: ర్యాన్ రికెల్టన్ విశ్వరూపం.. ముంబై ఇండియన్స్ హిస్టరీలో ఫాస్టెస్ట్ సెంచరీతో రికార్డుల వేట !
Recommended image2
Vaibhav vs Manu : వైభవ్ సూర్యవంశీ సంచలనం.. ఒలింపిక్ స్టార్ మను భాకర్ ఏమన్నారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved