MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • RCB : ఇదెక్కడి మాస్‌రా మావా.. 75 పరుగులకే ఢిల్లీ ఫినిష్.. 9000 పరుగులతో కోహ్లీ రచ్చ !

RCB : ఇదెక్కడి మాస్‌రా మావా.. 75 పరుగులకే ఢిల్లీ ఫినిష్.. 9000 పరుగులతో కోహ్లీ రచ్చ !

RCB : ఐపీఎల్ 2026లో ఢిల్లీ క్యాపిటల్స్‌ను 75 పరుగులకే ఆలౌట్ చేసి, కేవలం 6.3 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి ఆర్సీబీ చరిత్రాత్మక విజయం నమోదు చేసింది. విరాట్ కోహ్లీ తొలి ప్లేయర్ గా మరో అద్భుతమైన రికార్డును అందుకున్నాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 27 2026, 10:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఆర్సీబీ ఊచకోత.. ఢిల్లీ విలవిల.. రికార్డుల వేటలో బెంగళూరు
Image Credit : X/RCBTweets

ఆర్సీబీ ఊచకోత.. ఢిల్లీ విలవిల.. రికార్డుల వేటలో బెంగళూరు

ఐపీఎల్ 2026లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగిన 39వ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు, ఢిల్లీ క్యాపిటల్స్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. బౌలింగ్‌లోనూ, బ్యాటింగ్‌లోనూ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన ఆర్సీబీ, 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించి రికార్డుల మోత మోగించింది.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఆరంభం నుంచే కష్టాలు మొదలయ్యాయి. ఆర్సీబీ బౌలర్లు జోష్ హేజిల్ వుడ్, భువనేశ్వర్ కుమార్ కొత్త బంతితో నిప్పులు చెరిగారు. కేవలం 4 ఓవర్లలోనే ఢిల్లీ 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. హేజిల్ వుడ్ తన స్పెల్‌లో కేవలం 12 పరుగులే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టి ఢిల్లీని కోలుకోలేని దెబ్బకొట్టాడు. భువనేశ్వర్ కుమార్ కూడా అద్భుతంగా బౌలింగ్ చేసి కీలక వికెట్లు తీయడంతో ఢిల్లీ కోలుకోలేకపోయింది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
75 పరుగులకే ఆలౌట్.. ఢిల్లీ అత్యల్ప స్కోరు ఇదే
Image Credit : ANI

75 పరుగులకే ఆలౌట్.. ఢిల్లీ అత్యల్ప స్కోరు ఇదే

ఢిల్లీ బ్యాటర్లలో ఎవరూ కూడా క్రీజులో నిలబడలేకపోయారు. అభిషేక్ పోరెల్ (30), డేవిడ్ మిల్లర్ (19) కొంత సేపు క్రీజులో ఉన్నారు. కానీ, మిగిలిన వారు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. వరుస వికెట్లు పడటంతో ఢిల్లీ క్యాపిటల్స్ 16.3 ఓవర్లలో కేవలం 75 పరుగులకే కుప్పకూలింది. ఐపీఎల్ చరిత్రలో ఢిల్లీకి ఇది మూడో అత్యల్ప స్కోరుగా నమోదైంది.

Related Articles

Related image1
Super Over : సూపర్ ఓవర్ మజా.. ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ థ్రిల్లర్.. రింకూ సింగ్ దెబ్బకు లక్నో ఖేల్ ఖతం !
Related image2
MS Dhoni : ఐపీఎల్ 2026లో ధోనీ ఎందుకు ఆడటం లేదు? రిటైర్మెంట్ నిజమేనా?
35
విరాట్ కోహ్లీ అరుదైన మైలురాయి.. 9000 పరుగులు పూర్తి
Image Credit : ANI

విరాట్ కోహ్లీ అరుదైన మైలురాయి.. 9000 పరుగులు పూర్తి

చిన్న లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఓపెనర్లు అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. ఈ క్రమంలో రన్ మెషీన్ విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో 9000 పరుగుల మైలురాయిని చేరుకుని చరిత్ర సృష్టించాడు. అక్షర్ పటేల్ వేసిన ఓవర్‌లో సింగిల్ తీయడం ద్వారా కోహ్లీ ఈ ఘనత సాధించాడు. స్టేడియం అంతా కోహ్లీ.. కోహ్లీ అనే నినాదాలతో హోరెత్తిపోయింది.

45
మెరుపు వేగంతో ఛేదన.. పడిక్కల్ విధ్వంసం
Image Credit : X/RCBTweets

మెరుపు వేగంతో ఛేదన.. పడిక్కల్ విధ్వంసం

లక్ష్యం చిన్నదే అయినా ఆర్సీబీ బ్యాటర్లు ఏమాత్రం తగ్గలేదు. ముఖ్యంగా దేవదత్ పడిక్కల్ సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 13 బంతుల్లోనే 34 పరుగులు చేసి జట్టు విజయాన్ని చాలా ఈజీగానే అందించాడు. మరోవైపు విరాట్ కోహ్లీ (12 బంతుల్లో 23 పరుగులు) సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించి జట్టుకు ఘనవిజయాన్ని అందించాడు. ఆర్సీబీ కేవలం 6.3 ఓవర్లలోనే ఒక వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

55
రికార్డుల మోత మోగించిన మ్యాచ్
Image Credit : X/RCBTweets

రికార్డుల మోత మోగించిన మ్యాచ్

ఈ మ్యాచ్ పలు రికార్డులు నమోదయ్యాయి. వాటిలో..

• జోష్ హేజిల్ వుడ్ (4/12) తన టీ20 కెరీర్‌లో అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు.

• విరాట్ కోహ్లీ ఐపీఎల్‌లో 9000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా నిలిచాడు.

• ఢిల్లీ క్యాపిటల్స్ పవర్‌ప్లేలో 9 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి అత్యంత ఘోరమైన ఆరంభాన్ని చవిచూసింది.

• భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్‌లో అత్యధిక సార్లు 3 వికెట్లు తీసిన పేసర్ల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నాడు.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
విరాట్ కోహ్లీ
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
ICC Rankings 2026 : వరల్డ్ క్రికెట్లో హైదరబాద్ హవా.. ఐసిసి ర్యాంకింగ్స్ లో టాప్ లేపిన పట్నం పోటుగాళ్లు
Recommended image2
IND vs ENG: వైభవ్ సూర్యవంశీ గురించి నాకు తెలియదు.. శ్రేయాస్ అయ్యర్ షాకింగ్ కామెంట్స్
Recommended image3
Team India: వరల్డ్ కప్ పోయింది.. ఏషియన్ గేమ్స్‌లో గోల్డ్ కొట్టాల్సిందే.. ఐదుగురు కొత్త ప్లేయర్లకు బంపర్ ఛాన్స్ !
Related Stories
Recommended image1
Super Over : సూపర్ ఓవర్ మజా.. ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ థ్రిల్లర్.. రింకూ సింగ్ దెబ్బకు లక్నో ఖేల్ ఖతం !
Recommended image2
MS Dhoni : ఐపీఎల్ 2026లో ధోనీ ఎందుకు ఆడటం లేదు? రిటైర్మెంట్ నిజమేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved