- Home
- Sports
- Cricket
- Top 10 Test Cricket Spinners: టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-10 స్పిన్నర్లు ఎవరు?
Top 10 Test Cricket Spinners: టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్-10 స్పిన్నర్లు ఎవరు?
Top 10 Test Cricket Spinners: టెస్ట్ క్రికెట్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 10 స్పిన్నర్ల జాబితాలో శ్రీలంక లెజెండరీ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ టాప్ లో ఉన్నారు. ఈ లిస్టులో నలుగురు భారతీయులు కూడా చోటు దక్కించుకున్నారు.
- FB
- TW
- Linkdin
Follow Us

1. ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక) – 800 వికెట్లు
Top 10 Test Cricket Spinners: టెస్ట్ క్రికెట్‌లో అత్యధిక వికెట్లు తీసిన టాప్ 10 స్పిన్నర్లలో భారత ప్లేయర్లు కూడా ఉన్నారు. శ్రీలంకకు చెందిన ముత్తయ్య మురళీధరన్ అత్యధికంగా 800 వికెట్లు తీసి అగ్రస్థానాన్ని ఆక్రమించారు
టెస్ట్ చరిత్రలో 800 వికెట్ల మైలురాయిని అందుకున్న ఏకైక బౌలర్ మురళీధరన్. ఆయన 133 టెస్టుల్లో 22.72 సగటుతో 800 వికెట్లు పడగొట్టారు. ఇప్పటివరకు ఎవరూ ఈ ఘనతను అందుకోలేదు.
2. షేన్ వార్న్ (ఆస్ట్రేలియా) – 708 వికెట్లు
లెగ్ స్పిన్ తో రికార్డుల మోత మోగించిన ఆస్ట్రేలియా లెజెండరీ బౌలర్ షేన్ వార్న్ 145 టెస్టుల్లో 25.4 సగటుతో 708 వికెట్లు పడగొట్టారు. 700 పైచిలుకు వికెట్లు తీసిన రెండో బౌలర్ వార్న్.
3. అనిల్ కుంబ్లే (భారత్) – 619 వికెట్లు
భారతదేశపు టాప్ టెస్ట్ వికెట్ టేకర్ అనిల్ కుంబ్లే. లెగ్ స్పిన్నర్‌గా 132 టెస్టుల్లో 29.65 సగటుతో 619 వికెట్లు పడగొట్టారు. ఈ లిస్టులో మూడో స్థానంలో నిలిచారు.
4. నాథన్ లియాన్ (ఆస్ట్రేలియా) – 553 వికెట్లు
ఆస్ట్రేలియాకు చెందిన నాథన్ లియాన్ ప్రస్తుతం 500 లకు పైగా టెస్ట్ వికెట్లు తీసి ఇంకా ఆడుతున్న ఏకైక స్పిన్నర్. ఇప్పటివరకు 553 వికెట్లు తీసుకున్నాడు. ఇంకా అతను క్రికెట్ లో కొనసాగుతున్నాడు.
5. రవిచంద్రన్ అశ్విన్ (భారత్) – 537 వికెట్లు
టీమిండియా మాజీ స్టార్ రవిచంద్రన్ అశ్విన్ 98 టెస్టుల్లోనే 500 వికెట్లు అందుకుని రికార్డు సృష్టించారు. ప్రస్తుతం 537 వికెట్లతో భారత టెస్ట్ చరిత్రలో రెండవ టాప్ వికెట్ టేకర్‌గా ఉన్నారు. మొత్తంగా ఈ జాబితాలో 5వ స్థానంలో నిలిచారు.
6. రంగన హెరాత్ (శ్రీలంక) – 433 వికెట్లు
ఎడమ చేతి స్పిన్ బౌలింగ్‌లో అత్యుత్తమ రికార్డు కలిగిన రంగన హెరాత్.. 400 పైగా వికెట్లు తీసిన ఏకైక ఎడమచేతి వాటం స్పిన్నర్. మొత్తం 433 వికెట్లు పడగొట్టారు. ఈ లిస్టులో 6వ స్థానంలో నిలిచారు.
7. హర్భజన్ సింగ్ (భారత్) – 417 వికెట్లు
అత్యధిక వికెట్లు తీసిన భారత మూడో టాప్ స్పిన్నర్ హర్భజన్ సింగ్. 103 టెస్టుల్లో 32 సగటుతో 417 వికెట్లు పడగొట్టారు. ఆయన కెరీర్‌లో 25 సార్లు ఐదు వికెట్ల ఘనతలు సాధించారు. అంతర్జాతీయంగా 7వ టాప్ స్పిన్నర్ గా నిలిచారు.
8. డేనియెల్ వెట్టోరీ (న్యూజిలాండ్) – 362 వికెట్లు
న్యూజిలాండ్‌కు చెందిన వెట్టోరీ 113 టెస్టుల్లో 362 వికెట్లు తీసి ఈ లిస్టులో 8వ స్థానంలో ఉన్నాడు. కీవీస్ తరఫునన అత్యధిక వికెట్లు అందించిన స్పిన్నర్‌గా నిలిచారు.
9. రవీంద్ర జడేజా (భారత్) – 324 వికెట్లు
ICC ర్యాంకింగ్స్ ప్రకారం నెం.1 ఆల్‌రౌండర్ గా రవీంద్ర జడేజా ఉన్నారు. అతను ఇప్పటివరకు టెస్టు క్రికెట్ లో 324 వికెట్లను తీసుకున్నారు. ప్రస్తుతం క్రికెట్ లో కొనసాగుతూ అత్యధిక వికెట్లు తీసుకున్న రెండో బౌలర్ ఇతనే.
10. లాన్స్ గిబ్స్ (వెస్టిండీస్) – 309 వికెట్లు
టెస్ట్ చరిత్రలో 300 వికెట్ల మైలురాయిని చేరిన మొదటి స్పిన్నర్ లాన్స్ గిబ్స్. ఈ వెస్టిండీస్ లెజెండ్ 79 టెస్టుల్లో 309 వికెట్లు పడగొట్టారు.
(ఈ వివరాలు జులై మొదటి వారం వరకు అప్డేట్ చేసినవి)