తెలుగోడా.. మజాకానా.! టీ20ల్లో తోపు బ్యాటర్‌గా.. కోహ్లీ స్థానాన్ని భర్తీ చేసేశాడుగా
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్లు జోరు కొనసాగిస్తున్నారు. అభిషేక్ శర్మ బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలో నిలవగా, తిలక్ వర్మ టాప్ 5లోకి దూసుకెళ్లాడు. బౌలింగ్ విభాగంలో వరుణ్ చక్రవర్తి సరికొత్త చరిత్ర సృష్టించి టాప్ 10లోకి..

టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్ల జోరు..
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్ల జోరు కొనసాగుతోంది. తాజాగా విడుదలైన ర్యాంకింగ్స్‌లో యువ ఓపెనర్ అభిషేక్ శర్మ బ్యాటింగ్ విభాగంలో తన అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నాడు. 909 రేటింగ్ పాయింట్లతో తిరుగులేని పొజిషన్‌లో ఉన్న అభిషేక్, రెండో స్థానంలో ఉన్న ఇంగ్లండ్ ఆటగాడు ఫిల్ సాల్ట్ కంటే 60 పాయింట్లు ఎక్కువగా ఉన్నాడు. శ్రీలంక ఆటగాడు నిస్సంక మూడో స్థానంలో నిలిచాడు. ఇటీవల అద్భుతమైన ఫామ్‌లో ఉన్న తిలక్ వర్మ ఆరో స్థానం నుంచి నాలుగు స్థానానికి దూసుకెళ్లి టాప్ 5లోకి ఎంటర్ అయ్యాడు. అతడు 774 రేటింగ్ పాయింట్లతో ఐదో ర్యాంక్‌కు వచ్చాడు.
టాప్ 10లో సూర్యకుమార్ యాదవ్..
టాప్ 10లో సూర్యకుమార్ యాదవ్ కూడా చోటు దక్కించుకున్నప్పటికీ, పేలవమైన ఫామ్ కారణంగా ఒక స్థానం కోల్పోయి తొమ్మిదో ర్యాంక్ నుంచి పదో ర్యాంక్‌కు పడిపోయాడు. సౌత్ ఆఫ్రికా ఆటగాడు డెవాల్డ్ బ్రెవిస్ ఏడు స్థానాలు కోల్పోయి ఎనిమిదో ర్యాంక్ నుంచి 15వ ర్యాంక్‌కు పడిపోగా, సఫారీ జట్టు కెప్టెన్ మార్ క్రమ్ ఎనిమిది స్థానాలు ఎగబాకి 29వ ర్యాంక్‌లో నిలిచాడు. గిల్ రెండు స్థానాలు కోల్పోయి 30వ ర్యాంక్‌కు, సంజూ శాంసన్ మూడు స్థానాలు కోల్పోయి 46వ ర్యాంక్‌కు చేరుకున్నారు. క్వింటన్ డికాక్ 14 స్థానాలు జంప్ చేసి 43వ ర్యాంక్‌కు చేరడం గమనార్హం.
టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో..
టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో వరుణ్ చక్రవర్తి సరికొత్త చరిత్ర సృష్టించాడు. 818 రేటింగ్ పాయింట్లతో ఓవరాల్‌గా అత్యధిక రేటింగ్ పాయింట్లు సాధించిన టాప్ 10 బౌలర్ల జాబితాలో చేరాడు. ప్రస్తుత ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ బౌలర్ జాకబ్ డఫ్ఫీ 699 రేటింగ్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు. ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ రషీద్ ఖాన్ మూడో స్థానంలో, పాకిస్థాన్ బౌలర్ అబ్రర్ అహ్మద్ నాలుగో స్థానంలో, శ్రీలంక ప్లేయర్ వనిందు హసరంగా ఐదో స్థానాన్ని నిలబెట్టుకున్నారు.
భారత బౌలర్లు ఇలా..
భారత బౌలర్లలో అక్షర్ పటేల్ 13వ ర్యాంక్‌లో కొనసాగగా, అర్షదీప్ సింగ్ నాలుగు స్థానాలు మెరుగుపడి 16వ ర్యాంక్‌కు, కుల్దీప్ యాదవ్ ఒక స్థానం మెరుగుపడి 23వ ర్యాంక్‌కు చేరుకున్నారు. సౌత్ ఆఫ్రికా బౌలర్ మార్కో యాన్సన్ 14 స్థానాలు ఎగబాకి 25వ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. బూమ్రా 28వ ర్యాంక్, రవి బిష్ణోయ్ 30వ ర్యాంకుల్లో ఉన్నారు.
ఆల్‌రౌండర్ల జాబితాలో భారత్ నుంచి ఇద్దరు..
టీ20ల్లో టాప్ 10 ఆల్‌రౌండర్ల జాబితాలో భారత్ నుంచి ఇద్దరు ప్లేయర్లు చోటు దక్కించుకున్నారు. హార్దిక్ పాండ్యా నాలుగో ర్యాంక్‌ను నిలబెట్టుకోగా, అక్షర్ పటేల్ తొమ్మిదో ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. శివమ్ దూబే నాలుగు స్థానాలు ఎగబాకి 20వ ర్యాంక్ నుంచి 16వ ర్యాంక్‌కు చేరుకోగా, అభిషేక్ శర్మ రెండు స్థానాలు కోల్పోయి 19వ ర్యాంక్‌కు పడిపోయాడు. పాకిస్థాన్ ప్లేయర్ సయ్యం అయూబ్ 295 రేటింగ్ పాయింట్లతో ఆల్‌రౌండర్ల విభాగంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. వాషింగ్టన్ సుందర్ రెండు స్థానాలు కోల్పోయి 36వ ర్యాంక్‌కు చేరుకున్నాడు.

