MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IND vs AFG: తొలి వన్డేకు టీమిండియా ప్లేయింగ్ XI రెడీ.. గిల్ స్కెచ్‌తో ఆ స్టార్ ప్లేయర్‌కు నో ఛాన్స్!

IND vs AFG: తొలి వన్డేకు టీమిండియా ప్లేయింగ్ XI రెడీ.. గిల్ స్కెచ్‌తో ఆ స్టార్ ప్లేయర్‌కు నో ఛాన్స్!

India vs Afghanistan : భారత్ వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ తొలి వన్డేకు టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ రెడీ అయింది. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా దూరం కావడంతో కెప్టెన్ శుభ్‌మన్ గిల్ జట్టులో కీలక మార్పులు చేయనున్నారు. ఆ వివరాలు గమనిస్తే..

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 11 2026, 04:28 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
విరాట్, హార్దిక్ అవుట్.. ఆఫ్ఘన్‌తో ఫస్ట్ వన్డే ఆడే భారత తుది జట్టు ఇదే
Image Credit : Getty

విరాట్, హార్దిక్ అవుట్.. ఆఫ్ఘన్‌తో ఫస్ట్ వన్డే ఆడే భారత తుది జట్టు ఇదే

భారత్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య జరగబోయే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఫైట్‌కు టైమ్ దగ్గరపడింది. శనివారం (జూన్ 13) నుంచి ఈ సిరీస్ స్టార్ట్ కానుంది. ధర్మశాలలోని హెచ్‌పీసీఏ (HPCA) స్టేడియంలో తొలి వన్డే మ్యాచ్ జరగబోతోంది. ఈ మ్యాచ్ కోసం టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మైండ్ బ్లోయింగ్ ప్లాన్స్‌తో రెడీ అవుతున్నాడు. అయితే తొలి వన్డే కోసం భారత ప్లేయింగ్ ఎలెవన్‌ను ఎంపిక చేసే విషయంలో గిల్ కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోక తప్పట్లేదు. కొందరు స్టార్ ఆటగాళ్లను పక్కన పెట్టేసి, తుది జట్టులో భారీ మార్పులు చేయబోతున్నట్లు సమాచారం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
ఓపెనింగ్ జోడీ వీళ్లే.. జైస్వాల్‌కు నో ఛాన్స్
Image Credit : ANI

ఓపెనింగ్ జోడీ వీళ్లే.. జైస్వాల్‌కు నో ఛాన్స్

ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగే మొదటి వన్డేలో కెప్టెన్ శుభ్‌మన్ గిల్, సీనియర్ ఓపెనర్ రోహిత్ శర్మ ఇన్నింగ్స్‌ను స్టార్ట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రోహిత్ శర్మ నాలుగో స్థానంలో ఉన్నాడు. అయితే ఈ వన్డే సిరీస్ కోసం లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ కూడా జట్టులో ఉన్నాడు. కానీ ధర్మశాల స్టేడియంలో జరిగే ఫస్ట్ మ్యాచ్‌లో గిల్, రోహిత్ ఓపెనింగ్ చేయడం పక్కా కావడంతో, యశస్వి జైస్వాల్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కడం కష్టమే. అతను బెంచ్‌కే పరిమితం కావలసి వస్తుంది.

Related Articles

Related image1
FIFA World Cup 2026: మెస్సీ కంటే డేంజర్.. రోనాల్డో కంటే స్పీడ్ ! గ్రౌండ్ లో మ్యాజిక్ చేసే టాప్ 10 ఫుట్‌బాల్ సూపర్ స్టార్స్ వీరే !
Related image2
IRCTC Jyotirlinga Tour 2026: ఒకే ఒక్క ట్రిప్.. 3 ధామాలు, 11 జ్యోతిర్లింగాల దర్శనం! ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ
37
కోహ్లీ ప్లేస్‌లో ఇషాన్ కిషన్ రీఎంట్రీ
Image Credit : Getty

కోహ్లీ ప్లేస్‌లో ఇషాన్ కిషన్ రీఎంట్రీ

ఐసీసీ వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో రెండో స్థానంలో ఉన్న రన్ మెషిన్ విరాట్ కోహ్లీ ఈ ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్‌కు అందుబాటులో లేడు. దీంతో విరాట్ కోహ్లీ ప్లేస్‌లో నంబర్ 3 పొజిషన్‌లో ఇషాన్ కిషన్‌ను బరిలోకి దించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పాట్నాకు చెందిన లెఫ్ట్ హ్యాండ్ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్, డొమెస్టిక్ క్రికెట్‌లో జార్ఖండ్ తరఫున ఆడుతున్నాడు. ఇషాన్ కిషన్ తన చివరి వన్డే మ్యాచ్‌ను 2023 అక్టోబర్ 11న ఢిల్లీలో ఇదే ఆఫ్ఘనిస్తాన్‌పై వరల్డ్ కప్ 2023 మ్యాచ్‌ లో ఆడాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడే అతనికి వన్డే జట్టులో అవకాశం రాబోతోంది.

47
నంబర్ 3 రేసులో ఇషాన్ కిషన్‌కే ఫస్ట్ ప్రయారిటీ
Image Credit : X@BCCI

నంబర్ 3 రేసులో ఇషాన్ కిషన్‌కే ఫస్ట్ ప్రయారిటీ

మూడో స్థానంలో బ్యాటింగ్ చేయడానికి మిగతా ప్లేయర్ల కంటే ఇషాన్ కిషన్‌కే కెప్టెన్ గిల్ మొదటి ప్రాధాన్యం ఇచ్చేలా ఉన్నాడు. ఎందుకంటే రీసెంట్‌గా టీమిండియాతో పాటు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తరఫున ఆడినప్పుడు కూడా ఇషాన్ కిషన్ ఇదే బ్యాటింగ్ పొజిషన్‌లో సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చి అదరగొట్టాడు. ఇక టీమిండియా వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ నాలుగో నంబర్‌లో, వికెట్ కీపర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఐదో నంబర్‌లో బ్యాటింగ్ చేయనున్నారు.

57
హార్దిక్ పాండ్యా అవుట్.. నితీశ్ రెడ్డికి లక్కీ ఛాన్స్!
Image Credit : X/BCCI

హార్దిక్ పాండ్యా అవుట్.. నితీశ్ రెడ్డికి లక్కీ ఛాన్స్!

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఈ సిరీస్‌కు దూరం కావడం పెద్ద మైనస్. సమాచారం ప్రకారం, వన్డే సిరీస్‌కు ముందే హార్దిక్ పాండ్యా గాయపడ్డాడు. దాంతో అతను ఈ కంప్లీట్ సిరీస్ నుంచే రూల్ అవుట్ అయ్యాడు. హార్దిక్ పాండ్యా లేకపోవడంతో, ఆరో నంబర్‌లో తెలుగు కుర్రాడు నితీశ్ కుమార్ రెడ్డికి ప్లేయింగ్ ఎలెవన్‌లో ఛాన్స్ దక్కే అవకాశం ఉంది. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా వాషింగ్టన్ సుందర్ వన్డే జట్టులో ఉన్నాడు. కుల్దీప్ యాదవ్‌తో కలిసి అతను స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నాడు. కుల్దీప్ యాదవ్ ఇప్పటివరకు 120 వన్డేల్లో 194 వికెట్లు పడగొట్టి సూపర్ ఫామ్‌లో ఉన్నాడు.

67
పేస్ బౌలింగ్ అటాక్.. యువ బౌలర్ వన్డే డెబ్యూ
Image Credit : ANI

పేస్ బౌలింగ్ అటాక్.. యువ బౌలర్ వన్డే డెబ్యూ

ప్రస్తుతం జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ అందుబాటులో లేరు. దాంతో ఈ ఆఫ్ఘనిస్తాన్ వన్డే సిరీస్‌లో భారత పేస్ బౌలింగ్ విభాగాన్ని అర్ష్‌దీప్ సింగ్ ముందుండి నడిపించనున్నాడు. తుది జట్టులో అర్ష్‌దీప్‌ సింగ్‌కు తోడుగా ప్రసిద్ధ్ కృష్ణ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే ఈ ఫస్ట్ మ్యాచ్‌లో ప్రిన్స్ యాదవ్ లేదా గుర్నూర్ బ్రార్‌లలో ఎవరికి వన్డే డెబ్యూ చేసే లక్కీ ఛాన్స్ దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత ఫామ్, ఎక్స్‌పీరియన్స్ చూస్తే మాత్రం ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తరఫున ఆడే ఢిల్లీ బౌలర్ ప్రిన్స్ యాదవ్‌కే జూన్ 13న తన ఫస్ట్ వన్డే క్యాప్ దక్కేలా ఉంది.

77
ఆఫ్ఘనిస్తాన్‌తో తొలి వన్డే ఆడే భారత అంచనా ప్లేయింగ్ XI
Image Credit : X/BCC

ఆఫ్ఘనిస్తాన్‌తో తొలి వన్డే ఆడే భారత అంచనా ప్లేయింగ్ XI

రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్ (వైస్ కెప్టెన్), కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, ప్రిన్స్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Richa Ghosh: రిచా ఘోష్‌ను అక్కడ ఆడిస్తే ప్రత్యర్థులకు చుక్కలే.. టీమిండియాకు వరల్డ్ కప్ పక్కా !
Recommended image2
T20 World Cup : విండీస్ పై సూపర్ విక్టరీ.. ఇండియా ఉమెన్స్ టీంను గెలిపించిన టాప్ అంశాలివే
Recommended image3
IND vs AFG Test Match : టీమిండియా దెబ్బకు అప్ఘాన్ ఆగమాగం.. గిల్ సేన గెలుపు వెనకున్న టాప్ 5 రీజన్స్ ఇవే
Related Stories
Recommended image1
FIFA World Cup 2026: మెస్సీ కంటే డేంజర్.. రోనాల్డో కంటే స్పీడ్ ! గ్రౌండ్ లో మ్యాజిక్ చేసే టాప్ 10 ఫుట్‌బాల్ సూపర్ స్టార్స్ వీరే !
Recommended image2
IRCTC Jyotirlinga Tour 2026: ఒకే ఒక్క ట్రిప్.. 3 ధామాలు, 11 జ్యోతిర్లింగాల దర్శనం! ఐఆర్‌సీటీసీ అదిరిపోయే టూర్ ప్యాకేజీ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved