MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Sanju Samson: 226 పరుగుల ఛేజ్ వెనుక అసలు ప్లాన్ ఇదే.. సంజూ శాంసన్ సంచలన కామెంట్స్

Sanju Samson: 226 పరుగుల ఛేజ్ వెనుక అసలు ప్లాన్ ఇదే.. సంజూ శాంసన్ సంచలన కామెంట్స్

Sanju Samson: న్యూజిలాండ్‌పై రికార్డు రన్ ఛేజ్ తో భారత జట్టు అద్భుత విజయం సాధించింది. ఈ గెలుపు తర్వాత సంజూ శాంసన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవర్ ప్లేలోనే మ్యాచ్‌పై పట్టు సాధించాలనే అటాకింగ్ స్ట్రాటజీని బయటపెట్టారు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 23 2026, 07:12 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సంజూ శాంసన్ కామెంట్స్.. టీమిండియా కొత్త అటాకింగ్ ఫార్ములా
Image Credit : Getty

సంజూ శాంసన్ కామెంట్స్.. టీమిండియా కొత్త అటాకింగ్ ఫార్ములా

క్రైస్ట్‌చర్చ్ లో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ చరిత్రాత్మక రన్ ఛేజ్‌తో ఘనవిజయం సాధించింది. ఈ రికార్డు విజయం అనంతరం భారత స్టార్ ఓపెనర్ సంజూ శాంసన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. మైదానంలో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో జట్టును గెలిపించిన సంజూ, మ్యాచ్ తర్వాత మీడియాతో మాట్లాడుతూ టీమిండియా కొత్త మైండ్‌సెట్, మైండ్ గేమ్‌ను స్పష్టం చేశారు. 2024 టీ20 ప్రపంచకప్ విజయం తర్వాత భారత జట్టు అనుసరిస్తున్న అగ్రెసివ్ అప్రోచ్ గురించి ఆయన క్లారిటీ ఇచ్చారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
పవర్ ప్లేలోనే గేమ్‌ను ముగించేస్తాం.. సంజూ శాంసన్
Image Credit : ANI

పవర్ ప్లేలోనే గేమ్‌ను ముగించేస్తాం.. సంజూ శాంసన్

ఛేజింగ్ సమయంలో టార్గెట్ చిన్నదైనా, పెద్దదైనా తమ వ్యూహంలో మార్పు ఉండదని సంజూ వ్యాఖ్యానించారు. "మా ప్రణాళికలు ప్రతి దశకూ వేర్వేరుగా ఉంటాయి. పవర్ ప్లే ఒకలా ఉంటే, మిడిల్ ఓవర్లు, డెత్ ఓవర్ల వ్యూహాలు వేరేలా ఉంటాయి. లక్ష్యం 170 పరుగులైనా సరే, పవర్ ప్లేలో మంచి ఆరంభం లభిస్తే ఆ మొదటి ఆరు ఓవర్లలోనే మ్యాచ్‌పై ప్రత్యర్థికి ఆశలు లేకుండా చేస్తాం. అంటే పవర్ ప్లేలోనే గేమ్‌ను కిల్‌ చేయడమే మా స్టైల్" అని సంజూ స్పష్టం చేశారు. కొన్నిసార్లు ఈ విధానం ఫలించకపోయినా, ఈ అటాకింగ్ మైండ్‌సెట్‌నే కొనసాగిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

35
బిజీ షెడ్యూల్.. ప్లేయర్ల ఫిట్‌నెస్‌పై కీలక వ్యాఖ్యలు
Image Credit : ANI

బిజీ షెడ్యూల్.. ప్లేయర్ల ఫిట్‌నెస్‌పై కీలక వ్యాఖ్యలు

భారత జట్టు బిజీ షెడ్యూల్‌పై వస్తున్న వార్తలపై కూడా సంజూ శాంసన్ స్పందించారు. ఇంగ్లండ్ పర్యటన ముగిసిన వెంటనే మేనేజ్‌మెంట్ ఫిట్‌నెస్‌కు సంబంధించి కఠినమైన ఆదేశాలు ఇచ్చిందని వెల్లడించారు. "వరుస మ్యాచ్‌లు ఆడటం మాకు దొరికిన అదృష్టంగా భావిస్తున్నాం. ఫిట్‌నెస్ రొటీన్‌ను పక్కాగా పాటించడం వల్ల ఫిజికల్‌గా, మెంటల్‌గా మేమంతా చాలా మంచి స్థితిలో ఉన్నాం. బిజినెస్ క్లాస్ ప్రయాణాలు, భారీ హోటళ్లలో వసతి పొందుతున్నాం కాబట్టి షెడ్యూల్ గురించి ఫిర్యాదు చేయాల్సిన పనే లేదు" అని సంజూ వివరించారు.

45
వరల్డ్ కప్ సక్సెస్ ఇచ్చిన కాన్ఫిడెన్స్
Image Credit : X@BCCI

వరల్డ్ కప్ సక్సెస్ ఇచ్చిన కాన్ఫిడెన్స్

వరల్డ్ కప్ నాకౌట్ మ్యాచ్‌లలో ఆడిన ఇన్నింగ్స్‌లు తన ఆత్మవిశ్వాసాన్ని ఎంతగానో పెంచాయని సంజూ తెలిపారు. దేశం కోసం ఆడుతూ మ్యాచ్ విన్నింగ్ నాక్స్ ఆడటం వల్ల మానసికంగా ఎంతో దృఢంగా మారతానని చెప్పారు. ఆ నమ్మకంతోనే క్రీజులోకి వెళ్తున్నట్లు వెల్లడించారు. ఈ మ్యాచ్‌లో సంజూ కేవలం 33 బంతుల్లోనే 8 ఫోర్లు, 4 సిక్సర్లతో 67 పరుగులు చేసి భారత్ రికార్డు ఛేదనకు గట్టి పునాది వేశారు. ఈ ప్రదర్శనతో ఈ ఏడాది 26 ఇన్నింగ్స్‌లలో సంజూ తన 8వ ఫిఫ్టీ ప్లస్ స్కోరును నమోదు చేయడం విశేషం.

55
రికార్డు ఛేదనతో శ్రేయస్, నమన్ మెరుపులు
Image Credit : ANI

రికార్డు ఛేదనతో శ్రేయస్, నమన్ మెరుపులు

న్యూజిలాండ్ ఉంచిన 226 పరుగుల భారీ లక్ష్యాన్ని భారత్ 230/6 స్కోరు చేసి ఛేదించింది. సంజూ వేగవంతమైన ఆరంభం ఇచ్చినప్పటికీ, మిడిల్ ఓవర్లలో కివీస్ స్పిన్నర్లు శాంట్నర్, బ్రేస్‌వెల్ వరుస వికెట్లు తీసి ఇబ్బంది పెట్టారు. అయితే చివరి ఓవర్లలో కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (42), నమన్ ధీర్ (15 బంతుల్లో 42 నాటౌట్) ధనాధన్ బ్యాటింగ్‌తో భారత్‌ను గెలిపించారు. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో టీ20 శనివారం హగ్లీ ఓవల్‌లో జరగనుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్
 
1st T20 • NZ vs IND 2026
Result
NZNZ
225/4
INDIND
230/6
IND beat NZ by 4 wickets
Schedule ›
2nd TEST • SA vs AUS
Result
SASA
425/9
AUSAUS
99 & 295
SA beat AUS by 31 runs
Schedule ›
5th T20 • IND vs WI
abandoned
INDIND
118/5
WIWI
-
Match abandoned
Schedule ›
4th T20 • IND vs WI
Result
INDIND
223
WIWI
247/3
WI beat IND by 24 runs
Schedule ›
3rd T20 • PAK vs SL
Result
PAKPAK
168/8
SLSL
172/2
SL beat PAK by 8 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
NZNZ
Sat, 24 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
NZNZ
Tue, 27 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
3rd TEST • SA vs AUS
SASA
Tue, 27 Oct, 2026
AUSAUS
02:00 pm
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
NZNZ
Fri, 30 Oct, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›
5th T20 • NZ vs IND 2026
NZNZ
Sun, 1 Nov, 2026
INDIND
12:30 pm
Match yet to begin.
Schedule ›

Latest Videos
Recommended Stories
Recommended image1
టీ20ల్లో భారత్ సరికొత్త రికార్డు.. 226 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయం
Recommended image2
Pragyan Ojha : చీఫ్ సెలెక్టర్‌గా ప్రగ్యాన్ ఓజా.. ఈ ఐదుగురు టీమిండియా ప్లేయర్లకు వణుకు మొదలైందిగా!
Recommended image3
Jailer 2: రజినీకాంత్ మూవీ కోసం సంజూ శాంసన్ రచ్చ.. ఏకంగా థియేటర్ మొత్తాన్ని బుక్ చేసి ఏం చేశాడో తెలుసా?
Related Stories
Recommended image1
Gold Price: షాకింగ్ న్యూస్.. రూ.1లక్ష కంటే తక్కువకు పడిపోనున్న బంగారం ధరలు
Recommended image2
Jailer 2: రజినీకాంత్ మూవీ కోసం సంజూ శాంసన్ రచ్చ.. ఏకంగా థియేటర్ మొత్తాన్ని బుక్ చేసి ఏం చేశాడో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved