- Home
- Sports
- Cricket
- Rohit Sharma Net Worth: రూ.50 కోచింగ్ ఫీజ్ నుండి వందల కోట్ల సామ్రాజ్యం వరకు.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ రేంజ్ ఇదీ
Rohit Sharma Net Worth: రూ.50 కోచింగ్ ఫీజ్ నుండి వందల కోట్ల సామ్రాజ్యం వరకు.. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ రేంజ్ ఇదీ
Rohit Sharma Net Worth: టీమిండియా స్టార్ రోహిత్ శర్మ రూ. 50 కోచింగ్ ఫీజు నుంచి నేడు వందల కోట్ల సామ్రాజ్యం నిర్మించుకున్నాడు. వర్లీలోని రూ.30 కోట్ల ఇల్లు, కోట్లాది రూపాయల లగ్జరీ కార్లు, ఇన్వెస్ట్‌మెంట్లు.. మరి రోహిత్ శర్మ నెట్ వర్త్ ఎంతో తెలుసా?

రోహిత్ శర్మ లగ్జరీ లైఫ్ చూస్తే మైండ్ బ్లాకే
క్రికెట్ కోచింగ్ కోసం కేవలం 50 రూపాయలు కట్టడానికి కూడా ఒకప్పుడు నానా అవస్థలు పడ్డ ఒక సాధారణ కుర్రాడు.. ఈరోజు టీమిండియా కెప్టెన్‌గా దేశంలోనే అత్యంత సంపన్న క్రికెటర్లలో ఒకరిగా ఎదిగాడు. అతనే హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ. ప్రస్తుతం రోహిత్ శర్మ మొత్తం నెట్ వర్త్ సుమారు రూ.214 కోట్లుగా అంచనా.
ముంబైలో సముద్రం వైపు ఫేసింగ్ ఉండే అదిరిపోయే ఇల్లు, ఎన్నో ఇన్వెస్ట్‌మెంట్ ప్రాపర్టీలు, లగ్జరీ కార్లతో నిండిన గ్యారేజ్, టాప్ బ్రాండ్ల ఎండార్స్‌మెంట్లతో రోహిత్ శర్మ లైఫ్ సూపర్ లగ్జరీగా సాగుతోంది. ఇంత సంపద ఉన్నా కూడా రోహిత్ లైఫ్ స్టైల్ చాలా సింపుల్‌గా, కంఫర్ట్‌గా ఉంటుంది. బీసీసీఐ కాంట్రాక్ట్, ఐపీఎల్ ఆదాయం, బిజినెస్ వెంచర్లు, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్‌మెంట్ల ద్వారా రోహిత్ ఈ స్థాయికి చేరుకున్నాడు.
కోహ్లీ ఇంటి పక్కనే రోహిత్ శర్మ ఇల్లు.. వర్లీలో రూ.30 కోట్ల లగ్జరీ ఇల్లు
ముంబైలోని అత్యంత ప్రతిష్ఠాత్మకమైన వర్లీ ప్రాంతంలో ఉన్న ఐకానిక్ ‘అహుజా టవర్స్’ 29వ అంతస్తులో రోహిత్ శర్మ నివసిస్తున్నాడు. ఈ 4-బీహెచ్‌కే అపార్ట్‌మెంట్ విలువ దాదాపు రూ.30 కోట్లు. దాదాపు 6,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉండే ఈ ఇంటి నుండి అరబిక్ సముద్రం 270 డిగ్రీల వ్యూతో అద్భుతంగా కనిపిస్తుంది. రోహిత్, అతని భార్య రితికా సజ్దే ఈ ఇంటిని చాలా అందంగా, ప్రశాంతమైన వాతావరణం ఉట్టిపడేలా డిజైన్ చేసుకున్నారు.
రోహిత్ ఇంట్లో ప్రైవేట్ స్టడీ రూమ్, ఎంటర్‌టైన్‌మెంట్ ఏరియా, లైబ్రరీ, వాక్ ఇన్ వార్డ్‌రోబ్, హోమ్ ఆఫీస్, ఒక పెద్ద బాల్కనీ ఉన్నాయి. న్యూయార్క్‌కు చెందిన విల్సన్ అసోసియేట్స్, సింగపూర్‌కు చెందిన పామర్ అండ్ టర్నర్ కలిసి ఈ అహుజా టవర్స్‌ను డిజైన్ చేశారు. ఈ భవనానికి 2011 ఆసియా పసిఫిక్ అవార్డ్స్‌లో బెస్ట్ హై రైజ్ ఆర్కిటెక్చర్ కేటగిరీలో ఫైవ్ స్టార్ అవార్డు కూడా వచ్చింది. ఇందులో మినీ థియేటర్, స్పా, స్విమ్మింగ్ పూల్, జాకుజీ, స్కై కేఫ్ వంటి వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్ ఉన్నాయి.
హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నెట్ వర్త్, కార్ కలెక్షన్
2026 నాటికి రోహిత్ శర్మ నికర ఆస్తుల విలువ సుమారు రూ.214 కోట్లు. కొన్ని పబ్లిక్ అంచనాల ప్రకారం అతని వార్షిక ఆదాయం దాదాపు 24 మిలియన్ డాలర్లు. అంటే భారత కరెన్సీలో సుమారు రూ.180 కోట్లు గా ఉంది. రోహిత్‌కు కార్లంటే చాలా ఇష్టం. అతని గ్యారేజీలో రూ.4.18 కోట్ల విలువైన లంబోర్గిని ఉరుస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.
ఈ లగ్జరీ కార్ నంబర్ ప్లేట్ ‘0264’. వన్డే క్రికెట్ హిస్టరీలో రోహిత్ చేసిన అత్యధిక స్కోరు 264 రన్స్‌కు గుర్తుగా ఈ నంబర్ తీసుకున్నాడు. దీంతో పాటు మెర్సిడెస్-బెంజ్ ఎస్-క్లాస్ 350డి, మెర్సిడెస్ జిఎల్ఎస్ 400డి, బీఎండబ్ల్యూ ఎమ్5, రేంజ్ రోవర్ హెచ్ఎస్ఈ ఎల్‌డబ్ల్యూబీ వంటి ఖరీదైన కార్లు అతని వద్ద ఉన్నాయి. అలాగే రోహిత్ చేతికి రూ.41 లక్షలకు పైగా విలువైన రోలెక్స్ డే-డేట్ వాచ్ కూడా మెరుస్తూ ఉంటుంది.
రితికాతో లవ్ స్టోరీ.. ముంబైలో కోట్లాది రూపాయల ఆస్తులు
రోహిత్ శర్మ, రితికా సజ్దే పెళ్లికి ముందు మంచి స్నేహితులు. రితికా స్పోర్ట్స్ ఈవెంట్ మేనేజర్‌గా పనిచేసేది. ఆ తర్వాత వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. రోహిత్ తన క్రికెట్ జర్నీని ప్రారంభించిన బోరివలి స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లోనే రితికాకు ప్రపోజ్ చేయడం విశేషం. ఇక ప్రాపర్టీస్ విషయానికి వస్తే, వర్లీ ఇల్లే కాకుండా లోయర్ పరేల్‌లోని ‘లోధా మార్క్వైస్, ది పార్క్’లో తన తండ్రి గురునాథ్ శర్మతో కలిసి రోహిత్ ఉమ్మడిగా రెండు అపార్ట్‌మెంట్లను కొనుగోలు చేశాడు.
2013లో వీటిని రూ.5.46 కోట్లు, రూ.5.70 కోట్లకు కొని రెంట్లు ఇచ్చారు. వీటి ద్వారా నెలకు రూ.2.6 లక్షలు, రూ.2.65 లక్షల వరకు అద్దె వస్తుంది. అలాగే డిసెంబర్ 2025లో రితికా సజ్దే ముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలో రూ.26.30 కోట్లతో ఒక లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను కొనుగోలు చేసింది. 2,760 చదరపు అడుగుల ఈ ఫ్లాట్ కోసం రూ.1.31 కోట్లకు పైగా స్టాంప్ డ్యూటీ చెల్లించారు. రోహిత్ ఉండే వర్లీ ప్రాంతంలోనే విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ, యువరాజ్ సింగ్, అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్ వంటి సెలబ్రిటీలు కూడా నివసిస్తున్నారు.
ఇతర ఆదాయ వనరులు, రోహిత్ సేవా కార్యక్రమాలు
క్రికెట్ ద్వారానే కాకుండా రోహిత్ శర్మ ‘క్రిక్‌కింగ్‌డమ్’ (CricKingdom) అనే క్రికెట్ అకాడమీ ద్వారా యువ క్రికెటర్లకు కోచింగ్ ఇస్తున్నాడు. ఈ అకాడమీ కంబోడియా క్రికెట్ అసోసియేషన్‌తో కూడా చేతులు కలిపింది. ఇంత సంపద, పేరు ఉన్నా రోహిత్ శర్మ జంతు సంరక్షణ కోసం చురుగ్గా పనిచేస్తుంటాడు. అతను పెటా (PETA) సంస్థతో కలిసి పనిచేశాడు.
అలాగే డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఇండియా (WWF India)కు రైనో అంబాసిడర్‌గా కూడా సేవలు అందిస్తున్నాడు. ఒకప్పుడు రూ.50 ల కోసం ఇబ్బంది పడిన స్థాయి నుండి, నేడు రూ.214 కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన రోహిత్ శర్మ జర్నీ ఎందరికో స్ఫూర్తిదాయకం.

