MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Sports
  • Cricket
  • IND vs ENG: హిట్ మ్యాన్ రిటైర్మెంట్ రూమర్స్ నిజమేనా? లార్డ్స్ పోరుకు టీమిండియాలో 2 మార్పులు !

IND vs ENG: హిట్ మ్యాన్ రిటైర్మెంట్ రూమర్స్ నిజమేనా? లార్డ్స్ పోరుకు టీమిండియాలో 2 మార్పులు !

IND vs ENG: భారత్ వర్సెస్ ఇంగ్లాండ్ లార్డ్స్ వన్డే హైప్ నడుస్తోంది. రోహిత్ శర్మ రిటైర్మెంట్ రూమర్స్ మధ్య టీమ్ ఇండియాలో రెండు కీలక మార్పులు జరగనున్నాయి. నిజంగానే రోహిత్ గుడ్ బై చెప్పనున్నాడా?

3 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 19 2026, 08:16 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
లార్డ్స్ లో ఫైనల్ ఫైట్.. ట్రోఫీ ఎవరిదో?
Image Credit : X/BCCI

లార్డ్స్ లో ఫైనల్ ఫైట్.. ట్రోఫీ ఎవరిదో?

లండన్‌లోని చరిత్రాత్మక లార్డ్స్ లో ఆదివారం భారత్, ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్‌లో ఆఖరి మ్యాచ్ జరగనుంది. 3 మ్యాచ్‌ల ఈ సిరీస్ ప్రస్తుతం 1-1తో ఈక్వల్‌గా ఉంది. దాంతో ఈ మ్యాచ్ డిసైడర్‌గా మారింది. ఫుల్ జోష్, ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీగా కనిపిస్తోంది. ఈ దశాబ్దపు నలుగురు బెస్ట్ బ్యాటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జో రూట్, జోస్ బట్లర్ ఒకేసారి లార్డ్స్ గ్రౌండ్‌లో తలపడనున్నారు. ఈ మ్యాచ్‌లో గెలిచిన టీమ్‌కే సిరీస్ ట్రోఫీ దక్కుతుంది. రెండు జట్లు గెలవడమే టార్గెట్‌గా బరిలోకి దిగుతున్నాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్? రూమర్స్ వెనక అసలు నిజం ఇదే
Image Credit : Getty

రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్? రూమర్స్ వెనక అసలు నిజం ఇదే

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో రోహిత్ శర్మ ఫ్యూచర్, అతని రిటైర్మెంట్ గురించే చర్చ నడుస్తోంది. అభిమానుల మధ్య కూడా పెద్ద వార్ నడిచింది. దీనిపై బీసీసీఐ స్వయంగా స్పందించింది. రోహిత్ రిటైర్మెంట్ గురించి ఎలాంటి చర్చ జరగలేదని క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ఈ రూమర్స్ కాస్త తగ్గాయి. అందరి ఫోకస్ మళ్లీ ఆటపైకి మళ్లింది. అయితే ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత రోహిత్ శర్మ ఎలాంటి డెసిషన్ తీసుకుంటాడనేది మళ్లీ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. మరోసారి రోహిత్ శర్మ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు.

Related Articles

Related image1
Color Changing Birds: ఊసరవెల్లి కంటే స్పీడ్‌గా రంగులు మార్చే పక్షులు.. చూస్తే షాక్ అవుతారు !
Related image2
FIFA World Cup 2026: బాబోయ్ ఏం మ్యాచ్ రా నాయనా ! ఫ్రాన్స్‌ను రౌండప్ చేసి కొట్టిన ఇంగ్లాండ్.. మెస్సీ రికార్డ్ బ్రేక్
36
నలుగురు లెజెండ్స్.. ప్రూవ్ చేసుకోవడానికి ఇదే లాస్ట్ ఛాన్స్
Image Credit : Getty

నలుగురు లెజెండ్స్.. ప్రూవ్ చేసుకోవడానికి ఇదే లాస్ట్ ఛాన్స్

2027 వన్డే వరల్డ్ కప్‌నకు ఇంకా ఏడాది సమయం మాత్రమే ఉంది. ఈ టైమ్‌లో ఈ నలుగురు మోడరన్ లెజెండ్స్ తామెందుకు బెస్ట్ అనేది ప్రూవ్ చేసుకోవడానికి లార్డ్స్ మ్యాచ్ ఒక గ్రేట్ అప్సనల్. జో రూట్ ఈ సిరీస్‌లోనే 99 రన్స్ నాటౌట్ ఇన్నింగ్స్‌తో తన వాల్యూ ఏంటో చూపించాడు. కార్డిఫ్‌లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో వన్డే క్రికెట్‌పై తనకున్న గ్రిప్‌ను చూపించాడు. కెప్టెన్ జోస్ బట్లర్ కూడా తన అగ్రెసివ్ బ్యాటింగ్ ఫామ్‌ను రీసెట్ చేసే హింట్స్ ఇచ్చాడు. ఇక రోహిత్ కూడా దుమ్మురేపాలని అభిమానులు వెయిట్ చేస్తున్నారు.

46
క్రిటిక్స్‌కు రోహిత్ శర్మ ఆన్సర్ ఇస్తాడా?
Image Credit : X/@AbhiMSD_07

క్రిటిక్స్‌కు రోహిత్ శర్మ ఆన్సర్ ఇస్తాడా?

రోహిత్ శర్మకు ఈ మ్యాచ్ కేవలం సిరీస్ డిసైడర్ మాత్రమే కాదు, తన క్రేజ్ కాపాడుకోవడానికి ఒక బిగ్ ఛాన్స్. రీసెంట్ మ్యాచ్‌ల్లో రోహిత్ రన్స్ పెద్దగా రాలేదు. పవర్‌ప్లేలో పాత అగ్రెసివ్ గేమ్ కనిపించడం లేదు. లార్డ్స్ గ్రౌండ్ రోహిత్‌కు మంచి అవకాశం ఇస్తోంది. ఇక్కడ సూపర్ పెర్ఫార్మెన్స్‌తో తనపై వస్తున్న ట్రోల్స్, క్వశ్చన్స్‌కు రోహిత్ బ్యాట్‌తోనే ఆన్సర్ ఇచ్చే ఛాన్స్ ఉంది. క్రిటిక్స్ నోళ్లు నొక్కాలంటే రోహిత్ ఇన్నింగ్స్ ఇక్కడ చాలా ముఖ్యం.

56
లార్డ్స్ పిచ్ రిపోర్ట్.. టీమ్ ఇండియాలో రెండు మార్పులు
Image Credit : Instagram

లార్డ్స్ పిచ్ రిపోర్ట్.. టీమ్ ఇండియాలో రెండు మార్పులు

లార్డ్స్ పిచ్ ఎడ్జ్‌బాస్టన్ లేదా కార్డిఫ్ లాంటిది కాదు. ఇక్కడ మిగతా గ్రౌండ్స్ లాగా ఎక్కువ స్పీడ్, బౌన్స్ ఉండవు. ఇది మన ఇండియన్ స్పిన్నర్లకు, బ్యాటర్లకు ప్లస్ పాయింట్ అవుతుంది. కానీ ఇంగ్లాండ్‌కు ఈ గ్రౌండ్‌లో మంచి రికార్డ్ ఉంది. ఇక్కడ ఆడిన లాస్ట్ 8 వన్డేల్లో 5 మ్యాచ్‌లు ఇంగ్లాండే గెలిచింది.

టీమ్ ఇండియాలో వాషింగ్టన్ సుందర్ హ్యామ్‌స్ట్రింగ్ ఇంజ్యూరీ వల్ల అవుట్ అయ్యాడు. అతని ప్లేస్‌లోకి హర్ష్ దూబే వచ్చాడు. దీంతో సుందర్ ప్లేస్‌లో ఒక ఛేంజ్ పక్కా. అలాగే లాస్ట్ మ్యాచ్‌లో హెల్త్ బాలేకపోవడం వల్ల ఆడని కేఎల్ రాహుల్ ఈ మ్యాచ్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది. అతను ఇషాన్ కిషన్ ప్లేస్‌ను రీప్లేస్ చేయవచ్చు. ఈ రెండు మార్పులతో పాటు కుల్దీప్ యాదవ్‌కు కూడా ప్లేయింగ్-11లో వుండవచ్చు. 2021 నుండి ఇంగ్లాండ్‌పై భారత్‌కు మంచి రికార్డ్ ఉంది. ఆడిన 12 వన్డేల్లో 9 మనమే గెలిచాం. అయితే 2024 తర్వాత భారత్ వరుసగా రెండు ద్వైపాక్షిక వన్డే సిరీస్‌లు గెలవలేదు. మరోవైపు జో రూట్ 2025 నుండి భీభత్సమైన ఫామ్‌లో ఉన్నాడు. 20 మ్యాచ్‌ల్లో 76.87 యావరేజ్‌తో 1230 రన్స్ చేశాడు.

66
రెండు జట్ల అంచనా ప్లేయింగ్-11
Image Credit : Getty

రెండు జట్ల అంచనా ప్లేయింగ్-11

ఇంగ్లాండ్: బెన్ డకెట్, జాకబ్ బెథెల్, జో రూట్, హ్యారీ బ్రూక్ (కెప్టెన్), జోస్ బట్లర్ (వికెట్ కీపర్), సామ్ కరన్, విల్ జాక్స్, గస్ అట్కిన్సన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, సాకిబ్ మహమూద్.

భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, గురనూర్ బ్రార్, జస్‌ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
రోహిత్ శర్మ
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Recommended image2
IND vs SL: ఇండియా చేతిలో ఓడే మ్యాచ్‌ను నిలబెట్టిన దినూష.. కొలంబో టెస్టులో ఏం జరిగిందంటే?
Recommended image3
ICC Rankings: నెం.1 ర్యాంక్ ఖేల్ ఖతం.. బుమ్రాకు ఊహించని షాక్ ఇచ్చిన ఆసీస్ దిగ్గజం
Related Stories
Recommended image1
Color Changing Birds: ఊసరవెల్లి కంటే స్పీడ్‌గా రంగులు మార్చే పక్షులు.. చూస్తే షాక్ అవుతారు !
Recommended image2
FIFA World Cup 2026: బాబోయ్ ఏం మ్యాచ్ రా నాయనా ! ఫ్రాన్స్‌ను రౌండప్ చేసి కొట్టిన ఇంగ్లాండ్.. మెస్సీ రికార్డ్ బ్రేక్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved