MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • MI vs SRH: ర్యాన్ రికెల్టన్ విశ్వరూపం.. ముంబై ఇండియన్స్ హిస్టరీలో ఫాస్టెస్ట్ సెంచరీతో రికార్డుల వేట !

MI vs SRH: ర్యాన్ రికెల్టన్ విశ్వరూపం.. ముంబై ఇండియన్స్ హిస్టరీలో ఫాస్టెస్ట్ సెంచరీతో రికార్డుల వేట !

MI vs SRH : ఐపీఎల్ 2026లో ఎస్‌ఆర్‌హెచ్‌పై ముంబై ఇండియన్స్ బ్యాటర్ ర్యాన్ రికెల్టన్ సెంచరీతో దుమ్మురేపాడు. కేవలం 44 బంతుల్లోనే మెరుపు సెంచరీ బాది, జయసూర్య, తిలక్ వర్మ రికార్డులను బద్దలు కొట్టాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 29 2026, 11:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ర్యాన్ రికెల్టన్ ఊచకోత.. 44 బంతుల్లోనే సెంచరీతో ముంబై ఇండియన్స్ సరికొత్త రికార్డు
Image Credit : X/MICapeTown

ర్యాన్ రికెల్టన్ ఊచకోత.. 44 బంతుల్లోనే సెంచరీతో ముంబై ఇండియన్స్ సరికొత్త రికార్డు

ముంబైలోని వంఖేడే స్టేడియం బుధవారం రాత్రి ఒక అద్భుతమైన ఇన్నింగ్స్‌తో దద్దరిల్లింది. ఐపీఎల్ 2026లో భాగంగా సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓపెనర్ ర్యాన్ రికెల్టన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 44 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్న రికెల్టన్, ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీ సాధించిన ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ క్రమంలో ఆయన ఎన్నో ఏళ్ల నాటి రికార్డులను బద్దలుకొట్టాడు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred
25
రికార్డుల వేటలో ర్యాన్ రికెల్టన్
Image Credit : ANI

రికార్డుల వేటలో ర్యాన్ రికెల్టన్

ఈ మ్యాచ్‌కు ముందు ముంబై ఇండియన్స్ తరఫున అత్యంత వేగవంతమైన సెంచరీ రికార్డు సనత్ జయసూర్య (2008), తిలక్ వర్మ (2026) పేరిట ఉండేది. వీరిద్దరూ 45 బంతుల్లో సెంచరీ మార్కును అందుకున్నారు. అయితే, రికెల్టన్ కేవలం 44 బంతుల్లోనే ఈ ఘనత సాధించి వారిని అధిగమించాడు. రికెల్టన్ ఇన్నింగ్స్ మొత్తం 55 బంతుల్లో 123 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇది ముంబై ఇండియన్స్ చరిత్రలో ఒక బ్యాటర్ సాధించిన అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. గతంలో జయసూర్య చేసిన 114 పరుగుల రికార్డును ఆయన బద్దలు కొట్టాడు.

Related Articles

Related image1
CSK: 36 బంతుల్లోనే సెంచరీ.. ధోనీ టీమ్‌లోకి ముంబై బాహుబలి.. ఎవరీ ఆయుష్ వర్తక్?
Related image2
Vaibhav vs Manu : వైభవ్ సూర్యవంశీ సంచలనం.. ఒలింపిక్ స్టార్ మను భాకర్ ఏమన్నారో తెలుసా?
35
ముంబై ఇండియన్స్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీలు ఇవే
Image Credit : ANI

ముంబై ఇండియన్స్ తరఫున ఫాస్టెస్ట్ సెంచరీలు ఇవే

  1. ర్యాన్ రికెల్టన్ 44 బంతుల్లో సెంచరీ vs ఎస్‌ఆర్‌హెచ్ (2026)
  2. తిలక్ వర్మ 45 బంతుల్లో సెంచరీ vs జీటీ (2026)
  3. సనత్ జయసూర్య 45 బంతుల్లో సెంచరీ vs సీఎస్కే (2008)
  4. కెమెరూన్ గ్రీన్ 47 బంతుల్లో సెంచరీ vs ఎస్‌ఆర్‌హెచ్ (2023)
  5. సూర్యకుమార్ యాదవ్ 49 బంతుల్లో సెంచరీ vs జీటీ (2023)
45
ఫోర్లు, సిక్సర్ల వర్షం
Image Credit : ANI

ఫోర్లు, సిక్సర్ల వర్షం

క్వింటన్ డికాక్ గాయం కారణంగా అతని ప్లేస్ లో జట్టులోకి వచ్చిన ర్యాన్ రికెల్టన్, తనకు వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. ఓపెనర్‌గా బరిలోకి దిగి, విల్ జాక్స్‌తో కలిసి మొదటి వికెట్‌కు కేవలం 7 ఓవర్లలోనే 93 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఒకవైపు వికెట్లు పడుతున్నా, రికెల్టన్ ఏమాత్రం తగ్గలేదు. తన ఇన్నింగ్స్‌లో మొత్తం 10 ఫోర్లు, 8 భారీ సిక్సర్లు బాదాడు. సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ తరహాలో తన హెల్మెట్‌ను బ్యాట్ పైన ఉంచి గాల్లోకి లేపుతూ సంబరాలు చేసుకున్నాడు.

55
చివరలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా మెరుపులు
Image Credit : ANI

చివరలో కెప్టెన్ హార్దిక్ పాండ్యా మెరుపులు

నమన్ ధీర్ 22 పరుగులు చేసి అవుట్ అయిన తర్వాత క్రీజులోకి వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా తన విమర్శకులకు సమాధానం ఇచ్చాడు. రికెల్టన్ కాస్త అలసిపోయినట్లు కనిపించిన సమయంలో, పాండ్యా బాధ్యత తీసుకుని 15 బంతుల్లోనే 31 పరుగులు చేశాడు. దీంతో రన్‌రేట్ తగ్గకుండా ముంబై భారీ స్కోరు వైపు దూసుకెళ్లింది. పాండ్యా అవుట్ అయిన తర్వాత రికెల్టన్ మళ్ళీ విజృంభించి ఇన్నింగ్స్ ముగిసే సరికి స్కోరును 243 పరుగులకు చేర్చాడు. ఇది వంఖేడే స్టేడియంలో నమోదైన అత్యధిక ఐపీఎల్ స్కోరు కావడం గమనార్హం.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Hardik Pandya: ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ పాయే.. ఇప్పుడు టీమిండియా నుంచి ఔట్? హార్దిక్ పాండ్యాకు బిగ్ షాక్
Recommended image2
IPL 2026: ముంబైకి కేకేఆర్ షాక్.. ప్లేఆఫ్స్ రేసులోకి కోల్‌కతా.. ఆ ఫోర్త్ బెర్త్ ఎవరిదో?
Recommended image3
Kohli Mental Health : ఇంపోస్టర్ సిండ్రోమ్ తో బాధపడుతున్న విరాట్ కోహ్లీ .. లక్షణాలేంటో తెలుసా..?
Related Stories
Recommended image1
CSK: 36 బంతుల్లోనే సెంచరీ.. ధోనీ టీమ్‌లోకి ముంబై బాహుబలి.. ఎవరీ ఆయుష్ వర్తక్?
Recommended image2
Vaibhav vs Manu : వైభవ్ సూర్యవంశీ సంచలనం.. ఒలింపిక్ స్టార్ మను భాకర్ ఏమన్నారో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved