MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2026 Final: ఐపీఎల్ ఫైనల్ లో ఈ ఆరుగురు ప్లేయర్స్ ఆడితే రచ్చ రంబోలానే !

IPL 2026 Final: ఐపీఎల్ ఫైనల్ లో ఈ ఆరుగురు ప్లేయర్స్ ఆడితే రచ్చ రంబోలానే !

IPL 2026 Final: ఐపీఎల్ 2026 ఫైనల్లో ఆర్సీబీ, జీటీ హోరాహోరీ పోరుకు సిద్ధం అయ్యాయి. టైటిల్ విజేతను నిర్ణయించడంలో ఆరుగురు ప్లేయర్లు కీలకం కానున్నారు. ఆ ప్లేయర్లు ఎవరు? ఫైనల్ లో తలపడే ఆర్సీబీ, జీటీ ప్లేయింగ్ 11 వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

3 Min read
Author : Mahesh Rajamoni
Published : May 31 2026, 07:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఐపీఎల్ 2026 ఫైనల్ రచ్చ.. గిల్ వర్సెస్ పాటిదార్‌.. గెలిచేది ఎవరో?
Image Credit : ANI

ఐపీఎల్ 2026 ఫైనల్ రచ్చ.. గిల్ వర్సెస్ పాటిదార్‌.. గెలిచేది ఎవరో?

క్రికెట్ లవర్స్ అందరూ ఈగర్‌గా వెయిట్ చేస్తున్న ఆ బిగ్ డే వచ్చేసింది. ఐపీఎల్ 2026 సీజన్ ఫైనల్ మ్యాచ్ కు రంగం సిద్ధమైంది. ఈ హై-వోల్టేజ్ పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), మాజీ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ (GT) తలపడనున్నాయి. అహ్మదాబాద్‌లోని మోదీ స్టేడియంలో రాత్రి 7:30 గంటల నుంచి ఈ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్‌పై అందరి కళ్లూ ఉన్నాయి. ఎందుకంటే రెండు టీమ్స్‌కు కూడా ఇది రెండోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచే గోల్డెన్ ఛాన్స్.

రజత్ పాటిదార్ కెప్టెన్సీలో బెంగళూరు టీమ్ లాస్ట్ ఇయర్ తన ఫస్ట్ టైటిల్ కొట్టింది. గుజరాత్ టీమ్ 2022లో తన డెబ్యూ సీజన్‌లోనే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో ఛాంపియన్‌గా నిలిచింది. ఆదివారం అహ్మదాబాద్ గ్రౌండ్‌లో ఇరు జట్ల మధ్య నెక్స్ట్ లెవెల్ ఫైట్ జరగడం పక్కా. ఈ బిగ్ ఫైనల్ మ్యాచ్ కంటే ముందు, రెండు టీమ్స్ లో ఫైనల్ రిజల్ట్ మార్చేసే ఆరుగురు కీ ప్లేయర్స్ ఎవరో తెలుసా?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
జీటీ వర్సెస్ ఆర్సీబీ హెడ్-టు-హెడ్ రికార్డ్స్ ఇవే
Image Credit : ANI

జీటీ వర్సెస్ ఆర్సీబీ హెడ్-టు-హెడ్ రికార్డ్స్ ఇవే

ఐపీఎల్ హిస్టరీలో గుజరాత్, బెంగళూరు టీమ్స్ ఇప్పటివరకు 9 మ్యాచ్‌ల్లో ఫేస్ టు ఫేస్ తలపడ్డాయి. ఇరు జట్ల రికార్డులు చాలా ఈక్వల్‌గా ఉన్నాయి. బెంగళూరు 5 మ్యాచ్‌లు గెలవగా, జీటీ 4 మ్యాచ్‌ల్లో విక్టరీ కొట్టింది. ఈరోజు రెండు టీమ్స్ 10వ సారి తలపడబోతున్నాయి. నంబర్స్ పరంగా ఆర్సీబీ ఒక మ్యాచ్ ముందంజలో ఉన్నా, గుజరాత్‌ను తక్కువ అంచనా వేయలేం. మ్యాచ్ మాత్రం ఇరు జట్ల మధ్య హోరాహోరీగా సాగడం ఖాయం.

ఈ స్టేడియంలో ఇరు జట్ల రికార్డు 1-1తో సమానంగా ఉంది. ఈ సీజన్‌లో ఇక్కడ కేవలం 3 సార్లు మాత్రమే 200 ప్లస్ స్కోరు నమోదైంది. అంటే గుజరాత్ బౌలర్లు హోమ్ కండిషన్స్ వాడుకుని బెంగళూరు బ్యాటర్లకు గట్టి టెస్ట్ పెట్టే ఛాన్స్ ఉంది.

Related Articles

Related image1
IPL 2026 Orange Cap: ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ రేసు.. వైభవ్ రికార్డును గిల్, సుదర్శన్ బ్రేక్ చేస్తారా?
Related image2
IPL 2026 Prize Money: ఐపీఎల్ 2026 ప్రైజ్ మనీ ఎంత? విన్నర్‌, రన్నరప్‌ ఎంత అందుకుంటారు?
35
ఆర్సీబీ 3 బ్రహ్మాస్త్రాలు ఇవే
Image Credit : ANI

ఆర్సీబీ 3 బ్రహ్మాస్త్రాలు ఇవే

1. విరాట్ కోహ్లీ: కింగ్ కోహ్లీ ఈ సీజన్‌లో అదిరిపోయే ఫామ్‌లో ఉన్నాడు. 15 మ్యాచ్‌ల్లో 1 సెంచరీ, 4 హాఫ్ సెంచరీలతో ఏకంగా 600 రన్స్ చేశాడు. లాస్ట్ మ్యాచ్‌లో గుజరాత్‌పై 43 రన్స్ చేసి ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. కోహ్లీ పెద్ద మ్యాచ్‌ల ప్లేయర్, కాబట్టి ఫైనల్లో ఆర్సీబీ అతని నుంచి బిగ్ ఇన్నింగ్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తోంది.

2. రజత్ పాటిదార్: కెప్టెన్ రజత్ పాటిదార్ ఈ సీజన్ మిడిల్ ఆర్డర్‌లో విధ్వంసం సృష్టిస్తున్నాడు. క్వాలిఫయర్-1లో గుజరాత్‌పైనే అజేయంగా 93 రన్స్ చేసి టీమ్ స్కోరును 250 దాటించాడు. 14 మ్యాచ్‌ల్లో 196.76 స్ట్రైక్ రేట్‌తో 486 రన్స్ బాదాడు. ఈ మ్యాచ్ లో పాటిదార్ బ్యాట్ ఝులిపిస్తే గుజరాత్‌కు చుక్కలే.

3. భువనేశ్వర్ కుమార్: స్వింగ్ సుల్తాన్ భువీ ప్రస్తుతం పర్పుల్ క్యాప్ రేసులో 15 మ్యాచ్‌ల్లో 26 వికెట్లతో సెకండ్ ప్లేస్‌లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్‌లోనూ గుజరాత్‌పై 2 వికెట్లు తీశాడు. అహ్మదాబాద్ పిచ్ ఫస్ట్ 6 ఓవర్లలో భువీకి హెల్ప్ అవ్వొచ్చు. తన స్వింగ్ బౌలింగ్‌తో జీటీ టాప్ ఆర్డర్‌ను దెబ్బతీయాలని చూస్తున్నాడు.

45
గుజరాత్ టైటాన్స్ ముగ్గురు ధురంధరులు వీళ్లే
Image Credit : ANI

గుజరాత్ టైటాన్స్ ముగ్గురు ధురంధరులు వీళ్లే

1. శుభ్‌మన్ గిల్: కెప్టెన్ శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం మైండ్ బ్లోయింగ్ ఫామ్‌లో ఉన్నాడు. క్వాలిఫయర్-2లో రాజస్థాన్‌పై 104 రన్స్ తో సెంచరీ కొట్టి మంచి టచ్ లో ఉన్నాడు. ఈ సీజన్‌లో 15 మ్యాచ్‌ల్లో 722 రన్స్ (6 హాఫ్ సెంచరీలు) చేశాడు. రిస్క్ లేని షాట్లు ఆడటంలో గిల్ స్పెషలిస్ట్. కెప్టెన్‌గా ఫస్ట్ ట్రోఫీ గెలవడానికి గిల్ రెడీగా ఉన్నాడు.

2. సాయి సుదర్శన్: ఈ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ ఈ సీజన్‌లో పరుగుల వరద పారించాడు. లాస్ట్ మ్యాచ్‌లో రాజస్థాన్‌పై 58 రన్స్ చేశాడు. గిల్‌తో కలిసి 167 రన్స్ వరల్డ్ రికార్డ్ పార్ట్‌నర్‌షిప్ బిల్డ్ చేశాడు. ఈ సీజన్ లో 16 మ్యాచ్‌ల్లో 710 రన్స్ చేశాడు. వైభవ్ సూర్యవంశీ, శుభ్‌మన్ గిల్ తర్వాత ఈ సీజన్‌లో 700 ప్లస్ రన్స్ చేసిన థర్డ్ బ్యాటర్ ఇతనే.

3. కగిసో రబాడ: సౌతాఫ్రికా స్టార్ బౌలర్ రబాడ ఈ సీజన్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ బౌలర్. 28 వికెట్లతో పర్పుల్ క్యాప్ రేసులో టాప్‌లో ఉన్నాడు. లాస్ట్ మ్యాచ్‌లో రాజస్థాన్ డేంజరస్ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ వికెట్ తీశాడు. అహ్మదాబాద్ గ్రౌండ్ రబాడకు హోమ్ గ్రౌండ్ కాబట్టి ఇక్కడ మరింత డేంజరస్‌గా మారే ఛాన్స్ ఉంది.

55
ఫైనల్ మ్యాచ్ కోసం ఇరు జట్ల అంచనా ప్లేయింగ్ 11
Image Credit : ANI

ఫైనల్ మ్యాచ్ కోసం ఇరు జట్ల అంచనా ప్లేయింగ్ 11

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: విరాట్ కోహ్లీ, వెంకటేష్ అయ్యర్, దేవదత్ పడిక్కల్, రజత్ పాటిదార్ (కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, జాకబ్ డఫీ, జోష్ హేజిల్‌వుడ్, రసిఖ్ సలామ్ దార్, రొమారియో షెపర్డ్.

గుజరాత్ టైటాన్స్ : శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), సాయి సుదర్శన్, జోస్ బట్లర్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, నిశాంత్ సింధు, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, కుల్వంత్ ఖేజ్రోలియా, కగిసో రబాడ, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, రాహుల్ తెవాటియా.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Recommended image2
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image3
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Related Stories
Recommended image1
IPL 2026 Orange Cap: ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ రేసు.. వైభవ్ రికార్డును గిల్, సుదర్శన్ బ్రేక్ చేస్తారా?
Recommended image2
IPL 2026 Prize Money: ఐపీఎల్ 2026 ప్రైజ్ మనీ ఎంత? విన్నర్‌, రన్నరప్‌ ఎంత అందుకుంటారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved