MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
ICC WTC Standings 2026-27
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie Box Office Collections
G Subhash Chandra
Actress Hema Health Update
Tollywood Stylish Heroes
September OTT Releases
Yash Mother vs Allu Aravind
New Rules in Schools
Nepal Flash Flood
  • Home
  • Sports
  • Cricket
  • Travis Head : ₹58 కోట్ల ఆఫర్ వదులుకున్నాడు.. సన్‌రైజర్స్ హీరో ట్రావిస్ హెడ్ నెట్‌వర్త్ ఎంత?

Travis Head : ₹58 కోట్ల ఆఫర్ వదులుకున్నాడు.. సన్‌రైజర్స్ హీరో ట్రావిస్ హెడ్ నెట్‌వర్త్ ఎంత?

Travis Head Net Worth : ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ ట్రావిస్ హెడ్ ఐపీఎల్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతూ దుమ్మురేపుతున్నాడు. అయితే, హెడ్ నెట్ వర్త్ ఎంతో తెలుసా? ట్రావిస్ హెడ్ ఎస్‌ఆర్‌హెచ్ ఐపీఎల్ జీతం, ఆస్తులు, ఆదాయ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 02 2026, 08:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ట్రావిస్ హెడ్ సంపాదనలో హెడ్ పైన ఉన్నాడుగా..
Image Credit : Getty

ట్రావిస్ హెడ్ సంపాదనలో హెడ్ పైన ఉన్నాడుగా..

సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లేయర్, ఆస్ట్రేలియా క్రికెట్ జట్టులో విధ్వంసకర బ్యాటర్‌గా పేరు తెచ్చుకున్న ట్రావిస్ హెడ్, మైదానంలోనే కాకుండా సంపాదనలోనూ దూసుకుపోతున్నాడు. 2026 నాటికి ఆయన నెట్ వర్త్ సుమారు ₹62 కోట్లు (7.2 మిలియన్ డాలర్లు) గా అంచనా. గత కొన్నేళ్లుగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఆయన చూపిన అద్భుత ప్రతిభ, ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో భారత్‌పై ఆడిన ఇన్నింగ్స్‌లు ఆయన బ్రాండ్ విలువను భారీగా పెంచాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
ఐపీఎల్ ద్వారా భారీ ఆదాయం.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జాక్‌పాట్
Image Credit : ANI

ఐపీఎల్ ద్వారా భారీ ఆదాయం.. సన్‌రైజర్స్ హైదరాబాద్ జాక్‌పాట్

ట్రావిస్ హెడ్ సంపాదన పెరగడంలో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కీలక పాత్ర పోషించింది. 2024 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తరఫున ఆడిన ఆయనను, 2025, 2026 సీజన్ల కోసం ఫ్రాంచైజీ రిటైన్ చేసుకుంది. 2024లో ₹6.8 కోట్లు ఉన్న ఆయన వేతనం, 2025 నాటికి ఏకంగా ₹14 కోట్లకు పెరిగింది. అంటే కేవలం రెండేళ్లలో ఆయన ఐపీఎల్ ఆదాయం రెట్టింపు కంటే ఎక్కువయ్యింది. ఆరెంజ్ ఆర్మీలో కీలక ఆటగాడిగా మారిన హెడ్, తన దూకుడైన బ్యాటింగ్‌తో ఈ భారీ మొత్తానికి అర్హుడని నిరూపించుకున్నాడు.

Related Articles

Related image1
సచిన్‌కే సాధ్యం కాని రికార్డు.. ఏకంగా 199 సెంచరీలు, 61 వేల రన్స్ కొట్టిన మొనగాడు ఇతనే !
Related image2
LSG vs DC : పంత్ కు ఝలక్ ఇచ్చిన అక్షర్ పటేల్.. గెలిచే మ్యాచ్ లో లక్నో ఎలా ఓడిపోయింది?
35
ట్రావిస్ హెడ్ జాతీయ కాంట్రాక్ట్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్
Image Credit : insta/jess_head

ట్రావిస్ హెడ్ జాతీయ కాంట్రాక్ట్, బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్

కేవలం ఐపీఎల్ మాత్రమే కాకుండా, క్రికెట్ ఆస్ట్రేలియా నుంచి కూడా హెడ్ భారీగా ఆర్జిస్తున్నాడు. ఆస్ట్రేలియా సెంట్రల్ కాంట్రాక్ట్ ద్వారా ఏడాదికి సుమారు ₹8.5 నుంచి ₹11 కోట్ల వరకు వేతనం పొందుతున్నాడు. దీనికి అదనంగా ఐసీసీ టోర్నమెంట్లు, ద్వైపాక్షిక సిరీస్‌ల ద్వారా మ్యాచ్ ఫీజులు, బోనస్‌ల రూపంలో మరో ₹2 నుంచి ₹4 కోట్లు లభిస్తున్నాయి.

ట్రావిస్ హెడ్ బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల విషయానికి వస్తే.. అడిడాస్, గ్రే-నికోల్స్, కూకబుర్రా వంటి ప్రముఖ కంపెనీలతో ఆయనకు ఒప్పందాలు ఉన్నాయి. ఏప్రిల్ 2026లో ట్రేడిఫై అనే సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందం ద్వారా ఆయన బ్యాట్ వెనుక భాగంలో ఆ బ్రాండ్ లోగో కనిపిస్తుంది. దీని ద్వారా ఏటా ₹7 నుంచి ₹10 కోట్ల ఆదాయం వస్తోంది.

45
ట్రావిస్ హెడ్ విలాసవంతమైన ఆస్తులు.. వ్యాపారాలు
Image Credit : ANI

ట్రావిస్ హెడ్ విలాసవంతమైన ఆస్తులు.. వ్యాపారాలు

ఆదాయం పెరగడంతో ట్రావిస్ హెడ్ తన లైఫ్ స్టైల్ ను కూడా అదే స్థాయిలో మార్చుకున్నాడు. అడిలైడ్‌లో ఆయనకు సుమారు ₹10 కోట్ల విలువైన విలాసవంతమైన భవనం ఉంది. అలాగే మెర్సిడెస్, ఆడి వంటి ప్రీమియం కార్ల కలెక్షన్ హెడ్ వద్ద ఉంది, వీటి విలువ దాదాపు ₹4 నుంచి ₹5 కోట్లు ఉంటుంది. హెడ్ భార్య జెస్సికా హెడ్ కూడా వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. కాన్బెర్రా, సిడ్నీలలో ఆమె పలు రెస్టారెంట్లను నిర్వహిస్తున్నట్లు సమాచారం. వ్యక్తిగత జీవితాన్ని, వృత్తిని సమతూకం చేసుకుంటూ హెడ్ తన ఆస్తులను పెంచుకుంటున్నాడు.

55
₹58 కోట్ల భారీ ఆఫర్‌ను తిరస్కరించిన ట్రావిస్ హెడ్.. ఎందుకంటే?
Image Credit : X/@IPL

₹58 కోట్ల భారీ ఆఫర్‌ను తిరస్కరించిన ట్రావిస్ హెడ్.. ఎందుకంటే?

ట్రావిస్ హెడ్ తన దేశంపై ఉన్న నిబద్ధతను చాటుకుంటూ ఒక సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 2025 చివరిలో ఒక పేరు తెలియని ఐపీఎల్ ఫ్రాంచైజీ, ఆయన అంతర్జాతీయ క్రికెట్‌కు స్వస్తి చెప్పి కేవలం టీ20 లీగ్‌లలో ఆడాలని ప్రతిపాదించింది. దీని కోసం ఏడాదికి ఏకంగా ₹58 కోట్లు ($10 మిలియన్ AUD) ఇస్తామని ఆఫర్ చేసింది. అయితే, ఆస్ట్రేలియా తరఫున ఆడటమే తన ప్రాధాన్యం అని పేర్కొంటూ హెడ్ ఆ భారీ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించాడని రిపోర్టులు పేర్కొన్నాయి.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
హైదరాబాద్

Latest Videos
Recommended Stories
Recommended image1
WTC Final రేసులో టీమిండియాకు బిగ్ షాక్.. టాప్‌లో ఆసీస్, సఫారీలు సంచలనం !
Recommended image2
Javagal Srinath: ఎవరూ గుర్తుపట్టలేదు.. సీటు కూడా ఇవ్వలేదు! బెంగళూరు మెట్రోలో ఇండియన్ పేస్ లెజెండ్ !
Recommended image3
Team India: 14 ఏళ్ల తర్వాత మళ్లీ భారత జట్టులో ద్రావిడ్ - సెహ్వాగ్ కాంబినేషన్
Related Stories
Recommended image1
సచిన్‌కే సాధ్యం కాని రికార్డు.. ఏకంగా 199 సెంచరీలు, 61 వేల రన్స్ కొట్టిన మొనగాడు ఇతనే !
Recommended image2
LSG vs DC : పంత్ కు ఝలక్ ఇచ్చిన అక్షర్ పటేల్.. గెలిచే మ్యాచ్ లో లక్నో ఎలా ఓడిపోయింది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved