MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Sports
  • Cricket
  • Shubman Gill: సారా ఒక్కరే కాదు.. శుభ్‌మన్ గిల్‌ డేటింగ్ లిస్ట్‌లో బాలీవుడ్ హీరోయిన్లు వీరే

Shubman Gill: సారా ఒక్కరే కాదు.. శుభ్‌మన్ గిల్‌ డేటింగ్ లిస్ట్‌లో బాలీవుడ్ హీరోయిన్లు వీరే

Shubman Gill: టీమిండియా యంగ్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ సారా టెండూల్కర్‌తో పాటు పలువురు బాలీవుడ్ హీరోయిన్లతో డేటింగ్ ను కొనసాగించారని గాసిప్స్ ఉన్నాయి. గిల్‌ డేటింగ్ లిస్ట్‌లోని బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 06 2025, 08:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
17
శుభ్‌మన్ గిల్ క్రికెట్ గ్రౌండ్‌లోనే కాదు గాసిప్స్ వరల్డ్ లో కూడా హాట్ టాపిక్
Image Credit : instagram

శుభ్‌మన్ గిల్ క్రికెట్ గ్రౌండ్‌లోనే కాదు గాసిప్స్ వరల్డ్ లో కూడా హాట్ టాపిక్

భారత క్రికెట్ స్టార్ ప్లేయర్ శభ్‌మన్ గిల్ ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో జరుగుతున్న టెస్టు సిరీస్‌లో అద్భుత ప్రదర్శనతో దుమ్మురేపుతూ హాట్ టాపిక్ గా మారాడు. లీడ్స్‌లో జరిగిన మొదటి టెస్టులో సెంచరీతో ఆకట్టుకున్నాడు. బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా రెండో టెస్ట్ మ్యాచ్‌లో రికార్డుల మోత మోగించే ఇన్నింగ్స్ లు ఆడాడు.

రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో మరో సెంచరీతో అదరగొట్టాడు. తన క్రికెట్ కెరీర్‌లో రికార్డుల మీద రికార్డులు నమోదు చేస్తున్న ఈ 25 ఏళ్ల యంగ్ క్రికెటర్ ఇప్పుడు సోషల్ మీడియా గాసిప్స్‌లోనూ హాట్ టాపిక్ గా మారాడు. ఇప్పుడు మరోసారి గిల్ లవ్ గాసిప్ప్ వైరల్ గా మారాయి. మరి గిల్ డేటింగ్ గాసిప్స్ లిస్టులో ఉన్న బాలీవుడ్ హీరోయిన్లు ఎవరో తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
27
సారా టెండూల్కర్‌తో మొదలైన గిల్ ప్రేమ కథ..
Image Credit : Social Media

సారా టెండూల్కర్‌తో మొదలైన గిల్ ప్రేమ కథ..

క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్‌తో షుభ్‌మన్ గిల్ డేటింగ్ చేస్తున్నారని గత కొన్ని సంవత్సరాలుగా ప్రచారం జరిగింది. సోషల్ మీడియాలో వీరిద్దరి ఫోటోలు వైరల్ అవ్వడంతో ఈ వదంతులు ఊపందుకున్నాయి. అయితే ఇటీవలే గిల్ ఈ విషయంపై స్పందిస్తూ, “నేను సంవత్సరాలుగా ఒంటరిగా ఉన్నాను. దయచేసి ఇలాంటి వదంతులను ఆపండి” అని పేర్కొనడంతో సారాతో డేటింగ్ పుకార్లకు ఎండ్ కార్డ్ పడింది.

Related Articles

Related image1
Shubman Gill: ఎడ్జ్‌బాస్టన్‌లో మరో సెంచరీ.. శుభ్‌మన్ గిల్ సరికొత్త చరిత్ర
Related image2
Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డులను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
37
అవ్‌నీత్ కౌర్‌తో గిల్ డేటింగ్ గాసిప్స్
Image Credit : Shubman Gill, Avneet Kaur/ Instagram

అవ్‌నీత్ కౌర్‌తో గిల్ డేటింగ్ గాసిప్స్

ప్రముఖ నటి అవ్‌నీత్ కౌర్ తో కూడా గిల్ లవ్ లో ఉన్నారనే వార్తలు వినిపించాయి. ఛాంపియన్స్ ట్రోఫీలో దుబాయ్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్ సందర్భంగా వీరిద్దరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో వీరిద్దరి మధ్య సంబంధాలపై ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే, వీరి సంబంధంపై గిల్ కానీ, అవ్‌నీత్ కౌర్ కానీ అధికారికంగా స్పందించలేదు.

47
సారా అలీ ఖాన్ తో కూడా గిల్ డేటింగ్ పుకార్లు
Image Credit : instagram

సారా అలీ ఖాన్ తో కూడా గిల్ డేటింగ్ పుకార్లు

బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ తో కూడా గిల్ లవ్ లో ఉన్నారని ప్రచారం జరిగింది. ముంబైలోని ఓ రెస్టారెంట్‌లో వీరిద్దరూ కలిసి భోజనం చేయడం చూసినట్టు పలువురు పేర్కొనడంతో ఈ చర్చ మొదలైంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. గాసిప్స్ వచ్చినప్పటికీ గిల్ లేదా సారా ఇద్దరూ ఈ విషయంపై ఎలాంటి కామెంట్స్ చేయలేదు.

57
పంజాబీ స్టార్ సోనమ్ బజ్వాతో కూడా గిల్ ప్రేమాయణం
Image Credit : Instagram

పంజాబీ స్టార్ సోనమ్ బజ్వాతో కూడా గిల్ ప్రేమాయణం

పంజాబీ నటి, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ సోనమ్ బజ్వా - గిల్‌ మధ్య సంబంధాలు కూడా వైరల్ అయ్యాయి. వీరి సంబంధంపై చాలానే ఊహాగానాలు వచ్చాయి. ఒక పంజాబీ ఇంటర్వ్యూ షోలో వీరిద్దరూ జోక్‌లతో ప్రేమతో కూడిన సంభాషణలు చేయడంతో నెటిజన్లు వీరి మధ్య ప్రత్యేక బంధం ఉందని భావించారు. కానీ, ఈ ఊహలు కూడా అధికారిక సమాధానాల లేకుండా పుకార్లుగానే మిగిలాయి.

67
మరియా అరోయోగ్-గిల్: సోషల్ మీడియా మిస్టరీ
Image Credit : Social Media

మరియా అరోయోగ్-గిల్: సోషల్ మీడియా మిస్టరీ

ఐపీఎల్‌లో గిల్‌కు మద్దతు తెలిపిన ఓ విదేశీ బ్యూటీ, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ మరియా అరోయోగ్ తో గిల్ డేటింగ్ అనే వార్తలు కూడా వైరల్ అయ్యాయి. గిల్ ఆమెను ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయడం వల్ల వీరిద్దరి మధ్య సంబంధం ఉందని భావించారు. అయితే ఈ జోడీ ఎప్పుడూ బహిరంగంగా కనిపించలేదు. అధికారికంగా వీరి రిలేషన్ పై ఎలాంటి స్పందనలు చేయలేదు.

77
టీవీ నటి రిధిమా పండిట్ తో గిల్ డేటింగ్?
Image Credit : INSTA/ridhimapandit, shubmangill

టీవీ నటి రిధిమా పండిట్ తో గిల్ డేటింగ్?

ఇటీవల టీవీ నటి రితిమా పండిట్ పేరు కూడా గిల్‌తో సంబంధం ఉన్నట్టు ప్రచారం అయ్యింది. వీరిద్దరూ పెళ్లికి సిద్ధమవుతున్నారని సోషల్ మీడియాలో వదంతులు వచ్చాయి. కానీ రితిమా ఈ ఊహాగానాలను తిప్పి కొట్టింది. “నేను గిల్‌ను ఎప్పుడూ కలవలేదు. అతనితో ఎలాంటి వ్యక్తిగత సంబంధం లేదు. పెళ్లి గురించి ఆలోచన కూడా లేదు” అని స్పష్టం చేశారు.

మొత్తంగా శుభ్‌మన్ గిల్ ఆటతీరు ఎంత అద్భుతంగా ఉంటుందో అతని వ్యక్తిగత జీవితం కూడా అంతే ఆసక్తికరంగా ఉంటుంది. సారా టెండూల్కర్, సారా అలీ ఖాన్, అవ్నీత్ కౌర్, సోనమ్ బజ్వా వంటి బాలీవుడ్ ప్రముఖుల పేర్లతో గిల్ సంబంధం వార్తలు వైరల్ అయ్యాయి. అయితే గిల్ మాత్రం ఇప్పటివరకు ఎటువంటి సంబంధాన్ని అధికారికంగా ధృవీకరించలేదు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
శుభ్‌మన్ గిల్
క్రికెట్
క్రీడలు
ఏషియానెట్ న్యూస్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
బాలీవుడ్

Latest Videos
Recommended Stories
Recommended image1
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image2
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image3
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Related Stories
Recommended image1
Shubman Gill: ఎడ్జ్‌బాస్టన్‌లో మరో సెంచరీ.. శుభ్‌మన్ గిల్ సరికొత్త చరిత్ర
Recommended image2
Shubman Gill: విరాట్ కోహ్లీ రికార్డులను బద్దలు కొట్టిన శుభ్‌మన్ గిల్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved