సెంచరీ కొట్టిన సంజూ శాంసన్.. గౌతమ్ గంభీర్ కు కొత్త తలనొప్పి
Sanju Samson: కేఎస్ఎల్‌లో సంజూ శాంసన్ సెంచరీతో అదరగొట్టాడు. తన సునామీ నాక్ తో తిరిగి ఫామ్ ను అందుకున్నాడు. ఆసియా కప్ 2025 కి ముందు గౌతమ్ గంభీర్ కు కొత్త తలనొప్పి తీసుకొచ్చాడు.

సెంచరీతో ఫామ్ లోకి తిరిగొచ్చిన సంజూ శాంసన్
ఆసియా కప్ 2025 కి ముందు కెరళ క్రికెట్ లీగ్‌లో (కేఎస్ఎల్) సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శన చేశాడు. మొదటి రెండు మ్యాచ్‌లలో నిరాశ పరిచిన అతను.. మూడో మ్యాచ్‌లో సెంచరీతో తిరిగి ఫామ్‌లోకి వచ్చాడు. కేవలం 42 బంతుల్లో 121 పరుగుల సూపర్ సెంచరీ నాక్ తో దుమ్మురేపాడు. ఈ సెంచరీ ఇన్నింగ్స్ తో ఆసియా కప్ 2025కి ముందు టీమిండియా సెలెక్టర్లు, ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ ను ఒత్తిడిలోకి నెట్టాడు.
KNOW
సంజూ శాంసన్ సెంచరీతో సెలెక్టర్లపై ఒత్తిడి ఎందుకు పెరుగుతోంది?
ఇటీవలే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆసియా కప్ 2025 కోసం 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. భారత్ జట్టులో శుభ్‌మన్ గిల్ కు చోటుదక్కింది. గిల్ వైస్ కెప్టెన్ గా ఉండగా, సూర్య కుమార్ యాదవ్ కెప్టెన్ గా ఉన్నాడు. భారత జట్టులో ఉన్న అభిషేక్ శర్మ కూడా మంచి ఫామ్‌లో ఉన్నాడు.
గిల్, సంజూ, అభిషేక్ శర్మ.. ముగ్గురు ప్లేయర్ల కూడా ఓపెనింగ్ కోసం పోటీ పడుతున్నారు. సంజూ శాంసన్ సెంచరీ చేయడంతో అతనికి ఆసియా కప్ తుది జట్టులో స్థానం ఇవ్వాలని ఒత్తిడి పెరిగింది. సెలెక్టర్ అజిత్ అగార్కర్ మొదట సంజూను ఓపెనర్‌గా ఆలోచించారు. కానీ గిల్ రావడంతో మొదటి రెండు మ్యాచ్‌లలో మిడిల్ ఆర్డర్ ఫినిషర్‌గా ఆడించాలనుకున్నారు. తాజా సెంచరీతో ఓపెనర్ ప్లేస్ తనకే దక్కాలనే సంకేతాలు పంపాడు.
గౌతమ్ గంభీర్‌కు కొత్త సవాలు
భారత జట్టు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇప్పటినుంచే శుభ్‌మన్ గిల్‌ను భవిష్యత్ కెప్టెన్‌గా ప్రోత్సహిస్తున్నాడు. ఇంగ్లాండ్ సిరీస్‌లో గిల్ 754 పరుగులతో అద్భుతంగా రాణించాడు. ఈ ఫామ్ చూసే అతన్ని టీ20 జట్టులోకి తీసుకున్నారు. అలాగే, వైస్ కెప్టెన్సీ కూడా ఇచ్చారు.
కానీ సంజూ శాంసన్ సెంచరీ చేయడంతో గంభీర్ ముందుకు కొత్త తలనొప్పి వచ్చింది. గిల్, అభిషేక్, సంజూ.. ఈ ముగ్గురిలో ఎవరికి స్థానం దక్కుతుంది అనేది ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. గత సిరీస్ లలో సంజూ శాంసన్, అభిషేక్ శర్మలు ఓపెనింగ్ చేశారు. ఇద్దరు అద్భుతంగా రాణించారు. సెంచరీల మోత మోగించారు.
కేఎస్ఎల్‌లో సంజూ శాంసన్ సూపర్ షో
కొచ్చి బ్లూ టైగర్స్ తరఫున సంజూ శాంసన్ మొదటి రెండు మ్యాచ్‌లలో మిడిల్ ఆర్డర్ లో ఆడి విఫలమయ్యాడు. రెండవ మ్యాచ్‌లో 22 బంతుల్లో కేవలం 13 పరుగులు చేశాడు. ఇక మూడో మ్యాచ్‌లో ఓపెనర్‌గా వచ్చి 14 ఫోర్లు, 7 సిక్సర్లతో సెంచరీ సాధించాడు. చివరి బంతికి బ్లూ టైగర్స్ గెలిచినా, సంజూ శాంసన్ ఇన్నింగ్స్ మ్యాచ్ లో హైలెట్ గా నిలిచింది.
ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు
ఆసియా కప్ 2025 కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. 15 మంది ప్లేయర్లతో కూడిన ఈ జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా ఉన్నాడు. గిల్ వైస్ కెప్టెన్ గా ఉన్నాడు.
సూర్యకుమార్ యాదవ్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, రింకూ సింగ్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్, శివం దూబే, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా.