MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Sports
  • Cricket
  • IPL 2026 Prize Money: ఐపీఎల్ 2026 ప్రైజ్ మనీ ఎంత? విన్నర్‌, రన్నరప్‌ ఎంత అందుకుంటారు?

IPL 2026 Prize Money: ఐపీఎల్ 2026 ప్రైజ్ మనీ ఎంత? విన్నర్‌, రన్నరప్‌ ఎంత అందుకుంటారు?

IPL 2026 Prize Money: ఐపీఎల్ 2026 ఫైనల్స్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, గుజరాత్ టైటాన్స్ జట్లు తలపడనున్నాయి. విన్నర్, రన్నరప్‌తో పాటు టాప్ 4 జట్లకు కోట్ల రూపాయల ప్రైజ్ మనీ దక్కనుంది. ఆ వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : May 31 2026, 07:18 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కోట్ల వర్షం కురిపించనున్న ఐపీఎల్ 2026
Image Credit : Getty

కోట్ల వర్షం కురిపించనున్న ఐపీఎల్ 2026

ఐపీఎల్ 2026 సీజన్ ముగింపు దశకు వచ్చేసింది. ఈ మెగా టోర్నీ ఫైనల్ మ్యాచ్ తర్వాత ఇచ్చే భారీ ప్రైజ్ మనీ ఇప్పుడు క్రికెట్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఏడాది ఐపీఎల్‌లో టాప్ ఫోర్ స్థానాల్లో నిలిచిన జట్లకు కలిపి మొత్తంగా సుమారు ₹46.5 కోట్ల ప్రైజ్ మనీ దక్కనుంది.

కేవలం టీమ్‌లకు మాత్రమే కాకుండా.. టోర్నీలో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఆటగాళ్లకు కూడా భారీగా క్యాష్ ప్రైజ్‌లు అందనున్నాయి. సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆరెంజ్ క్యాప్ విన్నర్, అత్యధిక వికెట్లు తీసిన పర్పుల్ క్యాప్ విన్నర్‌తో పాటు 'మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్' అవార్డు గెలుచుకునే వారికి తలా ₹10 లక్షల చొప్పున ప్రైజ్ మనీ లభించనుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
అహ్మదాబాద్‌లో బిగ్ ఫైట్.. రెండో ట్రోఫీపై గురి
Image Credit : stockPhoto

అహ్మదాబాద్‌లో బిగ్ ఫైట్.. రెండో ట్రోఫీపై గురి

ఈ ఏడాది ఐపీఎల్ 2026 ఫైనల్ మ్యాచ్ ఆదివారం సాయంత్రం 7:30 గంటల నుంచి అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో ఏ టీమ్ గెలిచినా.. వారు రెండోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడినట్లు అవుతుంది.

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గత ఏడాది ఐపీఎల్ 2025లో ఛాంపియన్‌గా నిలిచింది. దీంతో ఆర్‌సీబీకి వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచే గోల్డెన్ ఛాన్స్ ఉంది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్ 2022లో ట్రోఫీని సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ జట్టుకు నాలుగేళ్ల తర్వాత మళ్లీ రెండోసారి ఛాంపియన్‌గా నిలిచే అవకాశం వచ్చింది.

Related Articles

Related image1
IPL 2026 Orange Cap: ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ రేసు.. వైభవ్ రికార్డును గిల్, సుదర్శన్ బ్రేక్ చేస్తారా?
Related image2
Riyan Parag Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని రియాన్ పరాగ్ తిట్టాడా? వైరల్ వీడియో
35
ఎవరికి ఎంత ప్రైజ్ మనీ?
Image Credit : ANI

ఎవరికి ఎంత ప్రైజ్ మనీ?

ఐపీఎల్ 2026 ఫైనల్ ముగిసిన తర్వాత ప్రైజ్ మనీ వర్షం కురవనుంది. ఈ సారి ఛాంపియన్‌గా నిలిచే జట్టు మెరిసే ఐపీఎల్ ట్రోఫీతో పాటు ₹20 కోట్ల భారీ ప్రైజ్ మనీని సొంతం చేసుకుంటుంది. అలాగే ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోయి రన్నరప్‌గా నిలిచే టీమ్‌కు ₹13 కోట్లు దక్కుతాయి.

ఇక క్వాలిఫైయర్-2 లో ఓడిపోయిన రాజస్థాన్ రాయల్స్ (RR) టీమ్‌కు ₹7 కోట్లు లభిస్తాయి. ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఓటమి పాలైన సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టుకు ₹6.5 కోట్ల ప్రైజ్ మనీ అందనుంది.

45
ఐపీఎల్ చరిత్రలో ఏ టీమ్ ఎన్నిసార్లు గెలిచింది?
Image Credit : ANI

ఐపీఎల్ చరిత్రలో ఏ టీమ్ ఎన్నిసార్లు గెలిచింది?

ఐపీఎల్ హిస్టరీని చూస్తే ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మోస్ట్ సక్సెస్‌ఫుల్ టీమ్స్‌గా ఉన్నాయి. ఇప్పటివరకు ఏ జట్టు ఎన్నిసార్లు ఐపీఎల్ టైటిల్ గెలిచిందో ఆ లిస్ట్ ఇక్కడ చూద్దాం...

1. ముంబై ఇండియన్స్ - 5 సార్లు (2013, 2015, 2017, 2019, 2020) - కెప్టెన్ రోహిత్ శర్మ

2. చెన్నై సూపర్ కింగ్స్ - 5 సార్లు (2010, 2011, 2018, 2021, 2023) - కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని

3. కోల్‌కతా నైట్ రైడర్స్ - 3 సార్లు (2012, 2014, 2024) - కెప్టెన్ గౌతమ్ గంభీర్, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్

4. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు - ఒక సారి (2025) - కెప్టెన్ రజత్ పాటిదార్

5. సన్‌రైజర్స్ హైదరాబాద్ - ఒక సారి (2016) - కెప్టెన్ డేవిడ్ వార్నర్

6. డెక్కన్ చార్జర్స్ హైదరాబాద్ - ఒక సారి (2009) - కెప్టెన్ ఆడమ్ గిల్‌క్రిస్ట్

7. రాజస్థాన్ రాయల్స్ - ఒక సారి (2008) - కెప్టెన్ షేన్ వార్న్

8. గుజరాత్ టైటాన్స్ - ఒక సారి (2022) - కెప్టెన్ హార్దిక్ పాండ్యా

55
ఐపీఎల్ 2026 ప్రైజ్ మనీ లిస్ట్
Image Credit : ANI

ఐపీఎల్ 2026 ప్రైజ్ మనీ లిస్ట్

• ఐపీఎల్ 2026 విన్నర్ టీమ్: ₹20 కోట్లు

• ఐపీఎల్ 2026 రన్నరప్ టీమ్: ₹13 కోట్లు

• క్వాలిఫైయర్-2 లో ఓడిన టీమ్ (RR): ₹7 కోట్లు

• ఎలిమినేటర్ లో ఓడిన టీమ్ (SRH): ₹6.5 కోట్లు

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రీడలు
క్రికెట్
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Dhruv Jure: 9 ఏళ్ల హార్దిక్ పాండ్యా రికార్డు ఖేల్ ఖతం.. శ్రీలంకలో ధ్రువ్ జురెల్ రచ్చ రచ్చ !
Recommended image2
Devdutt Padikkal: దేవదత్ పడిక్కల్ వరల్డ్ రికార్డు.. శ్రీలంకపై సెంచరీతో ద్రవిడ్ 27 ఏళ్ల ఆల్ టైమ్ రికార్డ్ బద్దలు
Recommended image3
భారత్ శ్రీలంక టెస్టులో ప్లేయర్స్ మధ్య వాగ్వాదం.. అసలేం జరిగింది? తొలిరోజు ఆధిప‌త్యం ఎవ‌రిదంటే
Related Stories
Recommended image1
IPL 2026 Orange Cap: ఐపీఎల్ ఆరెంజ్ క్యాప్ రేసు.. వైభవ్ రికార్డును గిల్, సుదర్శన్ బ్రేక్ చేస్తారా?
Recommended image2
Riyan Parag Vaibhav Suryavanshi: వైభవ్ సూర్యవంశీని రియాన్ పరాగ్ తిట్టాడా? వైరల్ వీడియో
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved