MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • Cricket
  • T20 World Cup 2026: పాకిస్తాన్‌తో భారత్ తొలి ఫైట్.. ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ ఇదే

T20 World Cup 2026: పాకిస్తాన్‌తో భారత్ తొలి ఫైట్.. ఐసీసీ ఉమెన్స్ T20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ ఇదే

India vs Pakistan : ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 పూర్తి షెడ్యూల్ వచ్చేసింది. ఈ మెగా టోర్నీలో భారత జట్టు తన తొలి మ్యాచ్ లో దాయాది పాకిస్తాన్‌తో తలపడనుంది. ఈ టోర్నీ పూర్తి షెడ్యూల్ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

4 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 12 2026, 11:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
పాకిస్తాన్‌తోనే ఫస్ట్ ఫైట్.. ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ పూర్తి షెడ్యూల్ చూశారా?
Image Credit : Getty

పాకిస్తాన్‌తోనే ఫస్ట్ ఫైట్.. ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ పూర్తి షెడ్యూల్ చూశారా?

ఐసీసీ ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 షెడ్యూల్ అధికారికంగా విడుదలైంది. క్రికెట్ లవర్స్ కు పూనకాలు తెప్పించేలా ఈ మెగా టోర్నీ సాగనుంది. ముఖ్యంగా ఇండియా, పాకిస్తాన్ జట్ల మధ్య జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్‌తోనే భారత్ తన ప్రయాణాన్ని స్టార్ట్ చేయబోతోంది. 

ఇటీవల 50 ఓవర్ల వన్డే వరల్డ్ కప్‌ను గెలుచుకుని ఫుల్ జోష్‌లో ఉన్న హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమిండియా, ఇప్పుడు పొట్టి ఫార్మాట్‌లోనూ హిస్టరీ క్రియేట్ చేయాలని చూస్తోంది. ఇప్పటివరకు భారత మహిళల జట్టు ఐదుసార్లు సెమీఫైనల్‌కు చేరినప్పటికీ, ఒక్కసారి కూడా టీ20 వరల్డ్ కప్ ట్రోఫీని ముద్దాడలేదు. దాంతో ఈసారి ఎలాగైనా కప్ కొట్టి తీరాలనే కసి మీద మన అమ్మాయిలు ఉన్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
ICC Womens T20 World Cup 2026 : రెండు గ్రూపులు.. 12 జట్లు
Image Credit : Getty

ICC Womens T20 World Cup 2026 : రెండు గ్రూపులు.. 12 జట్లు

ఈ మెగా టోర్నమెంట్‌లో మొత్తం 12 టీమ్స్ తలపడుతున్నాయి. వీటిని రెండు గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూప్‌లో ఆరు జట్లు ఉంటాయి. గ్రూప్ స్టేజ్‌లో ప్రతి టీమ్ మిగతా ఐదు జట్లతో ఐదు మ్యాచ్‌లు ఆడుతుంది. ఆ తర్వాత రెండు గ్రూపుల నుండి టాప్-2 లో నిలిచిన జట్లు సెమీఫైనల్‌కు క్వాలిఫై అవుతాయి. టీమిండియా విషయానికొస్తే.. భారత్ గ్రూప్ 1 లో ఉంది. ఈ గ్రూప్‌లోనే బలమైన ఆస్ట్రేలియాతో పాటు పాకిస్తాన్, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్, నెదర్లాండ్స్ జట్లు ఉన్నాయి.

Related Articles

Related image1
FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ షురూ.. స్టేడియంలో షకీరా ఊరమాస్ డాన్స్.. సౌతాఫ్రికాను చితక్కొట్టిన మెక్సికో
Related image2
IRCTC Jyotirlinga Tour 2026: ఒకే ఒక్క ట్రిప్.. 3 ధామాలు, 11 జ్యోతిర్లింగాల దర్శనం! ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ
36
భారత్ ఆడే గ్రూప్ మ్యాచ్‌ల వివరాలు ఇవే
Image Credit : X/BCCIWomen

భారత్ ఆడే గ్రూప్ మ్యాచ్‌ల వివరాలు ఇవే

టీమిండియా తన తొలి మ్యాచ్‌లోనే చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో తలపడనుంది. జూన్ 14న బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ లో ఈ ఫైట్ జరగనుంది. ఆ తర్వాత జూన్ 17న లీడ్స్‌లోని హెడింగ్లీ మైదానంలో నెదర్లాండ్స్‌తో భారత్ రెండో మ్యాచ్ ఆడుతుంది. ఇక జూన్ 21న మాంచెస్టర్‌లోని ఓల్డ్ ట్రాఫోర్డ్‌లో సౌతాఫ్రికాతో మూడో మ్యాచ్ ఉంటుంది. జూన్ 25న అదే ఓల్డ్ ట్రాఫోర్డ్ లో బంగ్లాదేశ్‌తో తలపడి, జూన్ 28న లండన్‌లోని చరిత్రాత్మక లార్డ్స్ మైదానంలో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో గ్రూప్ స్టేజ్ చివరి మ్యాచ్ ఆడుతుంది.

46
ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 పూర్తి షెడ్యూల్
Image Credit : X/BCCIWomen

ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ 2026 పూర్తి షెడ్యూల్

ఈ టోర్నమెంట్ జూన్ 12న ఇంగ్లాండ్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్‌తో బర్మింగ్‌హామ్‌లో గ్రాండ్‌గా స్టార్ట్ అవుతుంది. జూలై 5న లండన్‌లోని లార్డ్స్ గ్రౌండ్‌లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. పూర్తి మ్యాచ్‌ల లిస్ట్ ఇలా ఉంది..

• జూన్ 12, మ్యాచ్ 1 – ఇంగ్లాండ్ vs శ్రీలంక, బర్మింగ్‌హామ్ (రాత్రి 11:00 గంటలకు)

• జూన్ 13, మ్యాచ్ 2 – స్కాట్లాండ్ vs ఐర్లాండ్, మాంచెస్టర్ (మధ్యాహ్నం 3:00 గంటలకు)

• జూన్ 13, మ్యాచ్ 3 – ఆస్ట్రేలియా vs సౌతాఫ్రికా, మాంచెస్టర్ (రాత్రి 7:00 గంటలకు)

• జూన్ 13, మ్యాచ్ 4 – వెస్టిండీస్ vs న్యూజిలాండ్, సౌతాంప్టన్ (రాత్రి 11:00 గంటలకు)

• జూన్ 14, మ్యాచ్ 5 – బంగ్లాదేశ్ vs నెదర్లాండ్స్, బర్మింగ్‌హామ్ (మధ్యాహ్నం 3:00 గంటలకు)

• జూన్ 14, మ్యాచ్ 6 – ఇండియా vs పాకిస్తాన్, బర్మింగ్‌హామ్ (రాత్రి 7:00 గంటలకు)

• జూన్ 16, మ్యాచ్ 7 – న్యూజిలాండ్ vs శ్రీలంక, సౌతాంప్టన్ (రాత్రి 7:00 గంటలకు)

• జూన్ 16, మ్యాచ్ 8 – ఇంగ్లాండ్ vs ఐర్లాండ్, సౌతాంప్టన్ (రాత్రి 11:00 గంటలకు)

• జూన్ 17, మ్యాచ్ 9 – ఆస్ట్రేలియా vs బంగ్లాదేశ్, లీడ్స్ (మధ్యాహ్నం 3:00 గంటలకు)

• జూన్ 17, మ్యాచ్ 10 – ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్, లీడ్స్ (రాత్రి 7:00 గంటలకు)

• జూన్ 17, మ్యాచ్ 11 – సౌతాఫ్రికా vs పాకిస్తాన్, బర్మింగ్‌హామ్ (రాత్రి 11:00 గంటలకు)

• జూన్ 18, మ్యాచ్ 12 – వెస్టిండీస్ vs స్కాట్లాండ్, లీడ్స్ (రాత్రి 11:00 గంటలకు)

• జూన్ 19, మ్యాచ్ 13 – న్యూజిలాండ్ vs ఐర్లాండ్, సౌతాంప్టన్ (రాత్రి 11:00 గంటలకు)

• జూన్ 20, మ్యాచ్ 14 – ఆస్ట్రేలియా vs నెదర్లాండ్స్, సౌతాంప్టన్ (మధ్యాహ్నం 3:00 గంటలకు)

• జూన్ 20, మ్యాచ్ 15 – పాకిస్తాన్ vs బంగ్లాదేశ్, సౌతాంప్టన్ (రాత్రి 7:00 గంటలకు)

• జూన్ 20, మ్యాచ్ 16 – ఇంగ్లాండ్ vs స్కాట్లాండ్, లీడ్స్ (రాత్రి 11:00 గంటలకు)

• జూన్ 21, మ్యాచ్ 17 – వెస్టిండీస్ vs శ్రీలంక, బ్రిస్టల్ (మధ్యాహ్నం 3:00 గంటలకు)

• జూన్ 21, మ్యాచ్ 18 – సౌతాఫ్రికా vs ఇండియా, మాంచెస్టర్ (రాత్రి 7:00 గంటలకు)

• జూన్ 23, మ్యాచ్ 19 – న్యూజిలాండ్ vs స్కాట్లాండ్, బ్రిస్టల్ (మధ్యాహ్నం 3:00 గంటలకు)

• జూన్ 23, మ్యాచ్ 20 – శ్రీలంక vs ఐర్లాండ్, ... బ్రిస్టల్ (రాత్రి 7:00 గంటలకు)

• జూన్ 23, మ్యాచ్ 21 – ఆస్ట్రేలియా vs పాకిస్తాన్, లీడ్స్ (రాత్రి 11:00 గంటలకు)

• జూన్ 24, మ్యాచ్ 22 – ఇంగ్లాండ్ vs వెస్టిండీస్, లండన్ లార్డ్స్ (రాత్రి 11:00 గంటలకు)

• జూన్ 25, మ్యాచ్ 23 – ఇండియా vs బంగ్లాదేశ్, మాంచెస్టర్ (రాత్రి 7:00 గంటలకు)

• జూన్ 25, మ్యాచ్ 24 – సౌతాఫ్రికా vs నెదర్లాండ్స్, బ్రిస్టల్ (రాత్రి 11:00 గంటలకు)

• జూన్ 26,... మ్యాచ్ 25 – శ్రీలంక vs స్కాట్లాండ్, మాంచెస్టర్ (రాత్రి 11:00 గంటలకు)

• జూన్ 27, మ్యాచ్ 26 – పాకిస్తాన్ vs నెదర్లాండ్స్, బ్రిస్టల్ (మధ్యాహ్నం 3:00 గంటలకు)

• జూన్ 27, మ్యాచ్ 27 – వెస్టిండీస్ vs ఐర్లాండ్, బ్రిస్టల్ (రాత్రి 7:00 గంటలకు)

• జూన్ 27, మ్యాచ్ 28 – ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్, లండన్ ఓవల్ (రాత్రి 11:00 గంటలకు)

• జూన్ 28, మ్యాచ్ 29 – సౌతాఫ్రికా vs బంగ్లాదేశ్, లండన్ లార్డ్స్ (మధ్యాహ్నం 3:00 గంటలకు)

• జూన్ 28, మ్యాచ్ 30 – ఆస్ట్రేలియా vs ఇండియా, లండన్ లార్డ్స్ (రాత్రి 7:00 గంటలకు)

• జూన్ 30, సెమీఫైనల్ 1 – లండన్ ఓవల్ (రాత్రి 7:00 గంటలకు)

• జూలై 02, సెమీఫైనల్ 2 – లండన్ ఓవల్ (రాత్రి 11:00 గంటలకు)

• జూలై 05, ఫైనల్ – లండన్ లార్డ్స్ గ్రౌండ్

56
ICC Womens T20 World Cup 2026 లైవ్ బ్రాడ్‌కాస్ట్, స్ట్రీమింగ్ ఎక్కడంటే?
Image Credit : X/BCCIWomen

ICC Womens T20 World Cup 2026 లైవ్ బ్రాడ్‌కాస్ట్, స్ట్రీమింగ్ ఎక్కడంటే?

ఈ వరల్డ్ కప్ మ్యాచ్‌లను భారత్‌లోని క్రికెట్ లవర్స్ టీవీలో స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ఛానల్స్‌లో లైవ్‌గా చూడొచ్చు. స్టార్ స్పోర్ట్స్ 1, స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ 2, స్టార్ స్పోర్ట్స్ 2 హెచ్‌డీ, స్టార్ స్పోర్ట్స్ 3, స్టార్ స్పోర్ట్స్ 3 హెచ్‌డీ ఛానల్స్‌లో మ్యాచ్‌లు ప్రసారం అవుతాయి. ఒకవేళ మొబైల్‌లో లేదా ఓటీటీలో చూడాలనుకుంటే జియో హాట్‌స్టార్ యాప్ అండ్ వెబ్‌సైట్‌లో డిజిటల్ లైవ్ స్ట్రీమింగ్ అందుబాటులో ఉంటుంది.

66
కప్ కొట్టడమే టార్గెట్
Image Credit : X/BCCIWomen

కప్ కొట్టడమే టార్గెట్

భారత మహిళల జట్టు చాలా కాలంగా ఐసీసీ టీ20 ట్రోఫీ కోసం వెయిట్ చేస్తోంది. సెమీఫైనల్స్ వరకు అద్భుతంగా ఆడుతున్నా, ఫైనల్ మెట్టు దగ్గర తడబడుతోంది. అయితే, రీసెంట్ 50 ఓవర్ల వరల్డ్ కప్ విక్టరీ ఇచ్చిన బూస్ట్‌తో ఈసారి టీమిండియాపై అంచనాలు భారీగా ఉన్నాయి. టీమ్‌లో సీనియర్ల ఎక్స్‌పీరియన్స్, యంగ్ ప్లేయర్స్ ఎనర్జీ సూపర్బ్‌గా మిక్స్ అయ్యాయి. పాకిస్తాన్‌తో జరిగే మొదటి మ్యాచ్ భారత్ టోర్నీలో ఎలా ముందుకు వెళ్తుందో డిసైడ్ చేస్తుంది. అలాగే ఆస్ట్రేలియాతో జరిగే లాస్ట్ గ్రూప్ మ్యాచ్ సెమీస్ బెర్తును ఖరారు చేయడంలో కీ రోల్ ప్లే చేయనుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఐసీసీ టీ20 ప్రపంచ కప్
మహిళల క్రికెట్

Latest Videos
Recommended Stories
Recommended image1
Duleep Trophy: దులీప్ ట్రోఫీలో రచ్చ.. వైభవ్ సూర్యవంశీ వైపు కొట్టేలా వెళ్లిన తిలక్ వర్మ.. ఏం జరిగిందంటే?
Recommended image2
Shafali Verma: 22 ఏళ్లకే హిస్టరీ క్రియేట్ చేసిన షఫాలీ వర్మ.. పాక్ మ్యాచ్‌లో దెబ్బకు రికార్డులన్నీ బద్దలు
Recommended image3
Sree Charani: పాకిస్థాన్‌ను చెడుగుడు ఆడుకున్న తెలుగమ్మాయి.. శ్రీచరణి దెబ్బకు రికార్డులు బద్దలు
Related Stories
Recommended image1
FIFA World Cup 2026: ఫిఫా వరల్డ్ కప్ షురూ.. స్టేడియంలో షకీరా ఊరమాస్ డాన్స్.. సౌతాఫ్రికాను చితక్కొట్టిన మెక్సికో
Recommended image2
IRCTC Jyotirlinga Tour 2026: ఒకే ఒక్క ట్రిప్.. 3 ధామాలు, 11 జ్యోతిర్లింగాల దర్శనం! ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved