MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Post Office RD Scheme
Hey Ram Controversy
Epic Movie Review
Smart Investment Tips
iPhone 18 Pro Max
YS Jaganmohan Reddy
Vastu Tips
Hyderabad Elevated Corridor Project
PM Viksit Bharat Rozgar Yojana
  • Home
  • Sports
  • Cricket
  • Vaibhav Suryavanshi: కల నిజమైంది.. టీమిండియా ‘త్రీ స్టార్’ జెర్సీ అందుకున్న వైభవ్ సూర్యవంశీ

Vaibhav Suryavanshi: కల నిజమైంది.. టీమిండియా ‘త్రీ స్టార్’ జెర్సీ అందుకున్న వైభవ్ సూర్యవంశీ

Vaibhav Suryavanshi: యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ టీమిండియా జెర్సీ అందుకుని ఎమోషనల్ అయ్యారు. కన్నడ రఘు చేతుల మీదుగా సర్ప్రైజ్ బాక్స్ అందుకోగా, దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.

2 Min read
Author : Mahesh Rajamoni
| Updated : Jun 23 2026, 05:18 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు.. టీమిండియా జెర్సీతో వైభవ్ సూర్యవంశీ ఎమోషనల్
Image Credit : BCCI

కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు.. టీమిండియా జెర్సీతో వైభవ్ సూర్యవంశీ ఎమోషనల్

యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ లాంగ్ రన్ డ్రీమ్ ఫైనల్‌గా నెరవేరింది. ఇండియా తరఫున ఆడాలనే అతని సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది. బీసీసీఐ నుంచి వచ్చిన ఒక స్పెషల్ సర్ప్రైజ్ బాక్స్‌తో అతని ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తన 'ప్లేయర్ నంబర్ 532', 'జెర్సీ నంబర్ 3' ఉన్న బ్లూ జెర్సీని అతను అందుకున్నాడు. ఈ ఎమోషనల్ మూమెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
వైభవ్ సూర్యవంశీ కల నిజమైన వేళ
Image Credit : BCCI

వైభవ్ సూర్యవంశీ కల నిజమైన వేళ

చిన్నప్పటి నుంచి చేతిలో బ్యాట్ పట్టి, క్రికెట్ గ్రౌండ్‌లో రాత్రి పగలు కష్టపడిన వైభవ్ సూర్యవంశీ పెద్ద కల ఈరోజు నిజమైంది. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించాలనే అతని జర్నీలో ఇదొక బిగ్గెస్ట్ మైల్‌స్టోన్. జెర్సీని చేతుల్లోకి తీసుకున్నప్పుడు అతని ముఖంలో కనిపించిన ఆనందం, గర్వం మాటల్లో చెప్పలేనివి. క్రికెట్ ప్రపంచంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునేందుకు వైభవ్ పడ్డ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది.

36
మాటలు రాని భావోద్వేగం
Image Credit : BCCI

మాటలు రాని భావోద్వేగం

టీమిండియాకు చెందిన ప్రతిష్ఠాత్మక 'త్రీ స్టార్' బ్లూ జెర్సీని అందుకున్న తర్వాత వైభవ్ తన ఫీలింగ్స్‌ను షేర్ చేసుకున్నాడు. "ఈ ఫీలింగ్‌ను నేను మాటల్లో చెప్పలేను. నా ఎమోషన్స్ ఎక్స్‌ప్రెస్ చేయడానికి నాకు అసలు వర్డ్స్ దొరకడం లేదు" అంటూ చాలా ఎమోషనల్ అయ్యాడు. ఒక సాధారణ ప్లేయర్ నుంచి ఇండియన్ టీమ్ మెంబర్‌గా మారిన ఆ క్షణం అతని జీవితంలో ఎప్పటికీ గుర్తుండిపోతుంది.

46
ప్లేయర్ నంబర్ 532, జెర్సీ నంబర్ 3 తో వైభవ్ సూర్యవంశీ
Image Credit : BCCI

ప్లేయర్ నంబర్ 532, జెర్సీ నంబర్ 3 తో వైభవ్ సూర్యవంశీ

వైభవ్ సూర్యవంశీకి టీమిండియాలో అఫీషియల్‌గా 'ప్లేయర్ నంబర్ 532' పొజిషన్ దక్కింది. ఇక నుంచి అతను గ్రౌండ్‌లో '3' నంబర్ ఉన్న జెర్సీని వేసుకుని దుమ్మురేపనున్నాడు. ఈ జెర్సీ బ్యాక్ సైడ్ అతని పేరు స్పష్టంగా ప్రింట్ చేసి ఉంది. ఈ నంబర్‌తో అతను ఇండియన్ క్రికెట్‌లో కొత్త హిస్టరీ క్రియేట్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

56
హోటల్ రూమ్‌కు సర్ప్రైజ్ బాక్స్
Image Credit : BCCI

హోటల్ రూమ్‌కు సర్ప్రైజ్ బాక్స్

బీసీసీఐ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక ఇంట్రెస్టింగ్ వీడియోలో అసలు ఏం జరిగిందో చూపించారు. బీసీసీఐ లోగో ఉన్న ఒక స్పెషల్ కిట్ బాక్స్‌ను హోటల్ స్టాఫ్ ట్రాలీ ద్వారా వైభవ్ రూమ్‌కు తీసుకొచ్చారు. టీమిండియా స్టాఫ్ మెంబర్, కర్ణాటకలోని ఉత్తర కన్నడ కుమెటా ప్రాంతానికి చెందిన రఘు ఈ జెర్సీ బాక్స్‌ను వైభవ్ రూమ్‌కు స్వయంగా డెలివరీ చేశారు. ఈ బాక్స్ ఓపెన్ చేసేటప్పుడు వైభవ్ ఫేస్‌లో క్యూరియాసిటీ నెక్స్ట్ లెవెల్‌లో ఉంది.

66
నమ్మలేని ఒక అద్భుత అనుభవం
Image Credit : BCCI

నమ్మలేని ఒక అద్భుత అనుభవం

బాక్స్ ఓపెన్ చేసి ఇండియన్ జెర్సీని చేతిలోకి తీసుకోగానే వైభవ్ ముఖంలో ఒక రేంజ్ నవ్వు వచ్చేసింది. "ఈ టీషర్ట్ చూడగానే నా నవ్వు ఆపుకోలేకపోయాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇదంతా ఒక కలలా ఉంది" అని వైభవ్ చెప్పాడు. "కొన్నిసార్లు మనం అస్సలు ఊహించని వండర్స్ మన లైఫ్‌లో జరిగిపోతుంటాయి. అలాంటప్పుడు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాదు. నా పరిస్థితి కూడా ఇప్పుడు అలాగే ఉంది" అంటూ టీమిండియా త్రీ స్టార్ జెర్సీని టచ్ చేస్తూ వైభవ్ ఫుల్ ఖుషీ అయ్యాడు.

Ladies & Gentlemen

The moment the nation has been waiting for has arrived! 

Vaibhav Sooryavanshi in #TeamIndia jersey. Witness this incredibly special moment ❤️ pic.twitter.com/sUUytFMPVw

— BCCI (@BCCI) June 23, 2026

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Team India: దుబాయ్‌లో హైడ్రామా.. పాక్ మంత్రికి చుక్కలు చూపించిన భారత మహిళా క్రికెటర్లు
Recommended image2
Abhishek Sharma: T20ల్లో అభిషేక్ శర్మ సునామీ.. దెబ్బకు రికార్డులు బద్దలు
Recommended image3
Asia Cup 2026 Winner: రివేంజ్ తీర్చేసుకున్నారు.. మహిళల ఆసియా కప్ 2026 విజేతగా భారత్
Related Stories
Recommended image1
Graveyard Dating: స్మశానంలో డేటింగ్ ఏంటి బాబోయ్? యువత కొత్త పిచ్చి.. అసలు విషయం ఇదే !
Recommended image2
Womens T20 WC: టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం చేయాలి? పూర్తి ఈక్వేషన్స్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved