MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Forecast
Today's Rasi Phalalu
Women's Asia Cup 2026
Smriti Mandhana
Sahaa Movie Review
Bigg Boss Telugu
Chiranjeevi's Mother
Romanchakam Movie Review
Allari Naresh
Tollywood Cinema
Hardik Pandya
Team India T20 Squad
Irumudi 12 Days Collections
Hello Brother Movie Review
Andhra Pradesh Startup Hub
Horror Movies Streaming on OTT
Ishtakameshwari Temple
  • Home
  • Sports
  • Cricket
  • Super Over : సూపర్ ఓవర్ మజా.. ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ థ్రిల్లర్.. రింకూ సింగ్ దెబ్బకు లక్నో ఖేల్ ఖతం !

Super Over : సూపర్ ఓవర్ మజా.. ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ థ్రిల్లర్.. రింకూ సింగ్ దెబ్బకు లక్నో ఖేల్ ఖతం !

Super Over : ఐపీఎల్ 2026లో మొదటి సూపర్ ఓవర్ మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఉత్కంఠ విజయం సాధించింది. రింకూ సింగ్ ఆల్ రౌండ్ షోతో లక్నోకు షాక్ ఇచ్చింది. ఈ మ్యాచ్ ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ థ్రిల్లర్ గా నిలిచింది. ఆ వివరాలు మీకోసం.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Apr 27 2026, 08:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఏం మ్యాచ్ గురూ.. అదిరిపోయింది అంతే.. !
Image Credit : ANI

ఏం మ్యాచ్ గురూ.. అదిరిపోయింది అంతే.. !

ఐపీఎల్ 2026లో భాగంగా ఆదివారం లక్నోలోని ఏకానా స్టేడియంలో జరిగిన మ్యాచ్ క్రికెట్ అభిమానులకు అసలైన మజాను పంచింది. ఉత్కంఠగా సాగిన ఈ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ పై కోల్‌కతా నైట్ రైడర్స్ సూపర్ ఓవర్ థ్రిల్లర్ విజయాన్ని అందుకుంది. షారుఖ్ ఖాన్ జట్టు అద్భుత ప్రదర్శనతో మైదానంలో పండుగ వాతావరణం నెలకొంది.

టాస్ గెలిచిన లక్నో సూపర్ జెయింట్స్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 155 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో లక్నో సైతం సరిగ్గా 20 ఓవర్లలో 8 వికెట్లకు 155 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది. చివరి ఓవర్లో గెలవడానికి 17 పరుగులు అవసరం కాగా, మహ్మద్ షమీ ఆఖరి బంతికి సిక్సర్ బాది మ్యాచ్‌ను సూపర్ ఓవర్‌కు చేర్చాడు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
రింకూ సింగ్ వన్ మ్యాన్ షో
Image Credit : ANI

రింకూ సింగ్ వన్ మ్యాన్ షో

ఈ మ్యాచ్ కేకేఆర్ స్టార్ ప్లేయర్ రింకూ సింగ్‌కు చిరకాలం గుర్తుండిపోతుంది. బ్యాటింగ్‌లో 83 నాటౌట్ పరుగులతో రాణించడమే కాకుండా, ఫీల్డింగ్‌లోనూ 4 అద్భుతమైన క్యాచ్‌లు అందుకున్నాడు. ముఖ్యంగా చివరి ఓవర్లలో రింకూ బాదిన ఫోర్లు, సిక్సర్లు కేకేఆర్‌కు గౌరవప్రదమైన స్కోరును అందించాయి. ఈ సూపర్ నాక్ తో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు లభించింది.

Related Articles

Related image1
IPL : 264 కొట్టినా ఓడిపోయిన ఢిల్లీ.. జరిగిందే ఇదే బాసూ.. అసలు విలన్ ఎవరో తెలుసా?
Related image2
MS Dhoni : ఐపీఎల్ 2026లో ధోనీ ఎందుకు ఆడటం లేదు? రిటైర్మెంట్ నిజమేనా?
35
మొహ్సిన్ ఖాన్ ఐదు వికెట్ల వేట
Image Credit : ANI

మొహ్సిన్ ఖాన్ ఐదు వికెట్ల వేట

లక్నో బౌలర్ మొహ్సిన్ ఖాన్ అద్భుతమైన బౌలింగ్‌తో కేకేఆర్ బ్యాటర్లను వణికించాడు. 4 ఓవర్లలో కేవలం 23 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి తన కెరీర్ బెస్ట్ గణాంకాలను నమోదు చేశాడు. కేకేఆర్ కెప్టెన్ రహానే, ఆల్ రౌండర్ కామెరాన్ గ్రీన్ వంటి కీలక వికెట్లను మొహ్సిన్ పడగొట్టి లక్నోను పటిష్ట స్థితిలో నిలిపాడు.

45
థ్రిల్లింగ్ డ్రామా.. సూపర్ ఓవర్‌ ఎలా సాగింది అంటే?
Image Credit : our own

థ్రిల్లింగ్ డ్రామా.. సూపర్ ఓవర్‌ ఎలా సాగింది అంటే?

సూపర్ ఓవర్లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నోకు సునీల్ నరైన్ చుక్కలు చూపించాడు. కేవలం 1 పరుగు మాత్రమే ఇచ్చి నికోలస్ పూరన్, ఐడెన్ మార్క్రామ్ వికెట్లను తీసి లక్నోను దెబ్బకొట్టాడు. 

లక్నో సూపర్ జెయింట్స్ బ్యాటింగ్ (సూపర్ ఓవర్)

• మొదటి బంతి: సునీల్ నరైన్ వేసిన మొదటి బంతిని నికోలస్ పూరన్ స్లాగ్ స్వీప్ చేయడానికి ప్రయత్నించి క్లీన్ బౌల్డ్ అయ్యాడు. లక్నో సున్నా పరుగులకే మొదటి వికెట్ కోల్పోయింది.

• రెండవ బంతి: రిషబ్ పంత్ క్రీజులోకి వచ్చి సింగిల్ తీసి ఐడెన్ మార్క్రామ్‌కు స్ట్రైక్ ఇచ్చాడు.

• మూడవ బంతి: మార్క్రామ్ భారీ షాట్‌కు ప్రయత్నించగా, లాంగ్ ఆఫ్ వద్ద రోవ్మాన్ పావెల్ అద్భుతంగా బంతిని గాలిలోకి విసిరి, లోపలికి వస్తున్న రింకూ సింగ్‌కు అందించాడు. వీరిద్దరి రిలే క్యాచ్‌తో మార్క్రామ్ అవుటయ్యాడు.

• దీంతో లక్నో సూపర్ ఓవర్‌లో కేవలం 1 పరుగు మాత్రమే చేసి 2 వికెట్లు కోల్పోయింది. ఇది ఐపీఎల్ సూపర్ ఓవర్ చరిత్రలో నమోదైన అత్యల్ప స్కోరు.

కోల్‌కతా నైట్ రైడర్స్ బ్యాటింగ్ (సూపర్ ఓవర్)

• కేకేఆర్ ముందు కేవలం 2 పరుగుల స్వల్ప లక్ష్యం ఉంది.

• లక్నో తరఫున ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ చేయగా, కేకేఆర్ ఓపెనర్లుగా రింకూ సింగ్, రోవ్మాన్ పావెల్ బరిలోకి దిగారు.

• మొదటి బంతి: ప్రిన్స్ యాదవ్ వేసిన వైడ్ యార్కర్‌ను రింకూ సింగ్ నేర్పుగా బ్యాట్ ఫేస్ ఓపెన్ చేసి ఫోర్ కొట్టాడు.

• దీంతో మొదటి బంతికే కోల్‌కతా విజయం సాధించి, ఉత్కంఠ పోరును ముగించింది.

మొత్తంగా ఈ మ్యాచ్‌లో 83 పరుగులతో పాటు 4 క్యాచ్‌లు పట్టిన రింకూ సింగ్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు.

55
లక్నో వరుస పరాజయాలు
Image Credit : X/@sarkarstix

లక్నో వరుస పరాజయాలు

సొంత మైదానంలో లక్నో సూపర్ జెయింట్స్ కు ఇది వరుసగా 8వ ఓటమి. తాజా పరాజయంతో పాయింట్ల పట్టికలో ఆ జట్టు చివరి స్థానానికి పడిపోయింది. వరుసగా 5 మ్యాచ్‌ల్లో ఓడిపోవడం లక్నో జట్టుకు ఇదే తొలిసారి. మరోవైపు ఈ గెలుపుతో కేకేఆర్ క్యాంప్‌లో జోష్ పెరిగింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఇండియన్ ప్రీమియర్ లీగ్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
టీమిండియా దెబ్బ‌కు పాకిస్థాన్ చిత్తు.. ఆసియాక‌ప్‌లో దుమ్మురేపిన అమ్మాయిలు
Recommended image2
భార‌త్ బౌలింగ్ దెబ్బ‌కు పాక్ విల‌విల‌.. 55 ప‌రుగుల‌కే కుప్పకూలిన పాకిస్థాన్ జ‌ట్టు
Recommended image3
Asia Cup 2026: హాంగ్‌కాంగ్‌ను దంచికొట్టారు.. ఆసియా కప్ 2026 సెమీస్‌కు దూసుకెళ్లిన భారత్
Related Stories
Recommended image1
IPL : 264 కొట్టినా ఓడిపోయిన ఢిల్లీ.. జరిగిందే ఇదే బాసూ.. అసలు విలన్ ఎవరో తెలుసా?
Recommended image2
MS Dhoni : ఐపీఎల్ 2026లో ధోనీ ఎందుకు ఆడటం లేదు? రిటైర్మెంట్ నిజమేనా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved