MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Telangana
  • Telangana Goa: హైదరాబాద్‌కు దగ్గర్లోనే తెలంగాణ గోవా.. ఈ సీక్రెట్ ఐలాండ్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Telangana Goa: హైదరాబాద్‌కు దగ్గర్లోనే తెలంగాణ గోవా.. ఈ సీక్రెట్ ఐలాండ్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

Telangana Goa: తెలంగాణలో అద్భుతమైన అనుభూతిని పంచే గోవా ఉంది. నాగార్జున సాగర్ బ్యాక్ వాటర్స్‌లో ఉన్న వైజాగ్ కాలనీ మన తెలంగాణకు మినీ గోవా. హైదరాబాద్ నుండి 3 గంటల్లో చేరిపోయే ఈ వీకెండ్ స్పాట్ విశేషాలు మీకోసం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 19 2026, 09:03 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
గోవా వెళ్లక్కర్లేదు బాస్.. మన హైదరాబాద్ పక్కనే మినీ గోవా.. రూ.200లకే ఐలాండ్ టూర్
Image Credit : ChatGPT

గోవా వెళ్లక్కర్లేదు బాస్.. మన హైదరాబాద్ పక్కనే మినీ గోవా.. రూ.200లకే ఐలాండ్ టూర్

తెలంగాణలో కూడా గోవా వుందని మీకు తెలుసా? అందరూ వెళ్లే రొటీన్ టూరిస్ట్ ప్లేసెస్ అయితే విపరీతమైన రష్ ఉంటాయి. అందుకే హైదరాబాద్‌కు చాలా దగ్గర్లోనే, సరికొత్త వైబ్స్ ఇచ్చే ఒక సీక్రెట్ లొకేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అదే నల్గొండ జిల్లాలోని వైజాగ్ కాలనీ. చుట్టూ కొండలు, మధ్యలో ప్రశాంతమైన నీళ్లు, పల్లెటూరి వాతావరణంతో ఈ ప్లేస్ 'తెలంగాణ మినీ గోవా'గా పాపులర్ అవుతోంది. హైదరాబాద్ నుండి కేవలం 3 నుంచి 3.5 గంటల డ్రైవ్‌తో ఇక్కడికి ఈజీగా రీచ్ అయిపోవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బ్యాక్ వాటర్స్ వెనుక ఉన్న ఆసక్తికర చరిత్ర ఇదే
Image Credit : X/Harrshuuuuu

బ్యాక్ వాటర్స్ వెనుక ఉన్న ఆసక్తికర చరిత్ర ఇదే

నల్గొండ జిల్లా చందంపేట మండలంలో ఉన్న ఈ వైజాగ్ కాలనీ.. నాగార్జున సాగర్ డ్యామ్ బ్యాక్ వాటర్స్ ఒడ్డున ఉంటుంది. ఇది కేవలం ఒక టూరిస్ట్ ప్లేస్ మాత్రమే కాదు, దీనికి ఒక సూపర్ హిస్టరీ కూడా ఉంది. దాదాపు 60 నుండి 70 ఏళ్ల క్రితం అంటే 1950ల కాలంలో విశాఖపట్నం ప్రాంతం నుండి 24 కుటుంబాలు నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణ పనుల కోసం ఇక్కడికి వచ్చాయి.

డ్యామ్ వర్క్ పూర్తయిన తర్వాత ఆయా కుటుంబాలు ఇక్కడి వాతావరణానికి ఫిదా అయిపోయి ఇక్కడే సెటిల్ అయిపోయాయి. అలా ఆంధ్రా తీర ప్రాంతానికి గుర్తుగా దీనికి 'వైజాగ్ కాలనీ' అనే పేరు వచ్చింది. ప్రస్తుతం ఈ గ్రామంలో దాదాపు 700 మంది నివసిస్తున్నారు. ఇక్కడి ప్రజలు ఎక్కువగా వ్యవసాయం, చేపలు పట్టడం, టూరిజంపైనే ఆధారపడి బతుకుతున్నారు.

Related Articles

Related image1
White Animals: ఇండియాలో అరుదైన తెల్లటి అడవి జంతువులు కనిపించే 8 అద్భుతమైన ప్రదేశాలు ఇవే !
Related image2
IRCTC Tirupati Tour: ఒక్క క్లిక్‌తో తిరుమల శ్రీవారి దర్శనం.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్ మిస్ కావద్దు !
35
అక్కడ ఎంజాయ్ చేయాల్సిన క్రేజీ ఆక్టివిటీస్ ఇవే
Image Credit : Instagram/vizag_colony

అక్కడ ఎంజాయ్ చేయాల్సిన క్రేజీ ఆక్టివిటీస్ ఇవే

వైజాగ్ కాలనీకి వెళ్తే అసలు బోర్ కొట్టదు. ఇక్కడ చేయడానికి చాలా థ్రిల్లింగ్ ఆక్టివిటీస్ ఉన్నాయి. మొదటగా చెప్పుకోవాల్సింది 'ఎల్లేశ్వర గట్టు' ఐలాండ్ గురించి. వైజాగ్ కాలనీ నుండి కేవలం 20 నిమిషాల బోట్ జర్నీతో ఈ చిన్న ఐలాండ్‌కు చేరుకోవచ్చు. ఒక్కొక్కరికి రూ.200 చొప్పున టికెట్ ఉంటుంది. ఒకవేళ గ్రూప్‌గా వెళ్తే రూ.1500 వరకు బోట్ ఛార్జ్ అవుతుంది.

ఇంకా అడ్వెంచర్ కావాలనుకునే వారు స్థానిక జాలర్ల సహాయంతో కేవలం రూ.1500 బడ్జెట్‌తో ఈ ఐలాండ్‌లో నైట్ క్యాంపింగ్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సాయంత్రం వేళల్లో వాటర్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సన్‌సెట్ వ్యూస్ ఫోటోగ్రాఫర్లకు ఒక విజువల్ ట్రీట్ అని చెప్పాలి. వీటన్నిటితో పాటు ఇక్కడ లోకల్ విలేజ్ లైఫ్‌ను ఎక్స్ పీరియన్స్ చేయొచ్చు.

45
నోరూరించే తాజా చేపల ఫ్రై
Image Credit : Getty

నోరూరించే తాజా చేపల ఫ్రై

వైజాగ్ కాలనీ టూరిజంలో మరో స్పెషల్ హైలైట్ ఏంటంటే.. ఇక్కడి లోకల్ ఫిష్ ఫుడ్ స్టాల్స్. కళ్ల ముందే బ్యాక్ వాటర్స్ నుండి తాజా చేపలను పట్టి, వేడివేడిగా ఫ్రై చేసి ఇస్తారు. నాటు పద్ధతిలో వండే ఈ చేపల కూర, ఫ్రై టేస్ట్ టూరిస్టులను బాగా అట్రాక్ట్ చేస్తోంది. చాలా మంది ఇక్కడి హోమ్‌స్టేలలో స్టే చేస్తూ ఓపెన్ బార్బెక్యూ కూడా ప్లాన్ చేసుకుంటారు. తక్కువ బడ్జెట్‌లో మంచి విలేజ్ ఫుడ్ ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఈ ప్లేస్ ది బెస్ట్ ఆప్షన్.

55
రూట్ మ్యాప్, కొన్ని ముఖ్యమైన ట్రావెల్ టిప్స్
Image Credit : Instagram/mana_vizag_coloney

రూట్ మ్యాప్, కొన్ని ముఖ్యమైన ట్రావెల్ టిప్స్

హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ నుండి వైజాగ్ కాలనీ సుమారు 130 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రయాణికులు ఎన్‌హెచ్ 65 హైవే ద్వారా నార్కట్‌పల్లి మీదుగా చందంపేట మండలానికి చేరుకోవచ్చు. అయితే ఇక్కడికి వెళ్లేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇదొక రిమోట్ విలేజ్ కాబట్టి ఇక్కడ పెద్ద పెద్ద లగ్జరీ హోటళ్లు, రెస్టారెంట్లు ఉండవు. వాష్‌రూమ్ సదుపాయాలు కూడా చాలా లిమిటెడ్‌గా ఉంటాయి. కాబట్టి మీ వెంట తాగునీరు, స్నాక్స్, ఎమర్జెన్సీ మెడిసిన్స్ తీసుకెళ్లడం మంచిది.

అలాగే ఈ ఏరియాలో ఆల్కహాల్ కన్జంప్షన్‌పై పోలీస్ చెకింగ్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుంది. కాబట్టి రూల్స్ బ్రేక్ చేయకుండా సేఫ్‌గా ఎంజాయ్ చేయడం బెటర్. ఒకవేళ మీకు టైమ్ ఉంటే ఈ ట్రిప్‌తో పాటు దగ్గర్లోనే ఉన్న నాగార్జున సాగర్ డ్యామ్ లేదా దేవరకొండ ఫోర్ట్‌ను కూడా విజిట్ చేయొచ్చు. ఉదయం లేదా సాయంత్రం వేళల్లో ఇక్కడికి వెళ్తే ఎండ దెబ్బ లేకుండా ప్రశాంతంగా తిరగొచ్చు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ప్రయాణం
తెలంగాణ
హైదరాబాద్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
మంత్రి పదవి నుంచి తొలగించండి.. కొండా సురేఖ విష‌యంలో షాకింగ్ నిర్ణ‌యం
Recommended image2
Hyderabad: ఇక‌పై హైద‌రాబాద్‌లో రాత్రంతా బ‌స్సులు.. ఏయే రూట్ల‌లో అంటే.?
Recommended image3
అసలేంటీ జీవో 97.. పాలిటెక్నిక్ విద్యార్థులు ఎందుకు వ్య‌తిరేకిస్తున్నారు? దీంతో ఏం జ‌రుగుతుంది?
Related Stories
Recommended image1
White Animals: ఇండియాలో అరుదైన తెల్లటి అడవి జంతువులు కనిపించే 8 అద్భుతమైన ప్రదేశాలు ఇవే !
Recommended image2
IRCTC Tirupati Tour: ఒక్క క్లిక్‌తో తిరుమల శ్రీవారి దర్శనం.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్ మిస్ కావద్దు !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved