MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Sports
  • LSG vs DC : పంత్ కు ఝలక్ ఇచ్చిన అక్షర్ పటేల్.. గెలిచే మ్యాచ్ లో లక్నో ఎలా ఓడిపోయింది?

LSG vs DC : పంత్ కు ఝలక్ ఇచ్చిన అక్షర్ పటేల్.. గెలిచే మ్యాచ్ లో లక్నో ఎలా ఓడిపోయింది?

Delhi Capitals vs Lucknow Super Giants : ఐపీఎల్ 2026లో లక్నోపై ఢిల్లీ క్యాపిటల్స్ 6 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. సమీర్ రిజ్వీ, స్టబ్స్ అద్భుత పోరాటంతో లక్నోకు షాక్ తగిలింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 02 2026, 12:10 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
లక్నో కొంపముంచిన 20 పరుగులు.. సమీర్ రిజ్వీ ఊచకోత
Image Credit : X@IPL

లక్నో కొంపముంచిన 20 పరుగులు.. సమీర్ రిజ్వీ ఊచకోత

రిషిబ్ పంత్ కెప్టెన్సీలోని లక్నో సూపర్ జెయింట్స్ (LSG) తమ సొంత మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్ (DC) చేతిలో ఘోరంగా ఓటమిని చవిచూసింది. ఐపీఎల్ 2026లో భాగంగా జరిగిన ఈ 5వ మ్యాచ్‌లో లక్నో ఉంచిన 141 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఢిల్లీ క్యాపిటల్స్ మరో 17 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. తొలుత లక్నో బౌలర్లు ఢిల్లీని 26 పరుగులకే 4 వికెట్లు తీసి గట్టి దెబ్బ కొట్టినప్పటికీ, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్ అద్భుత పోరాటంతో ఢిల్లీకి విజయాన్ని అందించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
సమీర్ రిజ్వీ - ట్రిస్టన్ స్టబ్స్ వీరోచిత పోరాటం
Image Credit : X@ipl

సమీర్ రిజ్వీ - ట్రిస్టన్ స్టబ్స్ వీరోచిత పోరాటం

26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో ఉన్న ఢిల్లీని ఇంపాక్ట్ ప్లేయర్ సమీర్ రిజ్వీ (70 నాటౌట్), ట్రిస్టన్ స్టబ్స్ (39 నాటౌట్) ఆదుకున్నారు. వీరిద్దరూ కలిసి ఐదో వికెట్‌కు అజేయంగా 119 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి లక్నో ఆశలపై నీళ్లు చల్లారు. ముఖ్యంగా సమీర్ రిజ్వీ 47 బంతుల్లో 70 పరుగులు చేసి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. రిజ్వీ తన ఇన్నింగ్స్‌లో సిక్సర్లు, ఫోర్లతో లక్నో బౌలర్లపై విరుచుకుపడ్డాడు.

35
మహమ్మద్ షమీ నిప్పులు చెరిగే బౌలింగ్ వృధా
Image Credit : X@ipl

మహమ్మద్ షమీ నిప్పులు చెరిగే బౌలింగ్ వృధా

లక్నో స్టార్ బౌలర్ మహమ్మద్ షమీ తొలి బంతికే ఢిల్లీ ఓపెనర్ కేఎల్ రాహుల్‌ను డకౌట్ చేసి సంచలనం సృష్టించాడు. ఆ తర్వాత మొహ్సిన్ ఖాన్, ప్రిన్స్ యాదవ్ కూడా తలో వికెట్ తీయడంతో ఢిల్లీ పవర్ ప్లే ముగిసేసరికి 33/4 స్కోరుతో కష్టాల్లో పడింది. ప్రిన్స్ యాదవ్ ఒకే ఓవర్లో నిస్సంక, అక్షర్ పటేల్‌ను అవుట్ చేసి ఢిల్లీని కోలుకోలేని దెబ్బ కొట్టాడు. కానీ తక్కువ స్కోరు కావడంతో లక్నో బౌలర్లు ఆధిపత్యాన్ని కొనసాగించలేకపోయారు.

45
లక్నో బ్యాటింగ్ వైఫల్యం
Image Credit : X

లక్నో బ్యాటింగ్ వైఫల్యం

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లు కూడా ఆడలేకపోయింది. 18.4 ఓవర్లలోనే 141 పరుగులకు ఆలౌట్ అయింది. రిషిబ్ పంత్ తన బ్యాటింగ్ ఆర్డర్ ను మార్చుకుని ఓపెనర్‌గా వచ్చినప్పటికీ ఆశించిన ఫలితం దక్కలేదు. నిలకడైన భాగస్వామ్యాలు లేకపోవడం, స్వల్ప వ్యవధిలో వికెట్లు కోల్పోవడం లక్నో కొంపముంచింది. ఢిల్లీ బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేసి లక్నోను తక్కువ స్కోరుకే కట్టడి చేశారు.

55
లక్నో ఓటమికి ప్రధాన కారణాలు ఏమిటి?
Image Credit : X@LucknowIPL

లక్నో ఓటమికి ప్రధాన కారణాలు ఏమిటి?

స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకునే క్రమంలో లక్నో బౌలర్లు ఏకంగా 20 ఎక్స్‌ట్రాలు సమర్పించుకోవడం వారి ఓటమిని శాసించింది. ముఖ్యంగా ఐదో బౌలర్ లోటు స్పష్టంగా కనిపించింది. ఇంపాక్ట్ సబ్ గా వచ్చిన షాబాజ్ అహ్మద్, ఐడెన్ మార్క్రామ్ వేసిన 2 ఓవర్లలోనే 29 పరుగులు రావడంతో మ్యాచ్ ఢిల్లీ వైపు మొగ్గింది. కెప్టెన్ రిషిబ్ పంత్ దురదృష్టవశాత్తు రనౌట్ కావడం కూడా లక్నో ఇన్నింగ్స్‌ను దెబ్బతీసింది.

ఢిల్లీ రికార్డు విజయం

ఈ విజయంతో ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ చరిత్రలో లక్నోపై వరుసగా 5వ విజయాన్ని నమోదు చేసింది. అలాగే ఈ సీజన్‌లో ఇప్పటివరకు జరిగిన ఐదు మ్యాచ్‌ల్లోనూ ఛేజింగ్ చేసిన జట్లే విజయం సాధించడం విశేషం. రిజ్వీ - స్టబ్స్ నెలకొల్పిన 119 పరుగుల భాగస్వామ్యం ఢిల్లీ ఐపీఎల్ చరిత్రలోనే 5వ వికెట్ లేదా అంతకంటే తక్కువ వికెట్లకు నమోదైన అత్యుత్తమ భాగస్వామ్యంగా రికార్డు సృష్టించింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
India vs Japan: జపాన్‌పై టీమిండియా థ్రిల్లింగ్ విక్టరీ.. టీ20ల్లో 200వ విజయం
Recommended image2
Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో శ్రీలంకను ఉతికేసిన భారత్.. గోల్డ్ మెడల్ మనదే
Recommended image3
India vs Sri Lanka: రిచా ఘోష్, మంధాన సిక్సర్ల సునామీ.. శ్రీలంక బౌలర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన టీమిండియా
Related Stories
Recommended image1
సచిన్‌కే సాధ్యం కాని రికార్డు.. ఏకంగా 199 సెంచరీలు, 61 వేల రన్స్ కొట్టిన మొనగాడు ఇతనే !
Recommended image2
అర్జున్ టెండూల్కర్ రోల్ మోడల్ సచిన్ కాదు.. ఆ స్టార్ క్రికెటర్ ఎవరో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved